Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026
కార్తీకమాసంలో ఈ శివాలయాన్ని దర్శించుకుంటే.. రెండు రోజుల్లో కోరికలు నెరవేరుతాయట.. ఆలయం ఎక్కడుందంటే?
కార్తీక మాసం మొదలయ్యింది. హిందువులందరూ ఈ మాసంలో ప్రత్యేకంగా శివాలయాలకు వెళ్లి చేస్తుంటారు. శివుడికి దీపం పెట్టి ఆరాధిస్తూ ఉంటారు. అందుకే శైవ క్షేత్రాలకు వెళ్లడం, శైవ లింగాలకు పూజించడం చేస్తుంటారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో సైతం కొన్ని శైవ క్షేత్రాలు ఉన్నాయి. ఒక్క ఏపీలోనే అయిదు శైవ క్షేతాలు ఉన్నాయి. వాటినే పంచారామాలు అని కూడా పిలుస్తుంటారు.
వాటిలో అత్యంత ముఖ్యమైనది, అత్యంత విశిష్టమైనది కుమారస్వామి స్వయంభుగా ప్రతిష్టించినట్లుగా చెబుతున్న కుమార భీమేశ్వరస్వామి ఆలయం కూడా ఒకటి. ఆలయం చరిత్ర, విశిష్టతలు, ఎలా చేరుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఈ ఆలయం ఎక్కడుంది.. పురాణం ఏంటంటే?
అత్యంత శక్తివంతమైన, ప్రముఖమైన ఈ ఆలయం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, సామర్లకోటలో ఉన్న పంచారామ క్షేత్రాలే కుమార భీమేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయానికి విశిష్టమైన చరిత్ర ఉంది. అది ఏంటంటే.. పూర్వంలో తారకాసుడు అనే రాక్షుడు ఉండేవాడు. అతను శివుడి ఆత్మలింగం కోసం ఘోరమైన తపస్సు చేసి.. శివుడిని మెప్పిస్తాడు. అతని భక్తిని మెచ్చిన శివయ్యా.. అతడిని ఏం వరం కావాలని కోరగా.. ఆ రాక్షుడు ఆత్మలింగాన్ని అడుగుతాడు. దీంతో ఆత్మలింగాన్ని శివయ్య వరంగా ప్రసాదిస్తాడు. ఒక్క బాలుని చేతిలో తప్ప మరెవరి చేతిలో ఆ తారకాసురుడికి మరణం లేకుండా వరం ఇస్తాడు.
అప్పటి నుంచి తారకాసురుడు ఆగడాలు మితిమీరిపోతాయి. ఆత్మలింగాన్ని తన కంఠంలో ఉంచుకొని ఆ రాక్షుడు దేవతలను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాడు. దీంతో విసిరి వేసారిపోయిన దేవతలు రక్షించండి మహా ప్రభో.. అంటూ విష్ణువు దగ్గరికి పరుగున వెళ్లి జరిగిందంతా చెప్పి శరణు కోరుతారు. అప్పుడు విష్ణువు.. పరమేశ్వరుడి తేజస్సుతో జన్మించే కుమారుడు తప్ప ఇంకెవ్వరూ ఆ రాక్షసుడిని అంతం చేయలేరని, ఇందుకోసం శివుడిని శరణు కోరారాలని సూచిస్తారు.
కుమార స్వామి జననం..
దీంతో దేవలంతా శివుడి దగ్గరికి వెళ్లి శరణు కోరడం ప్రారంభిస్తారు. దీంతో ఓ శుభముహూర్తాన శివ తేజస్సుతో, దివ్యమైన రూపంతో, అతీతమైన శక్తులతో కుమారస్వామి జన్మిస్తాడు. కుమారస్వామి చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యల్లో నిష్ణాతుడై ఉంటారు.
రాక్షసుడి అంతం..
దేవతల కోరిక మేరకు.. దేవతలందరితో కలిసి కుమారస్వామి తారకాసురుడిని ఎదుర్కొంటాడు. తారకాసురుడిని వధించాలంటే ఆ రాక్షసుడి కంఠంలో ఆత్మలింగాన్ని చేధించాలని గ్రహించిన కుమారస్వామి అతని కంఠంలో బాణాన్ని సాధిస్తాడు. దీంతో ఆ ఆత్మలింగం చెల్లాచెదురై ఆ రాక్షసుడు అంతమైపోతాడు. అయితే ఆ ఆత్మలింగం చెల్లాచెదురై పలు ప్రదేశాల్లో పడిందని, అవే ఏపీలోని పంచ రామ క్షేత్రాలని చెప్పుకుంటారు.
ఆలయ విశిష్టతలు..
ఈ కుమార భీమేశ్వరస్వామి ఆలయం 14 అడుగుల ఎత్తులో, రెండు అంతస్థులలో ఉంటుంది. 14 అడుగుల ఎత్తులో ఉండే తెల్లని స్పటిక లింగం ఉంటుంది. దీనినే కుమారస్వామి ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఆలయాన్ని కుమారారామం, కుమారరామ ఆలయంగా చెప్తుంటారు. చాళుక్య రాజు భీముడు క్రీస్తు శకం 892-922 మధ్య కాలంలో నిర్మించాడు.
అందుకే ఈ ఆలయాన్ని కుమార భీమేశ్వర స్వామి ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయంలో శివుడు బాలాత్రిపుర సుందరి దేవి సమేతంగా కొలువై ఉంటాడు. ఆలయ సమీపంలో ఉన్న కోనేరులో భక్తులు స్నానం చేసి, శివుడిని దర్శించుకుంటారు. ముందుగా పై అంతస్తులోని శివలింగం పై భాగాన్ని దర్శించుకొని, ఆ తరువాత లింగం యొక్క పాదభాగాన్ని దర్శించుకోవడం ఇక్కడి ఆనవాయితీ.



Click it and Unblock the Notifications