Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
ఈరోజు అమావాస్య.. ఈ విధంగా దీపం వెలిగిస్తే, సంవత్సరం అంతా అదృష్టం మీవైపే ఉంటుందట!
హిందూ ధర్మం ప్రకారం అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైనది. ఈ అమావాస్య నుంచే కొందరు వ్యక్తులకు మంచి, మరికొందరు వ్యక్తులకు చెడు ఫలితాలు కలగనున్నాయి. అయితే అన్ని అమావాస్యల్లో కెల్లా చైత్ర అమావాస్యకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ అమావాస్యను అత్యంత శక్తివంతమైన అమావాస్యగా పరిగణించబడతారు. అయితే ఈ ఏడాది ఈ చైత్ర అమావాస్య ఈరోజు అంటే ఏప్రిల్ 27వ తేదీన వచ్చేసింది. ఈ ప్రత్యేక అమావాస్య రోజున కొన్ని ప్రత్యేక పూజలు, పరిహారాలు పాటిస్తే సంవత్సరం అంతా శుభఫలితాలు పొందవచ్చని ప్రముఖ జ్యోతిష్యపండితులు వివరిస్తున్నారు. ఇంతకీ ఈ చైత్ర సమస్య రోజున ఎలాంటి పరిహారాలు పాటించాలి? ఎలాంటి పూజలు చేయాలి? ఈ అమావాస్య ప్రాధాన్యత ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
చైత్ర అమావాస్య యొక్క ప్రాధాన్యత:
ఈ అమావాస్య రోజున చేసే ప్రతి ఉపాసన, దానం, పుణ్య కార్యానికి ఎన్నో రెట్లు ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజు సాయంత్రం తులసి మొక్క ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం. ఇంటిలో ఉన్న విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, శ్రీకృష్ణుని విగ్రహాలకు గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల ఆధ్యాత్మిక శుభం పెరుగుతుంది.

గంగా స్నానం లేదా ప్రత్యామ్నాయం:
సముద్రం, నదుల సమీపంలో ఉన్నవారు గంగా స్నానం చేస్తే మేలని చెబుతున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్నవారు తాము స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలిపి "గంగా గంగా" అని స్మరిస్తూ స్నానం చేస్తే సమాన ఫలితం పొందవచ్చు.
అఖండ దీపం వెలిగించే విశిష్టత:
ఈ రోజున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆరిపోని దీపాన్ని వెలిగించడం ప్రత్యేకమైన శుభచిహ్నం. ఈ దీపాన్ని ఇంటి హాలులో ఈశాన్యం మూలన ఏర్పాటు చేయాలి. మట్టి ప్రమిదలో నువ్వుల నూనె మరియు ఆవు నెయ్యితో మూడు వత్తులతో దీపం వెలిగించాలి. దీని వల్ల ఇంట్లో శాంతి, సంపద కలిసివస్తాయి.
ప్రత్యేక ధన దీపం:
దేవుని గదిలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తూ అందులో రెండు లవంగాలు, కుంకుమ పువ్వు పొడి వేసి ఎర్ర వత్తులతో దీపం వెలిగించాలి. ఇది నవగ్రహ అనుగ్రహం పొందేందుకు, కుజ దోష నివారణకు, గృహ శాంతి కోసం ఎంతో శుభప్రదం.
రావి చెట్టు వద్ద పూజా విధానం:
ఉదయం స్నానం తర్వాత రావి చెట్టు వద్ద నీళ్లు పోయాలి. సాయంత్రం నువ్వుల నూనెతో దీపం వెలిగించి విష్ణుమూర్తి కటాక్షం కోరుకోవాలి.
దానాలు మరియు ధూపం ప్రత్యేకత:
ఈ రోజున నీటి కుండలు, తెల్లటి వస్త్రాలు దానం చేయడం, గోసేవ చేయడం ద్వారా పుణ్యప్రాప్తి కలుగుతుంది. మూగజీవాలకు ఆహారం పెట్టడం ద్వారా గ్రహ దోష నివారణ జరుగుతుంది. ఇంట్లో గోమయం, ఆవు నెయ్యి, బెల్లం పొడి, సాంబ్రాణీతో ధూపం వేసుకోవడం ద్వారా నెగటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు.
ముగింపు:
చైత్ర అమావాస్యను సద్వినియోగం చేసుకొని పూజలు, దానాలు, ప్రత్యేక దీపాలు వెలిగించడంతో సంవత్సరం మొత్తం సానుకూల శక్తులు, శుభ సంఘటనలు మన జీవితాన్ని ఆనందంగా మార్చతాయని జ్యోతిష్య నిపుణులతో పాటు, హిందూ ధర్మ అనుసరికులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications