Latest Updates
-
ఈ పద్ధతిలో అల్లం చట్నీ చేస్తే.. ఎవరైనా సరే నాలుగు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి సొరకాయ దోశ..అప్పటికప్పుడు ఈజీగా చేసుకోండిలా.. -
మంచి భర్త కోసం ఉపవాసం చేస్తున్నారా.. కానీ శివారాధనలో అమ్మాయిలు చేసే పొరపాట్లు ఇవే.! -
కుజ- చంద్రుల కలయికతో మహాలక్ష్మి రాజయోగం.. ఎనలేని సంపద సిద్ధించే ఈ రాశుల్లో మీరు ఉన్నారా.! -
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.! -
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు! -
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.!
ఈ మంత్రంలో అద్భుత శక్తి? భోజనానికి ముందు ఇలా చేస్తే తిరుగుండదు
ఆహారం వండే ముందు పాటించాల్సిన నియమాల గురించి మాత్రమే కాదు వండిన ఆహారాన్ని ఎలా తినాలనేదానికి సంబంధించి కూడా హిందూ గ్రంథాల్లో అనేక నియమాలు ఉన్నాయి. భోజనానికి ముందు చేతులు కడుక్కోవడం,నేలపై కూర్చొని భోజనం చేయడం,భోజనానికి మంత్రాలు పఠించడం..వాటి ప్రాముఖ్యత మత గ్రంథాలలో ప్రస్తావించబడింది. ఆహారాన్ని తయారుచేసే ముందు శరీరం శుభ్రంగా మనస్సు స్వచ్ఛంగా ఉండటం చాలా ముఖ్యం. ఆ తర్వాత ఇష్టంగా నిర్మలమైన హృదయంతో వంట చేయాలి. వంట చేసే ప్రదేశం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. అటువంటి వారి ఇంట్లో నివసించే వారిపై అన్నపూర్ణదేవి ఆశీస్సులు ఉంటాయి.
అలాగే ఆహారం తినే ముందు అన్నపూర్ణ దేవిని స్తుతిస్తూ ఓ మంత్రాన్ని చదవడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ బిజీ లైఫ్ స్టైయిల్ లో చాలామంది ప్లేట్ లో అన్నం పెట్టగానే తిరిగి పనికి పరుగెడుతున్నారు కానీ గతంలో మన పూర్వీకులు భోజనం తినడానికి ముందు దేవుడికి ఆహారాన్ని సమర్పించి ఓ మంత్రం జపించేవాళ్లు. ఆ మంత్రం ఏంటిది,దాని ప్రాముఖ్యత, ప్రయోజనం ఏంటనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఆ మంత్రం ఇదే
"ఓం సః నవవతు । సః నౌ భునక్తు । సః వీర్యం కరవావహై । తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై । ఓం శాంతిః శాంతిః శాంతిః". అయితే ఇప్పటికీ కూడా కొంతమంది తమ ఆహారాన్ని దేవుడికి మర్పిస్తూ మంత్రం జపించిన తర్వాతనే ఆహారం నోట్లో పెట్టుకుంటారు.
పాపం రాకుండా
ఆహారం తినడానికి ముందు ఈ మంత్రాన్ని జపిస్తే అది అనేక రకాల పాపాల నుండి మనల్ని రక్షిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మనకు ఆహారాన్ని అందించిన దేవునికి మంత్రం జపించడం ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దీంతో పాటు తెలియక చేసిన తప్పులకు క్షమాపణ కూడా ఈ మంత్రం ద్వారా కోరబడుతుంది. కాబట్టి మీరు ఆహారం తయారుచేసేటప్పుడు లేదా తినేటప్పుడు ఏదైనా అనుకోని పొరపాటు చేసి ఉంటే దాని నుండి కూడా ఉపశమనం పొందుతారు.
విలువలు
ఆహారం తినడానికి ముందు మంత్రాన్ని జపిస్తే అంటే దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ క్షమించమని కోరితే అది మీ సంస్కారాలను పెంచుతుంది. ఇది మీలో మంచి విలువలను పెంపొందిస్తుంది. అందువల్ల భోజనానికి ముందు మంత్రాన్ని పఠించడం అవసరమని భావిస్తారు.
నెగిటివిటీ పోతుంది
ఆహారం తినేటప్పుడు మీ చుట్టూ ఉన్న అనేక ప్రతికూల శక్తులు కూడా ప్రేరేపించబడతాయి. కాబట్టి మీరు తినే ముందు మంత్రాన్ని జపిస్తే నెగిటివ్ ఎనర్జీ ఎంట్రీ నుండి కూడద రక్షించబడతారు. అలాగే మీ శరీరం పాజిటివ్ ఎనర్జీని పొందుతుంది. అందువల్ల భోజనానికి ముందు మంత్రాలను జపించడం చాలా మంచింది.
ఏ దిక్కున కూర్చొని తినాలి
హిందూ విశ్వాసం ప్రకారం తూర్పు దిక్కును దేవతల దిక్కుగా పరిగణిస్తారు కాబట్టి ఈ దిక్కుకు అభిముఖంగా ఆహారాన్ని తినడం మంచింది.



Click it and Unblock the Notifications