Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
శివుడిని దర్శించుకునేటప్పుడు చదవాల్సిన మంత్రాలివే..అప్పుడే విశిష్ఠ ఫలితం
శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. ఇందులో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుంటే, 5వ ముఖం ఆకాశంవైపు చూస్తున్నట్లు ఉంటుంది. శివలింగానికి ఉండే ఐదు ముఖాలలో నుండే మనకు సృష్టి, స్థితి, లయ, తిరోదానము, అనుగ్రహం ఇవ్వబడతాయని అంటారు. శివాగమనంలో చెప్పినట్లు మనం శివాలయంలో ఏ దిక్కువైపు వెళితే ఆ శివలింగం పేరుని స్మరించాలి. శివాలయంలో స్వామి ఏ దిక్కు నుండి మనకు దర్శనం ఇస్తున్నాడో దానిని తగ్గినట్లు మనం మంత్రాన్మి సర్మించుకుంటే దాని ఫలితం దక్కుతుందంట. ఏ దిక్కున ఉండే శివలింగాన్ని దర్శించినప్పుడు ఏ మంత్రాన్ని జపించాలో ఇక్కడ చూడండి.
శివలింగం పశ్చిమాభిముఖంగా చూస్తూ ఉంటే
మనం వెళ్లిన శివాలయంలో శివలింగానికి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమంవైపు ఉన్నా లేదా శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నట్లు ఉంటే దానిని సద్యోజాత శివలింగం అంటారు. శ్రీకాళహస్తిలోని శివలింగం సద్యోజాత శివలింగం. ఈ శివలింగాన్ని చూసినప్పుడు 'ఓం సద్యోజాత ముఖాయ నమః అని స్మరించుకోవాలి'.

శివలింగం తూర్పు వైపుకు చూస్తూ ఉంటే
శివలింగం తూర్పు వైపుకు చూస్తూ ఉంటే ఆ శివలింగాన్ని తత్పురుష ముఖం అని అంటారు. తూర్పుని చూస్తూ ఉండే శివలింగం వాయువు మీద అధిష్ఠానం కలిగి ఉంటాడు. తత్పురుష ముఖం మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది. అంటే అది మనల్ని మాయ చేత కప్పి బడేస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది. ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాము. ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం.మనల్ని రక్షించినా, శిక్షించినా అన్నీ ఆ పరమేశ్వరుడే కాబట్టి తూర్పుదిక్కున శివుడిని దర్శించుకొనేటప్పుడు 'సద్యోజాతయ విద్మహే తత్పురుషాయ ధీమహి తన్నో సర్వ: ప్రచోదయాతో' అనే మంత్రాని పఠించాలి.
శివలింగం దక్షిణంవైపు చూస్తూ ఉంటే
దక్షిణ దిక్కులో శివలింగాన్ని దర్శించుకునేటప్పుడు "అఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోరే ఘోరతరేభ్యః ! సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః"మంత్రాన్ని చదవాలి. కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చుని, దక్షిణంవైపు చూస్తూ ఉంటుంది. శివలింగం దక్షిణానికి చూసే ముఖాన్నే అఘోర ముఖం అంటారు. ఈ అఘోర ముఖం అగ్నిహోత్రానికి అంతటికీ అధిష్ఠానం అయ్యి ఉంటుంది. ఈ అఘోర ముఖమే సమస్త ప్రపంచాన్ని లయం చేసి, మళ్ళీ మనకు జన్మను ఇస్తూ ఉంటుంది. మృత్యువుపట్ల భయం పోగొట్టి, మనకి జ్ఞానం ఇచ్చేది ఇదే.
శివలింగం ఉత్తరం వైపు చూస్తూ ఉంటే
శివాలయంలో ఉత్తరం వైపు చూసే ముఖాన్ని వామదేవ ముఖం అంటారు. ఉత్తరం వైపు చూసి "వామదేవ ముఖం'' నీటి మీద అధిష్ఠానం అయి ఉంటుంది. ఈ వాసుదేవ ముఖమే సమస్త మంగళము ఇచ్చే ముఖం. 'వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాస రూపాయ విష్ణవే, నమో వైబ్రహ్మ విధయే వాశిష్టాయ నమో నమః' అనే మంత్రాన్ని పఠించాలి.
శివలింగం ఆకాశంవైపు చూస్తూ ఉండే శివలింగం
ఈ ముఖాన్ని ఈశాన ముఖం అంటారు. ఈ శివలింగాన్ని దర్శించుకునేటప్పుడు 'ఈశాన ముఖాయ నమః అని స్మరించుకోవాలి'. ఈశాన ముఖ దర్శనం నాలుగు ముఖాల్ని దర్శించిన తర్వాతనే దర్శించాలి. అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది.



Click it and Unblock the Notifications