Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ఆడవారు ముక్కుపుడుక ఎందుకు పెట్టుకోవాలో తెలుసా, ముక్కుపుడకల ప్రాముఖ్యత తెలుసుకోండి
ప్రాముఖ్యత, ప్రయోజనాలు మాత్రమే కాకుండా, ముక్కు పుడక అనేది ప్రస్తుత కాలంలో ఫ్యాషన్ ఉపకరణంగా కూడా ఉంది. అనేక రకాల అందమైన నమూనాలలో లభిస్తున్న ఈ ముక్కు పుడకలు, నాథ్లు, స్త్రీ అందాన్ని రెట్టింపు చేసేలా రూ
హిందూ మతం ప్రకారం భారతీయ సాంప్రదాయాలలో స్త్రీలకు ముక్కు, చెవులు కుట్టడం అనేది ఒక ప్రధానమైన ఆచారంగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని వర్గాల ప్రాతిపదికన పురుషులు కూడా ఈ పద్దతిని అనుసరిస్తూ ఉంటారు. హిందూ మతంలో, మంగళ సూత్రం విషయంలో ముక్కు పుడక ధరించాలన్న నియమం అయితే లేదు. అందువలన వివాహంతో సంబంధం లేకుండా ఎవ్వరైనా ఎప్పుడైనా ముక్కుపుడకను దరించవచ్చునని చెప్పబడింది. కానీ భారతీయ మహిళలు అసలెందుకు ముక్కు పుడకలు ధరిస్తారు ? ఇప్పుడు తెలుసుకోండి.
ముక్కు పుడకలను ధరించే విధానం ప్రాంతాలవారీగా వేరుగా ఉంటుంది. హిందూ ఆచారాల ప్రకారం, సాధారణంగా పెళ్లి రోజున వధువు ముక్కు పుడక లేదా నాథ్ ధరించడం ఆనవాయితీగా ఉంటుంది. భారతీయ సంస్కృతిలో ముక్కు పుడకలకు సంబంధించి అనేక విశ్వాసాలు మనుగడలో ఉన్నాయి.

తూర్పు మద్య ప్రాంతంలో ఉన్న ఆచారం :
ఈ నమ్మకాల ప్రకారం, ముక్కు పుడకలు ధరించే సంప్రదాయం ప్రధానంగా మధ్యప్రాచ్యంలో ప్రారంభమైంది. క్రమంగా 16 వ శతాబ్దంలో మొఘల్ యుగంలో భారత దేశంలోకి అడుగు పెట్టింది. అంతే కాకుండా, పురాతన ఆయుర్వేద శాస్త్రాల ప్రకారం, సుశ్రుతుడు రచించిన సుశ్రుత సంహితలో ముక్కు పుడకలు ధరించడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించిన వివరణలు కూడా ఉన్నాయి.

ఆచారంగా
పుడకలు, ముక్కు కుట్టడం గురించిన కథనాలు ఏవైనా, ఎలా ఉన్నా, భారతీయ స్త్రీలు అనుసరించే ఒక ముఖ్యమైన ఆచారంగా మాత్రం అనుసరించబడుతుంది. హిందూ మతంలో, పెళ్ళిలో మంగళ సూత్రం విషయంలో ముక్కు పుడకలను ధరించడం గురించి ఖచ్చితమైన పరిమితి అంటూ లేదు. కావున, వివాహంతో ఏమాత్రం సంబంధం లేకుండా స్త్రీలు ముక్కు పుడకలను ధరించవచ్చు. అంతేకాకుండా ఈ సంప్రదాయం హిందూ మహిళల మధ్య మాత్రమే కాకుండా, ఇతర మతాల మహిళలలో కూడా ఉంది.

మతపరమైన ముక్కు పుడకల ప్రాముఖ్యత :
సాధారణంగా, ముక్కు రింగులను ధరించడమనేది భారత దేశం అంతటా అనేక సంస్కృతుల్లో వివాహ పరమైన చిహ్నంగా కనిపిస్తుంటుంది. హిందూ మతంలో, ఒక మహిళ యొక్క ముక్కు పుడక ఆమె భర్త మరణంతో తొలగించబడుతుంది. అంతేకాకుండా, హిందూ మతాచారాల ప్రకారం అమ్మాయిలు 16 ఏళ్ల వయస్సులో తమ ముక్కును కుట్టించుకోవాల్సిన అవసరం ఉంది.
క్రమంగా వివాహానికి సిద్దమని గుర్తుగా భావించబడుతుంది. కానీ ఆ వయసును భారత చట్టాల ప్రకారం 18 కి పెంచబడింది. ఇది వివాహానికి సంబంధించిన దేవత అయిన పార్వతి దేవికి గౌరవ సూచకంగా కూడా చెప్పబడుతుంది.

ఆయుర్వేదంలో ముక్కు పుడకల ప్రాముఖ్యత :
మహిళల పునరుత్పత్తి అవయవాలతో సంబంధం కలిగి ఉన్న, ఎడమ ముక్కు భాగంలోని నరాలను శాంతపరచే క్రమంలో భాగంగా మహిళలు ముక్కు పుడకలను ధరించడం జరుగుతుంటుంది. క్రమంగా ఇది ప్రసవం సమయంలో సహాయపడుతుందని చెప్పబడింది.

ఆయుర్వేద ప్రకారం
ఆయుర్వేద ప్రకారం, ముక్కు మీద ఉండే ఒక ప్రత్యేకమైన భాగం (నోడ్) దగ్గర ముక్కును కుడితే మహిళల్లో వారి నెలసరి సమయాల్లో నొప్పిని తగ్గిస్తుంది. కేవలం అందుచేతనే, వయోబేధం లేకుండా చిన్నవారి నుండి పెద్దవారి వరకు ముక్కు పుడకలను ధరించడంలో మక్కువను ప్రదర్శిస్తుంటారు.

మరికొన్ని నమ్మకాలు :
కొన్ని ప్రముఖ నమ్మకాల ప్రకారం, భార్య నిశ్వాస భర్త ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని నమ్మడం జరుగుతుంది. కావున, మహిళ ముక్కు పుడకలను ధరిస్తే, గాలి స్వచ్చంగా మారి ఎటువంటి చెడు అనారోగ్య ప్రభావాలను కలిగి ఉండదని నమ్మడం జరిగింది. కొన్ని రకాల లోహాలు చెడును శోషించుకునే ప్రభావాలను కలిగి ఉంటాయని చెప్పడం జరిగింది.
ఇది ఎక్కువగా భారత దేశం యొక్క తూర్పు భాగాలలో అత్యంత ప్రజాదరణ పొందిన నమ్మకంగా ఉంది. నిజానికి శాస్త్రీయ కోణంలో చూస్తే మూడ నమ్మకంగా కూడా ఉంటుంది.

ఫ్యాషన్ ఉపకరణంగా
ప్రాముఖ్యత, ప్రయోజనాలు మాత్రమే కాకుండా, ముక్కు పుడక అనేది ప్రస్తుత కాలంలో ఫ్యాషన్ ఉపకరణంగా కూడా ఉంది. అనేక రకాల అందమైన నమూనాలలో లభిస్తున్న ఈ ముక్కు పుడకలు, నాథ్లు, స్త్రీ అందాన్ని రెట్టింపు చేసేలా రూపుదిద్దుకుని అన్ని ధరలలో అందుబాటులో ఉంటాయి.
కేవలం ఫాషన్ కోసమే అని భావించేవారికి, లేదా ముక్కు కుట్టించుకోవడానికి భయపడే వారికి (షాట్స్ వంటి పద్దతులు అందుబాటులో ఉన్నాయి), ముక్కు కుట్టకుండా కూడా పుడకలు ధరించేలా కొన్ని మోడళ్ళు అందుబాటులో ఉన్నాయి.

నాసిరకమైన పద్దతులు
కానీ లోహం అనేది ముఖ్యంగా ఉంటుంది. ముక్కు కుట్టడంలో నాసిరకమైన పద్దతులను అవలంభించడం మరియు నాసిరక లోహాలతో చేసిన పుడకలను అనుసరించడం కొత్త సమస్యలను తీసుకుని రాగలదని గుర్తుంచుకోండి.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications
