Latest Updates
-
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా?
రంగవల్లలకు గొబ్బెమ్మల అలంకరణ ఎందుకు ?
ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి ముంగిట్లో రంగవల్లులు, మధ్యలో గొబ్బెలు పెడతారు. నెలరోజులూ రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో ఇల్లులన్నీ చాలా కొత్త శోభ సంతరించుకుంటాయి. అయితే ఈ కాలంలో నెలంతా పెట్టే ఓపిక, తీరిక లేని వాళ్లు.. కేవలం పండుగ మూడు రోజులు మాత్రం పెడతారు.
కర్మ సిద్ధాంతం గురించి ఆసక్తికర అంశాలు ?
ముగ్గు మధ్యలు గొబ్బెమ్మలు పెట్టి అలంకరించడం హిందూ సంప్రదాయం. ఆవు పేడతో గొబ్బెమ్మలు తయారు చేసి పసుపు, కుంకుమ పెట్టి, పూలతో అలంకరించి, నవ ధాన్యాలు వాటిలో పోసి.. ముగ్గులపై అలంకరిస్తారు. ఇలా పెట్టిన తర్వాత అమ్మాయిలంతా గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ ఆడిపాడతారు. ఈ విశేషమంతా.. సంక్రాంతి పండుగ సమయంలో చాలా సరదాగా, సంతోషంగా ఉంటుంది.

అయితే గోవు పేడతోనే గొబ్బెమ్మలు తయారు చేసి పెడతారు. ఆవును గౌరీమాతగా కొలిచే సంప్రదాయం ఉంది. అందుకే ఆవు పేడను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇందులో క్రిమీ కీటకాలను నాశనం చేసి, ప్రకృతికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. అందుకే గొబ్బెమ్మలను గౌరీదేవిగా భావించి ముగ్గులపై అలంకరిస్తారు.
గొబ్బెమ్మలు గోపికలను, పూలరేకులు, పసుపు, కుంకుమలు సౌభాగ్యాన్ని సూచిస్తాయి. మధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మను గోదాదేవిగా భావిస్తారు. సాధారణంగా గొబ్బెమ్మలను పెళ్లికాని అమ్మాయిలు తయారు చేసి, అలంకరించాలి. అలా చేస్తే.. త్వరగా పెళ్లి అవుతుంది. అలాగే మంచి భర్త వస్తాడని నమ్మకం ఉంది.

సంక్రాంతికి భోగిపళ్ల సంప్రదాయం ఎందుకు వచ్చింది ?
నెలరోజులూ రంగురంగుల ముగ్గులు వేసి.. గొబ్బెమ్మలు పెట్టి తర్వాత ఎండబెడతారు. చివరిరోజైన కనుమరోజు గొబ్బెమలను పొయ్యిలో వేసి.. ఆ మంటపై ప్రసాదం తయారు చేసి.. ఆ సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా గొబ్బెమ్మల సంప్రదాయం తెలుగువాకిట్లో సందడి చేస్తోంది.
ఉత్తరాయణం మహా పుణ్యమైంది. ఈ కాలంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఉంటాయని, దేవతలకు మహా ప్రీతికరమైనదని చెప్తారు. అందుకే ధనుర్మాసంలో చేసే నదీస్నానం, పూజలు, దానధర్మాలు వెయ్యిరెట్ల ఫలితాన్నిస్తాయి.



Click it and Unblock the Notifications