Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
నవరాత్రులు: నాల్గవ రోజు దుర్గదేవి కూష్మాండ రూపం ప్రత్యేకత
మనస్సు నిర్మలంగా ఉండాలంటే మహర్షులు చెప్పిన మార్గాల్లో శక్తి ఆరాధన అతి ముఖ్యమైనది. శక్తి స్వరూపిణి పరమేశ్వరి, పార్వతి, గాయత్రి, మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతి, కనకదుర్గ, లలిత, రాజరాజేశ్వరి.. ఇలా ఏ పేరుతో పిలిచినా ఆయా రూపాల్లో ఉండే 'పరాశక్తి' ఒక్కటే. పరాశక్తిని ఆరాధించేందుకు మహర్షులు నిర్ణయించిన కాలం ఆశ్వయుజం. పరాశక్తిని ఉపాసన చేస్తూ నిర్వహించే కార్యక్రమాలే దసరా ఉత్సవాలుగా ప్రాచుర్యం పొందాయి. ఆశ్వయుజ మాసానికి ఇష మాసం అనే పేరు ఉంది. అశ్వనీ నక్షత్రంతో కూడిన పూర్ణిమ వచ్చే మాసాన్ని ఆశ్వయుజ మాసం అంటారు.

ఈ మాసంలో నవరాత్రులలో నాల్గొవ రోజున అమ్మవారిని 'కూష్మాండ దుర్గ' గా అలంకరించి పూజిస్తుంటారు. ఈ అమ్మవారు పులిని వాహనంగా కలిగి వుంటుంది. అమ్మవారికి గల ఎనిమిది చేతులు ఆమె శక్తికి నిదర్శనంగా కనిపిస్తూ వుంటాయి. ఈ ఎనిమిది చేతుల్లో విల్లు .. బాణం .. చక్రం .. గద .. తామరపువ్వు .. జపమాల .. కమండలం .. అమృత కలశం కనిపిస్తూ వుంటాయి.
'సురాసంపూర్ణ కలశం రుధిరాపుత్రమేవచ
దధనా హస్త పద్మాభ్యం కూష్మాండా శుభదాస్తుమ్ '

జ్ఞానరూపిణి, సరస్వతీశక్తిగా స్తుతించబడే కూష్మాండ రూపంతో అలరారే దేవీమాత అభయముద్రలను ధరించి భక్తులను కాపాడుతుంది. నమ్మిన భక్తులకు బహురూపాలుగా కనిపించి రక్షిస్తుంది. ఆయుష్యును, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.
కూష్మాండ దుర్గాదేవి 8 చేతులతో ఉండి కుడిచేతి వైపు పద్మం, బాణం, ధనుస్సు, కమండలాన్ని, ఎడమ చేతి వైపు చక్రం, గద, జపమాల, అమృతకళశాన్ని కలిగి ఉంటుంది. అష్ట భుజాలు కలిగి ఉన్నందున అష్ట్భుజాదేవిగా పిలుస్తారు. ఈదేవికి (గుమ్మడి కాయ) కూష్మాండ బలి ఎంతో ప్రీతిదాయకమైనది. అందుకే కూష్మాండ దుర్గగా పిలుస్తారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అక్కమహాదేవి అలంకరణ మండపంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి అర్చక, వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఈదేవి చిరునవ్వుతో చరాచర జగత్తును సృష్టించింది. సృష్టి లేకుండా అంతా చీకటిగా ఉన్న సమయంలో బ్రహ్మండాన్ని సృష్టించినందు వల్ల ఈదేవిని సృష్టాది స్వరూపిణిగా, ఆదిశక్తిగా కీర్తిస్తారని వేదపండితులు తెలిపారు. ఈ దేవి సూర్యమండలంలో అంతర్భాగంలో నివశిస్తూ ఉంటుంది. దేవి మేనిచ్చాయ సూర్యసమప్రభతో విరాజిల్లుతూ తేజోవంతంగా అన్ని దిక్కులా ప్రకాశిస్తుంటుంది. ఈదేవి ఉపాసన వల్ల సకల రోగాలు దూరమై ఆరోగ్యం, ఆయుష్సు, యశస్సు వృద్ధి చెందుతాయని పురాణేతిహాసాలు చెబుతున్నాయని అంటున్నారు.
చిరునవ్వులు చిందిస్తూ అమ్మవారి వదనం ప్రసన్నంగా కనిపిస్తూ వుంటుంది. అలాంటి ఈ తల్లికి అల్లం గారెలు అత్యంత ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి. సన్నజాజి పూలమాలికలతో అమ్మవారిని అలంకరించి ... ఆరాధించి .. ఆమెకి ఇష్టమైన అల్లం గారెలను నైవేద్యంగా పెట్టడం వలన ఆ తల్లి సంతోషిస్తుందని చెబుతారు. ఈ అమ్మవారి అనుగ్రహం వలన సమస్త దోషాలు నశించి, సకల శుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది.



Click it and Unblock the Notifications
