For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చండీ యాగం ఎందుకు చేస్తారు..?చండీ యాగాన్ని ఎవరైనా చేయించవచ్చా.?

అది లలితా పారాయణం, చండీ పారాయణం అని రెండు రకాలు. బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం లలితా దేవీ మహిమలను చెబితే, మార్కెండేయ పురాణం చండీ మహత్మ్యాన్ని వివరిస్తుంది. చండీ లేదా దుర్గా దేవి విజయాలను వివరించడంతో ప

|

అమ్మ ఆది పరాశక్తి అని తెలిసిన విషయమే..! చండీ మాత ఓ ప్రచండ శక్తి. భూగ్రహంపై మాత్రమే కాకుండా విశ్వాంతరాళాలని అంటిపెట్టుకునే ఉంటుంది. సృష్టి జరగడానికి, అది వృద్ది చెండానికి తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జ్ఝానశక్తి, ఇచ్ఛాశక్తి, కుండలినీ శక్తి! అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం ఉంది.

లోక రక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకరు. లోక కల్యాణం కోసం, విశేష కార్యసిధ్ది కోసం సకల చరాచర జగత్తు సృష్టికి, లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తోంది. ఆది తత్త్వాన్ని నేత్రమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీవిద్య.

 Spiritual Significance Of Chandi Havan

అది లలితా పారాయణం, చండీ పారాయణం అని రెండు రకాలు. బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం లలితా దేవీ మహిమలను చెబితే, మార్కెండేయ పురాణం చండీ మహత్మ్యాన్ని వివరిస్తుంది. చండీ లేదా దుర్గా దేవి విజయాలను వివరించడంతో పాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తిమంతమైన మంత్రాల కదబంమే చండీ లేదా దుర్గా సప్తశతి .

 Spiritual Significance Of Chandi Havan

చండి హోమంలో ఉన్న మంత్రాలు , అధ్యాయాలు:
చండీ సప్తశతిలో 700 మంత్రాలుంటాయని ప్రతీతి. అయితే , ఇందులో ఉన్న మంత్రాలు 578 మాత్రమే. ఉవాచ మంత్రాలు, అర్థశ్లోక, త్రిపాద శ్లోక మంత్రాలతో కలిపి మొత్తం 700 మంత్రాలయ్యాయి. బ్రహ్మీ, నందజా, రక్తదంతికా, శాకంబరీ, దుర్గా, భీమా, భ్రామరీ అనే ఏడుగురు దేవతామూర్తులకు సప్తసతులు అని పేరు. వారి మహాత్మ్య వర్ణనతో కూడిన మంత్రాలు కాబట్టి దీనికి చండీ సప్తసతి అనే పేరు వచ్చింది. ఇది శాక్తేయ హోంమం కనుక నిష్టగా చేయాల్సి ఉంటుంది.

 Spiritual Significance Of Chandi Havan

దుర్గ లేదా చండీ సప్తశితి మూడు చరిత్రలుగా, 13 అధ్యాయాలుగా ఉంటుంది. తొలి భాగంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. రెండో భాగంలో మూడు అధ్యాయాలు, మూడో భాగంలో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి, వీటిలో మధుకైటభ వర్ణన, హిషాసుర సంహారం, శుంభనిశుంభుల వధతో పాటు బ్రహ్మాది దేవతలు చేసిన పవిత్ర దేవీ స్తోత్రాలు ఉంటాయి.

 Spiritual Significance Of Chandi Havan

చండీ పారాయణ వల్ల సమాజానికి జరిగే మేలు..
ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు. దు:ఖం అనేది రాదు. ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు. లోక కల్యాణం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సూతసంహిత ఉద్ఘాటిస్తోంది.

 Spiritual Significance Of Chandi Havan

కలిగియుగంలో చండీ పారాయణకు మించిన శక్తిమంతమైన ఫలసాధనం మరొకటి లేదని, శాతస్త్రవచనం. ఇహపర సాధనకు చండీహోం ఉత్తమం. ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి, హోంమం నిర్వహించడమే చండీ హోమం. దేశోపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి శత్రుసంహారానికి, శత్రువులపై విజం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు.

 Spiritual Significance Of Chandi Havan

వీటిలో నవ చండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలితం పొందుతారట. ఏకాదశ చండీ చేస్తే రాజు వశమవుతాడని, ద్వాదశ చండి చేస్తే శత్రు నాశనమని, మను చండీ(చతుర్ధశ చండీ)తో శత్రువు వశమవుతాడాని, మార్కెండేయ పురాణం చెప్పినట్లు శాంతి కమలాకరంలో ఉంది.

 Spiritual Significance Of Chandi Havan

ఇక శత చండి చేస్తే కష్టాలు, వైద్యానికి లొంగని అనారోగ్యం, ధన నష్టం తదితరాలు తొలగుతాయి. సహస్ర చండితో లక్ష్మీదేవి వరిస్తుంది. కోరికలు నెరవేరతాయి. లక్ష చండీ చేస్తే చక్రవర్తి అవుతాడని మార్కెండేయ పురాణంలో ఉంది, దీనినే నియుత చండి అంటారు. ప్రయుత చండి అంటే పది లక్షల చండీ సప్తశతి పారాయణాలు

English summary

Spiritual Significance Of Chandi Havan

Hinduism is one such religion which has a ritual for almost every occasion in a person's life. Be it the birth of a child, marriage or buying a new house, there are certain rituals which have to be followed without fail. One of the basic rituals which is followed in almost all the Hindu occasions is the Havan or Homa. A Havan is a sacred ritual in which offerings are made to the fire.
Desktop Bottom Promotion