Latest Updates
-
చూస్తుంటేనే నోరూరిపోయే డబుల్ లేయర్ చాక్లెట్ బర్ఫీ.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
నూనెలో డీప్ ఫ్రై లేకుండానే కరకరలాడే మసాలా పల్లీలు..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
మటన్ గిల్లీ బిర్యానీ..వాసనకి పక్కింటోళ్లు కూడా ప్లేట్ పట్టుకుని పరుగెట్టుకొస్తారు! -
ప్రతి రాత్రి సోంపు నీరు తాగుతున్నారా? నెల రోజుల్లో శరీరంలో జరిగే అద్భుత మార్పులివే! -
బియ్యం, మినప్పప్పు లేకుండానే అటుకులతో అప్పటికప్పుడు క్రిస్పీ మసాలా దోసె..అబ్బబ్బబ్బా అనాల్సిందే! -
చలికాలంలో రోజూ ఒక బెల్లం ముక్క తింటే ఏమవుతుంది? రోజుకు ఎంత, ఎలా తినాలో తెలుసా? -
బాలల దినోత్సవం స్పెషల్: ఓవెన్ లేకపోయినా పర్లేదు.. స్టవ్ మీదనే క్రిస్పీగా వేరుశెనగ బిస్కెట్లు చేసుకోండిలా! -
పాస్ వర్డ్ లో కామా పెడితే ఎవ్వరూ హ్యాక్ చేయలేరా? వైరల్ టెక్ ట్రిక్ వెనుక వాస్తవం ఇదే! -
కారంగా, కమ్మగా ఉండే కరివేపాకు చికెన్ రోస్ట్.. ఈ సీక్రెట్ మసాలాతో రుచి డబుల్! -
మన దేశం మధ్యలో ఉండి భారతీయులే వెళ్లలేని వింత గ్రామం..ఎక్కడుంది? ఆ కథేంటి?
హిందూమతంలో పసుపు యొక్క ఆధ్యాత్మిక ఉపయోగాలు
భారతీయ వంటగదిలో వంటల కోసం పసుపును విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. భారతీయ కుటుంబాలు వారు చేసే వంటలలో తప్పనిసరిగా పసుపును వాడతారు. కానీ పసుపు కేవలం వంట పదార్ధం కాదు. పసుపుకు భారతదేశంలో అనేక ఆధ్యాత్మిక ఉపయోగాలున్నాయి. హిందూ మత ఆచారాలను విస్తరించటానికి పసుపుతో అనేక ఆధ్యాత్మిక ఉపయోగాలు ఉన్నాయి. భారతదేశంలో పసుపు లేదా హల్దికి ఔషధ శక్తులు ఉన్నాయి.
హల్ది అనేది ఒక పూర్వ వివాహ వేడుక పేరు. ఈ వేడుకలో(సాధారణంగా వివాహానికి ముందు కేవలం ఒక రోజు ముందు జరుగుతుంది) వధువు మరియు వరుడు పసుపు పేస్ట్ మరియు పాలతో స్నానం చేస్తారు. ప్రారంభం నుంచి పసుపు హిందూ మతం సంస్కృతిలో స్వచ్ఛత, సంతానోత్పత్తి మరియు శుభప్రదంతో సంబంధం కలిగి ఉంది.
ఇక్కడ హిందూమతంలో పసుపు యొక్క ఆధ్యాత్మిక ఉపయోగాలు కొన్ని ఉన్నాయి.

వెడ్డింగ్ కార్డ్స్
ఒక హిందూ మతంలో వివాహ కార్డులకు మొదట పసుపు మరియు కుంకుమలతో మార్క్ చేసి,అప్పుడు అతిథులకు పంచిపెడతారు. ఇది పసుపును ఒక వివాహ వేడుకలో అనేక ఆధ్యాత్మిక ఉపయోగాలు ఉన్నాయని చూపుతుంది.
దేవతలకు అలంకరణ
పసుపు పేస్ట్ ను విగ్రహాలు లేదా దేవుని మూర్తులను అలంకరించడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణకు,లార్డ్ విష్ణువు పసుపుతో అలంకరణను ఇష్టపడతారు. దేవుళ్ళకు పసుపు,గందం,కుంకుం వంటి మూడు ప్రధాన పదార్థాలను అలంకరించటానికి ఉపయోగిస్తారు.
వెడ్డింగ్ వేడుకలు
వివాహానికి ముందు పసుపు పేస్ట్ ను వరుడు మరియు వధువుకు రాస్తారు. ఈ ఆచారం వివాహ వేడుక ముందు వారి మనస్సులు మరియు శరీరం స్వచ్చముగా తయారు చేసేందుకు ఉద్దేశించబడింది. అంతేకాక, పసుపు మీ చర్మంను కాంతివంతముగా చేయటానికి మరియు మోటిమలు నయం చేసే సహజ పదార్ధంగా ఉంది. కాబట్టి దీనిలో బ్యూటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
తిలకం
భారతీయులు ఇంటికి తిరిగి వచ్చే వ్యక్తిని స్వాగతించే ఆచారం కోసం హారతి తిలక్ లేదా టిక్కా చేస్తారు. ఈ తిలకం నుదిటి పై ఒక చుక్క లేదా లైన్ గా ఉంటుంది. అంతేకాక వెళ్ళిపోతున్నవ్యక్తి యొక్క రక్షణ కోసం కూడా జరుగుతుంది. కాబట్టి,ఇంటిలో మహిళలు తిలకంను ధరిస్తారు. దీని కోసం పసుపు మరియు కుంకుంను ఉపయోగిస్తారు.
మత సంబంధ ఆర్ట్
పసుపు మరియు కుంకుంలను తరచుగా ఓం మరియు స్వస్తిక్ వంటి మత ఫిగర్స్ గీయటానికి ఉపయోగిస్తారు. సాధారణంగా ఈ మత చిహ్నాలను పసుపు లేదా వెర్మిలియన్ తో గీస్తారు. ఈ విధంగా పసుపులో వివిధ ఆధ్యాత్మిక ఉపయోగాలు ఉన్నాయి. మీకు పసుపులో ఉన్న ఏ ఇతర శుభ ఉపయోగాలు తెలుసా?



Click it and Unblock the Notifications
