Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
శ్రావణ మాసంలో ఈ శివమంత్రాలు పఠిస్తే సంతోషం, ధనలాభం సిద్దిస్తాయి
శ్రావణ మాసం రానే వచ్చింది. జులైవ 18వ తేదీ మంగళవారం రోజు నుంచి ఈ ఏడాది శ్రావణ మాసం మొదలు అవుతోంది. అయితే ఈ మాసం శివుడుకి అథ్యంత ప్రీతికరమైన మాసంగా హిందూ పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసంలో చాలా మంది శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి సోమవారం రోజు ఉపవాసాలు, పూజలు, పారాయణాలు.. ఇలా చాలానే చేస్తుంటారు. ముఖ్యంగా ప్రతీ సోమవారం శివాలయాలకు వెళ్తూ.. అభిషేక ప్రియుడు అయిన భోళా శంకరుడికి అభిషేకాలు చేస్తుంటారు.

ఈ మాసంలో ఆ పరమ శివుడు తన భక్తులపై శీఘ్ర సంతోషాన్ని పొంది ఆశీర్వదిస్తాడని భక్తుల విశ్వాసం. అందుకే శివ భక్తులు శ్రావణ మాసం కోసం ఏడాదంతా వేచి చూస్తుంటారు. మీరు కూడా ఈ పవిత్ర మాసంలో భోళా శంకరుడి కృపను పొందాలనుకుంటే ఈ మంత్రాలు చదవాల్సిందే. మీ రాశికి తగ్గట్లుగా ఆయా మంత్రాలను చదువుతూ స్వామి వారికి కృపకు పాత్రులు కావచ్చు.
ఏయే రాశి వాళ్లు ఏ మంత్రం చదవాలంటే..!
మేష రాశి - ఓం నమః శివాయ మంత్రం చదవాలి
వృషభ రాశి - మహామృత్యుంజయ మంత్రం లేదా ఓం నాగేశ్వరాయ నమః అనే మంత్రం పఠించాలి.
మిథున రాశి - ఓం నమః శివాయ కాల మహాకాలా కాల కృపాల్ ఓం నమః అని జపిస్తూ ఉండాలి.
కర్కాటక రాశి - ఓం చంద్రమౌళీశ్వర నమః అనే మంత్రం చదవాలి.
సింహ రాశి - ఓం నమః శివాయ కాల మహాకాల కాల కృపాల్ ఓం నమః అని జపించాలి.
కన్య రాశి - ఓం నమః శివాయ కాల మహాకాలా కాల కృపాల్ ఓం నమః అని మంత్రం పఠించాలి.
తులా రాశి - ఓం నమః శివాయ అంటూ జపిస్తూ ఉండాలి.
వృశ్చిక రాశి - ఓం హౌం ఓం జున్స్ అనే మంత్రం చదవాలి.
ధనస్సు రాశి - ఓం నమో శివాయ గురు దేవాయ నమః అనే మంత్రం పఠించాలి.
మకర రాశి - ఓం హోం ఓం జన్స్ అని జపించాలి.
కుంభ రాశి - ఓం హోం ఓం జన్స్ అనే మంత్రాన్ని చదవాలి.
మీన రాశి - ఓం నమో శివాయ గురు దేవాయ నమః అనే మంత్రం పఠించాలి.
మీ రాశి ప్రకారం పైన చెప్పిన శివ మంత్రాలను జపించడం వల్ల అంతా మంచే జరుగుతుంది. శివుడి దీవెనలతో పాటు కృప కూడా అందుతుంది. శివుజి ఆజ్ఞ ఆయన కృప మీపై ఉంటే.. ఇక అన్నీ ఉన్నట్లే. అందుకే మీరూ శివుడి పూజ చేసేటప్పుడు లేదా ఖాళీగా ఉన్నప్పుడు స్వామి వారిని మనసు నిండా తలుచుకొని ఆ రూపాన్ని అలాగే మదిలో పెట్టుకొని పైన చెప్పిన మంత్రాలను జపించండి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications