Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
TTD కీలక ప్రకటన..ఆ ఒక్కరోజు వారికి అనుమతి లేదు
తిరుమలలో జరిగే అతిముఖ్యమైన తీర్థ ఉత్సవాలలో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి( sri ramakrishna theertha mukkoti)ఒకటి. ప్రతి సంవత్సరం మకర మాసంలో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటిని ఫిబ్రవరి 12వ తేదీన నిర్వహించనున్నారు. శ్రీరామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ పుణ్యతీర్థాన్ని సృష్టించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. తిరుమలలో ఫిబ్రవరి 12న జరగనున్న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై తిరుమల గోకుల మీటింగ్ హాల్ లో TTD అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు.
ఈ ఏర్పాట్లు తప్పనిసరి
భక్తుల భద్రత, అన్నప్రసాదం, త్రాగునీరు, వైద్యం, అటవీ విభాగాల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సమావేశంలో తిరుమల పోలీసు ఉన్నతాధికారులు, టీటీడీ ఈఈ సుబ్రమణ్యంచ వీజీవో సురేంద్ర, డీఎఫ్ఓ శ్రీనివాసులు తదితరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణతీర్థ ముక్కోటికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను టీటీడీ ఈవో ఆదేశించారు. టీటీడీ భద్రతాసిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పాపవినాశనం దగ్గర భక్తులకు అన్నప్రసాదం పంపిణీకి అవసరమైన శ్రీవారి సేవకులను నియమించాలని గోగర్భం డ్యామ్ పాయింట్ నుండి పాపవినాశనం దాకా భక్తులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వారికి అనుమతి లేదు
ఈ సందర్భంగా ఆస్తమా ప్రాబ్లం ఉన్నవారిని అలాగే ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న భక్తులను,వృద్ధులను అనుమతించబోమని తెలియజేశారు. తీర్థం దగ్గర పూజలు సకాలంలో పూర్తి చేయాలని ఆలయ సిబ్బందిని ఆదేశించారు. ఫిబ్రవరి 12న ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను ఈ తీర్థానికి అనుమతించనున్నట్లు తెలిపారు.
పౌర్ణమి గరుడసేవ
ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 12న తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ఈ రోజున రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.



Click it and Unblock the Notifications
