Latest Updates
-
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.?
ఈ కొత్త ఏడాది శివ జపంతో ప్రారంభించండి
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తుల్లో పరమశివుడు ఒకరు. విశ్వాసంతో పూజించే భక్తులకు ఉదారంగా మోక్షాన్ని ప్రసాదించే స్వామి ఆయన. జనన మరణాల కాల చక్రం నుంచి విముక్తిని ప్రసాదించే దేవుడిగా ఆయన్ను సదా భక్తులు ప్రార్థిస్తారు. పరమ శివుడికి 'మహేశ్వరుడ'ని పేరు. అంటే 'లయకారుడు' అని అర్థం. దయా స్వరూపుడిగా ఆయన్ను కొలుస్తారు.
ప్రశాంత జీవితానికి జపించాల్సిన మంత్రాలు: పరమ శివుడి శక్తిమంతమైన మంత్రాలు జపిస్తే ఈ ఏడాతంతా ప్రశాంతగా సాగిపోతుంది. అదృష్టం కలిసివస్తుంది. సంసార సాగరాన్ని నడిపించే శక్తి వస్తుంది. ఈశ్వరుడి మంత్రాలు పఠిస్తే ఆ స్వామి జీవితంలో వచ్చే కష్టాల నుంచి గట్టెక్కిస్తారు. ఈ ఏడాది మీ సుఖమయ జీవితం కోసం అందిస్తున్న పరవేశ్వరుడి పవిత్ర మంత్రాలు ఇవి.

'పంచాక్షరీ మంత్రం': 'ఓం నమః శివాయః'. ఈ మంత్రం పటిస్తే మనసులో ద్వేషం, కోపం, స్వార్థం, ఈర్ష, అసూయ, తొందరపాటు పోయి మనసంతా ప్రేమ, సంతోషంతో నిండుతుంది. 108 సార్లు ఈ మంత్రం జపిస్తే ఆత్మ పరిశుద్ధమవుతుంది. దేవుడి అనుగ్రహం కలుగుతుంది.

'రుద్ర శివమంత్రం': 'ఓం నమో భగవతే రుద్రాయ': ఈశ్వరుడి అత్యంత శక్తిమంతమైన మంత్రాల్లో ఇది ఒకటి. భగవంతుడు కరుణించి అనుగ్రహించి కోరికలు తీర్చాలనుకుంటే రోజుకు కనీసం ఒక్కసారైనా ఈ మంత్రం పఠించాలి. కోరిన కోరికలు ఫలించాలంటే ఇంతకు మించిన మరో అద్భుత మంత్రం లేదని అంటారు.

జీవితంపై ప్రభావం చూపే గణేశ మంత్రం: 'ఓం మహాదేవాయ విద్మహే రుద్ర మూర్తయే ధీమహి తన్నో శివ ప్రచోదయాత్': ఈ గాయత్రీ శివ మంత్రం చాలా శక్తిమంతమైంది.ఈ మంత్రం పఠిస్తే పరమ శివుడు సుప్రసన్నుడు అవుతాడు. మనశ్శాంతి కలుగుతుంది.

'శివధ్యాన శివ మంత్రం': 'కర్చరాంకృతం వా కాయజం కర్మజం వా
శ్రవన్నయనజం వా మానసం వా పరధాం విహితం విహితం వా సర్వ మేతత క్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ మహదేవ్ శంభో'
ఈ మంత్రం పఠిస్తే పరమశివుడు తృప్తి చెంది పాపాల నుంచి పరిహరిస్తాడు. ఆత్మ శుద్ధి చేసి జీవితంలో నెలకొన్న నకారాత్మకత అంశాలను తొలగస్తిఆడు. ఈ కొత్త ఏడాది పరమేశ్వరుడిని ప్రార్థించి ప్రశాంతతను పొందండి మరి!



Click it and Unblock the Notifications
