For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  కృష్ణుడికి ఆ పేరు రావటానికి వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి?

  |

  పేరు పెట్టే పండగ లేక ఆచారాలు( బారసాల వంటివి) ప్రతి కుటుంబానికి మారచ్చు కానీ మత, సాంస్కృతిక నేపధ్యాన్ని బట్టి ఆ బిడ్డకి ఆనందాన్ని, ఆశీర్వాదాల్ని, సంతోషాల్ని తీసుకురావడమే దాని ముఖ్యోద్దేశం.

  బారసాల పండగ యొక్క ప్రాముఖ్యత : హిందూ మతంలో ముఖ్యంగా ప్రతీ పేరు వెనక ఒక అర్థం ఉంటుంది మరియు తల్లి తండ్రులు ఎంతో వెతికి తమ పిల్లల స్వభావాలకి బాగా సరిపోయే పేరే పెడతారు.ఒక్కోసారి తమ పిల్లలకు పురాణాల్లో గొప్ప వాళ్ళ పేర్లు పెట్టి, ఆ పేర్ల ద్వారా ప్రభావితమై అంత గొప్పవారు అవుతారని ఆశిస్తారు.

  పేరు పెట్టే వేడుక, భిన్న సంస్కృతులు :పేరు పెట్టడానికి కొన్ని కుటుంబాలు వేచి ఉంటే( నామకరణం - హిందుత్వం),మరికొన్ని పుట్టక ముందే పేరు నమోదు చేసేసి మరియు క్రైస్తవ బాప్టిజం ఉత్సవం తరువాత జరుపుకుంటారు(క్రైస్తవ మతంలో).కానీ మన దేవతల పేర్లు అసలు ఎలా వచ్చాయో అని మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా?

  దేవుడి పేర్లకి మూలం :ఎవరు వాళ్ళ పేరుని ఎంచుకుని ఉంటారు, వాళ్ళ పేరు అలా ఎంచడం వెనకాల ఉన్న అర్థం ఏంటి,లేక ఎవరు దేవుళ్లకి నామకరణం చేసుంటారు?మీలానే నాకు కూడా, ఎప్పుడూ ఎవరూ ఆలోచించని ఈ విషయాలంటే చాలా ఆసక్తి.

  కృష్ణుడికి ఆ పేరు ఎలా వచ్చింది?నాలోని ఈ ప్రశ్నల దాహం, నా చేత ఎన్నో ప్రశ్నలు అడిగించింది; సమాధానాల కోసం ఎన్నో పురాణ గ్రంధాలలో వెతికాను,కొన్ని విషయాలలో సంతృప్తికరమైన సమాధానాలే దొరికాయి.అందుకని, ఈ రోజు నేను మీతో కృష్ణ భగవానుడికి ఆ పేరు ఎలా వచ్చిందో పంచుకుంటాను.

  కృష్ణుడికి నామకరణం పండగ

  కృష్ణుడికి నామకరణం పండగ

  మనలో చాలా మందికి మన తల్లిదండ్రులో లేక ఇంటిలో ఉన్న ఎవరైనా పెద్దవారో పేర్లు పెడతారు , కానీ కృష్ణుడి విషయంలో అలా కాదు.తన తల్లిదండ్రులు తనకి పేరు పెట్టలేదు.

  కంసుని క్రూరత్వం

  కంసుని క్రూరత్వం

  కృష్ణుడి మామాయ్య అయిన కంసుడు, ఒక ఆకాశవాణి తన చెల్లికి పుట్టే ఎనిమిదవ సంతానం తనకు చావు తీసుకువస్తుంది అని చెప్పడం వలన కృష్ణుడికి జన్మనిచ్చిన తల్లిదండ్రులను చెరసాలలో బంధించాడని మనందరికి తెలిసినదే.

  వసుదేవుడు మథుర నుంచి కృష్ణుడ్ని తప్పించుట

  వసుదేవుడు మథుర నుంచి కృష్ణుడ్ని తప్పించుట

  కనుక,పుట్టిన వెంటనే, కృష్ణుడి తండ్రి వసుదేవుడు తనని గోకులానికి తీసుకెళ్ళిపోయాడు.అక్కడ ఆ గ్రామ పెద్దైన నందుడు ,తన భార్య అయిన యశోదకి పుట్టిన బిడ్డతో మార్చబడ్డాడు.

   గోకులానికి ఆచార్య గర్గుని పర్యటన

  గోకులానికి ఆచార్య గర్గుని పర్యటన

  కొన్ని రోజుల తర్వాత మహా తపస్వి అయిన గర్గుల వారు మథురకి వెళ్తుంటే మధ్యలో గోకులానికి నందుడు ఆహ్వానించాడు. నందుడి బలవంతం మీద గర్గుడు గోకులంలో ఉండటానికి అంగీకరించి, తన ప్రవచనాలతో మరియు బోధనలతో గ్రామస్తులకి జ్ఞానాన్ని పంచారు.

   గోకులంలో దురాగతం

  గోకులంలో దురాగతం

  దురదృష్టవశాత్తూ, గోకులంలో పుట్టిన అందరి పిల్లలను కంసుడి ఆదేశం మేరకు అతని సైనికులు చంపేస్తున్నారు. అందువలన నందుడు తన బిడ్డ మరియు మేనల్లుడు గురించి ఆచార్యులకి చెప్పలేదు.ఎక్కడ ఆ రహస్యం బయట పడుతుందేమో అన్ని భయంతో ఆ కుటుంబం గ్రామంలో ఏ స్థానిక పండితుడి దగ్గరకి కూడా వెళ్ళలేకపోయింది.

  గర్గ సంహిత

  గర్గ సంహిత

  ఆచర్యులు ఉన్న రోజుల్లో, నందుడు మరియు యశోద తమ బిడ్డ మరియు మేనల్లుడికి పేరు పెట్టమని ఆచార్యుని కోరారు.కానీ మహర్షి, తను యాదవుల ఆస్థాన గురువు కావడంతో, రాజు గారి అనుమతి లేకుండా ఏ పని చేయలేనని తన నిస్సహాయతని తెలిపారు.

  కృష్ణ లీల

  కృష్ణ లీల

  కానీ, ఆయనికి కృష్ణుని జన్మ యొక్క రహస్యం తెలుసు కాబట్టి( విష్ణు మూర్తి అవతారం),నందుడిని తన పిల్లల్ని చాటుగా గొడ్ల చావిడికి తెమ్మన్నాడు.

  ఆచర్య గర్గుడు కృష్ణ మరియు బలరామ అని పేర్లు పెట్టారు

  ఆచర్య గర్గుడు కృష్ణ మరియు బలరామ అని పేర్లు పెట్టారు

  నందుడి మేనల్లుడ్ని చూసి, ఈ రోహిణి యొక్క కుమారుడు , తన ధర్మ తత్వం చేత తన చుట్టుపక్కల ఉన్నవాళ్ళకి ఆనందాన్ని తెస్తాడని చెప్తారు.కనుక తన చివరి పేరు రామ అవ్వాలని మరియు తన అధిక బలం వలన తనని బల అని కూడా పిలవబడతాడని చెప్తారు.తను మనుషుల్ని కలిపి ఉంచుతాడు కాబట్టి అతనికి ఇంకో పేరు సంకర్షనుడు.

  కృష్ణ, విష్ణువు అవతారం

  కృష్ణ, విష్ణువు అవతారం

  తరువాత, నందుడి కొడుకుని తన చేతుల్లోకి తీసుకోని, తన జన్మ రహస్యాన్ని బయట పెట్టకుండా ఇలా చెప్తాడు"ఇతను ప్రతీ యుగంలో ఒక్కో అవతారం ఎత్తాడు.పూర్వపు కాలంలో తెలుపు,ఎరుపు మరియు పసుపు తదితర వర్ణాల అవతారాలు ఎత్తాడు.ఈ కాలంలో నల్లటి వర్ణం తీసుకున్నారు. అందువలన ఇతను కృష్ణుడిగా పేరు పొందుతాడు”.అలా, మన అందరికి ఇష్ట దేవుడైన కృష్ణుడికి ఆ పేరు వచ్చింది.(ఆధారితం: విష్ణు పురాణం)

  English summary

  Story behind how Lord Krishna got his name

  Particularly in Hinduism, every name has a meaning behind it and often parents search for the best ones that would suit their child’s personality. Sometimes they chose legendary names for their kids and hope that their kids get influenced by their name.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more