Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
Swapna shastra: మీరు ధనవంతులయ్యే ముందు మీకు వచ్చే కల ఇదే..అది కనిపిస్తే కష్టాలన్నీ హాంఫట్
సాధారణంగా నిద్రపోతున్నప్పుడు మనకి అనేక రకాల కలలు వస్తుంటాయి. కలలు రాని వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అయితే కొన్ని కలలు మనకు సంతోషాన్ని కలిగిస్తాయి..వాటిని ఎప్పుడూ చూడాలని అనిపిస్తుంది. మరికొన్ని భయాందోళనలు కలిగించేవిగా ఉంటుంటాయి. అవి గాఢ నిద్రలో నిద్రపోతున్న వ్యక్తిని కూడా మేల్కొల్పుతాయి. కలలు భవిష్యత్తులో జరగబోయే సంఘటనల వైపు చూపుతుందంటారు.
స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క కలకి ఓ ప్రత్యేక అర్థం ఉండి ఉంటది. అయితే మీ కష్టాలన్నీ తీరబోతున్నాయని..మీరు ధనవంతులవబోతున్నారని సూచించే కొన్ని కలలు కూడా ఉన్నాయి.ఆ కలలు వస్తే దానర్థం మీ పంట పండినట్లే. అయితే ఏ కలలు వస్తే మీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయినట్లు అర్థమో ఇక్కడ చూడండి.

కలలో ఆవును చూడటం
ఆవుని హిందువులు తల్లిగా భావిస్తారు.అందుకే ఆవుని గోమాత అని పిలుస్తారు. అలాంటి గోమాతను ఎవరైనా కలలో చూస్తే అది చాలా చాలా శుభప్రదం. స్వప్న శాస్త్రం ప్రకారం నిద్రపోతున్నప్పుడు ఆవు కనిపిస్తే దేవుడు మీ పట్ల సంతోషిస్తాడని,మీపై ఆశీర్వాదం కురిపించబోతున్నాడని అర్థమట. ఆవును కలలో చూడటం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు, ఆర్థిక పురోగతి కలుగుతాయని స్వప్న శాస్త్రం చెబుతోంది.
వర్షాన్ని చూడటం
స్వప్న శాస్త్రం ప్రకారం నిద్రిస్తున్నప్పుడు కలలో వర్షం పడుతున్నట్లు కనబడితే చాలా శుభప్రదం. ఈ రకమైన కల జీవితంలో రాబోయే ఆనందాన్ని సూచిస్తుంది. దేవుడు మీపై ఆయన ఆశీస్సులు కురిపించబోతున్నారని అర్థమట. ఈ కల వస్తే మీ జీవితంలోని అన్ని సమస్యలు అతి త్వరలో ముగుస్తాయని భావించవచ్చని కలల శాస్త్రం చెబుతోంది. ఇది ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం కలిగించే కల..ఎందుకంటే ఇది డబ్బు సంపాదించడానికి కొత్త వనరులను సూచిస్తుంది.
కలలో దేవాలయం చూడటం
కలలో టెంపుల్ లేదా గుడిని చూడటం చాలా శుభప్రదమని స్వప్న శాస్త్రంలో చెప్పబడింది. ఇది దేవుని ఆశీర్వాదాలను కురిపించే కల. ఈ కల వస్తే దేవుని ఆశీస్సులు మీపై ఉన్నాయని నమ్మవచ్చంట, దీని కారణంగా మీ జీవితంలోని సమస్యలు అతి త్వరలో ముగుస్తాయి.
తెల్ల ఏనుగుని చూడటం
నిజ జీవితంలో తెల్ల ఏనుగును చూడటం చాలా కష్టం. కానీ మీ కలలో తెల్ల ఏనుగును చూసినట్లయితే మీరు చాలా అదృష్టవంతులని అర్థం చేసుకోండి. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో తెల్ల ఏనుగును చూడటం చాలా శుభప్రదం. మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు రాబోతున్నాయని దీనర్థం అని స్వప్న శాస్త్రం చెబుతోంది.



Click it and Unblock the Notifications
