Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
ఒక్కసారి దర్శిస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం..అరుణాచలం వెళ్లాలనుకునేవారికి భారీ శుభవార్త
మనదేశంలోని అత్యంత ప్రసిద్ద శైవక్షేత్రమైన అరుణాచలంకి నిత్యం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. శివుడి అనుగ్రహం పొందేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు తమిళనాడు రాష్ట్రంలో ఉన్న అరుణాచలం వెళ్తారు. లోకానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ అరుణాచలేశ్వరుడిగా పూజాభిషేకాలు అందుకుంటున్నారు. శివుడు అగ్నిలింగంగా అవతరలించిన ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని ఒక్కసారి సందర్శిస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతుంటారు.
నిత్యం వందల మంది భక్తులు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసి పరమశివుడి అనుగ్రహం పొందుతారు. ఇక్కడ గుడికి దగ్గర్లో ఉన్న రమణ మహర్షి ఆశ్రమం కూడా చాలా ఫేమస్. శివుడి దర్శించుకోడానికి అరుణాచలం వచ్చిన ప్రతి ఒక్కరూ రమణ మహర్షి ఆశ్రమాన్ని కూడా విజిట్ చేస్తుంటారు. అయితే మీరు కూడా అరుణాచలం టూర్ ఫ్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. తెలంగాణ టూరిజం శాఖ హైదరాబాద్ నుంచి అరుణాచలంకి ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

టూర్ ప్యాకేజీ వివరాలు ఇలా
హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్లాలనుకునే వారి కోసం తెలంగాణ పర్యాటక శాఖ "HYDERABAD-ARUNACHALAM-Telangana Tourism "పేరుతో ఓ ప్యాకేజీని ప్రకటించింది. మొత్తం 4 రోజుల టూర్ ఉంటుంది. ఈ ప్యాకేజీ ప్రకారం ప్రయాణం మొత్తం బస్సులోనే ఉంటుంది. ఈ ప్యాకేజీలోనే భాగంగా కాణిపాకం, అరుణాచలం,వేలూరు గోల్డెన్ టెంపుల్ ని సందర్శించే అవకాశం లభిస్తుంది. జనవరి 10, 2025 సాయంత్రం 6:30 నుంచి హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి బస్సు జర్నీ స్టార్ట్ అవుతుంది. నాల్గవ రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ కోసం టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ప్యాకేజీ ధర
ధర విషయానికొస్తే పెద్దలకు ఒక్కొక్కరికి రూ.8000,చిన్నారులకు రూ.6400గా నిర్ణయించారు. తెలంగాణ టూరిజం అధికార వెబ్ సైట్ లో ఈ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు.టూర్ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ కు కాల్ చేయవచ్చు. [email protected] మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.



Click it and Unblock the Notifications