Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
మీపై చంద్రుడు, శని గ్రహాల ప్రభావం పడకూడదంటే... ఈ పరిహారాలు పాటించండి...
మీ జాతకంలో చంద్రుడు మరియు శని గ్రహ దోషాలుంటే ఈ పరిహారాలు పాటించండి...
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలకు అధిపతి సూర్యుడు అని మనందరికీ తెలుసు. గ్రహాలకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే గ్రహాలలో చంద్రుని, శని గ్రహాలకు చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది.

వీటిని కూడా ఆధారంగా చేసుకుని, మన జీవితంలో జరిగే పరిణామాలను అంచనా వేస్తుంటారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. జాతకాన్ని బట్టి భవిష్యత్తులో మనం కష్టాలను అనుభవిస్తామా? లేదా సుఖ, సంతోషాలు, ఆదాయాలను పొందుతామా అనే విషయాలను కూడా తెలుసుకోవచ్చు.

అయితే దీనికి శని, చంద్ర గ్రహాల అనుగ్రహం కచ్చితంగా ఉండాలని పండితులు చెబుతుంటారు. ఆ గ్రహాల ప్రభావం మనపై పడితే.. మనకు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయని..

అయితే ఇవి ఏయే స్థానాల్లో మనకు నష్టం సంభవిస్తుంది.. ఏ స్థానాల్లో ఉంటే లాభాలొస్తాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

చంద్రుడు ఆ స్థానంలో ఉంటే..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో అయినా చంద్రుడు, శని గ్రహాలు తొలి స్థానంలో ఉంటే వారు ఉద్యోగం కలిగి ఉండొచ్చు. అంతేకాదు వీరికి అత్యాశ కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వీరికి సోమరితనం కూడా ఎక్కువగా ఉంటుంది.

జాగ్రత్తగా నిర్ణయం..
అందుకే ఇలాంటి జాతకం ఉన్న వారిని నమ్మాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇలా కాకుండా వ్యక్తి జాతకంలో చంద్రుడు, శని నాలుగో స్థానంలో ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులు జల సంబంధిత పనులు చేస్తున్నారని అర్థం. అది వారి సొంత వ్యాపారం కావచ్చు. ప్రభుత్వం లేదా ప్రైవేటు పరమైన ఉద్యోగమైనా చేయవచ్చు.

శత్రువులపై గెలుపుకు..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, వ్యక్తుల జాతకంలో చంద్రుడు, శని ఏడో స్థానంలో ఉంటే.. అలాంటి వారు పాలిటిక్స్ కు దగ్గరగా, మంత్రులకు సన్నిహితంగా ఉంటారు. అయితే ఇలాంటి జాతకాలు ఉన్న అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. ఇంకోవైపు వ్యక్తి జాతకంలో చంద్రుడు పదో స్థానంలో ఉంటే అలాంటి వ్యక్తులు శత్రువులపై విజయం సాధిస్తారు. మరో విశేషమేమిటంటే.. వీరు మహారాజు లాంటి ఆనందాన్ని సాధించడానికి బలమైన అవకాశం ఉంటుంది.

చెడు ప్రభావం పడకూడదంటే..
మీ జాతకంలో శని గ్రహం, చంద్రుని యొక్క చెడు ప్రభావం పడకుండా ఉండాలంటే.. మీరు చంద్రుడికి సంబంధించిన వస్తువులను దానం చేయాలి. ముఖ్యంగా తెల్లని రంగులో ఉండే వస్తువులను దానం చేసేందుకు ప్రయత్నించాలి.

ఆంజనేయుడి ఆరాధన..
మీ జాతకంలో చంద్రుడు, శని గ్రహ ప్రభావం పడకుండా ఉండాలంటే.. మీరు క్రమం తప్పకుండా ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే ప్రతి మంగళవారం, శనివారం సింధూరం, సంపెంగ నూనె వంటివి సమర్పించడం మరచిపోవద్దు. దీని వల్ల మీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి.



Click it and Unblock the Notifications
