Latest Updates
-
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది!
Navratri 2021: ఆయుధ పూజ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందమా...
ఆయుధ పూజల్లో భాగంగా మొదట చేయాల్సింది పాశపూజ. పాశ పూజ చేయడం వల్ల మనిషిలోని పుశుత్వం పోతుంది. అందుకే ఆయుధ పూజలో భాగంగా మొదటగా అమ్మవారి పాశానికి పూజ చేయాలి. ప్రతి ఒక్కరిలో పశువు లక్షణాలు కొన్ని అయినా ఉంట
హిందూ క్యాలెండర్ ప్రకారం నవరాత్రులు ముగిసిన వెంటనే విజయదశమి లేదా దసరా పండుగను జరుపుకుంటారు. అయితే ఈ పండుగ కంటే ముందురోజు ఆయుధ పూజను ప్రముఖంగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఒక రోజు జరుపుకుంటే.. ఇంకో రోజు కర్నాటక ఇతర ప్రాంతాల్లో జరుపుకుంటారు. ఆయుధ పూజ రోజూ ఆయుధాలకు పూజ చేయడం ఆనవాయితీ. అసలు ఆయుధపూజ అంటే ఏమిటి..దాన్ని ఎందుకు చేయాలో తెలుసా?

చాలా మంది ఆయుధ పూజ అనగానే బైక్ లు, కార్లు, కంప్యూటర్లు ఇలా తదితర వాటికి పూజలు చేస్తారు. వాటికి కూడా చేయొచ్చు. అయితే ఆయుధ పూజలో కచ్చితంగా చేయాల్సినవి ఏమిటో కూడా తెలుసుకోవాలి.

చంపడానికి ఉపయోగించేవి
ఇక ఆయుధాలు అంటే అందరూ చంపడానికి ఉపయోగించేవి అని అనుకుంటారు. కానీ అమ్మవారు ధరించే ఆయుధాల ఉద్దేశం అది కాదు. ఇక అమ్మవారు ధరించే ప్రతి ఆయుధానికి మనం పూజ చేయాలి. అదే ఆయుధ పూజ ముఖ్య ఉద్దేశం.

పాశానికి పూజ
ఆయుధ పూజల్లో భాగంగా మొదట చేయాల్సింది పాశపూజ.
పాశ పూజ చేయడం వల్ల మనిషిలోని పుశుత్వం పోతుంది. అందుకే ఆయుధ పూజలో భాగంగా మొదటగా అమ్మవారి పాశానికి పూజ చేయాలి. ప్రతి ఒక్కరిలో పశువు లక్షణాలు కొన్ని అయినా ఉంటాయి. వాటిని తొలగించడానికి చేసేది ఈ పాశ పూజ.

అంకుశ పూజ
ఆయుధ పూజలో భాగంగా అంకుశ పూజ చేయాలి. అంకుశం కూడా ఒక పరికరంలాంటిదే. మనిషిలో ఉండే చెడు లక్షణాన్ని తొలగించుకోవడానికి అంకుశ పూజ కచ్చితంగా చేయాలి.

అమ్మవారి చేతిలోని బాణాలు
అమ్మవారిచేతిలో ఐదు బాణాలుంటాయి. వాటి ద్వారా ఈ విశ్వంలో ఏర్పడే ప్రళయాలను ఆపగలదు. వాటికి మనం కచ్చితంగా పూజ చేయాలి. అలాగే అమ్మవారి చేతిలో ఉండే విల్లుకు కూడా కచ్చితంగా పూజ చేయాలి.

సుదర్శన చక్రం
సుదర్శన చక్రం విష్ణువు దగ్గర ఉంటుంది కదా అనుకోవొచ్చు. అయితే అమ్మవారు దుర్గాదేవీ రూపంలో దీన్ని ధరిస్తారు. అందుకే సుదర్శన చక్రానికి కూడా పూజ చేయాలి. అయితే కొన్ని ప్రాంతాల్లో నిన్న అంటే అక్టోబర్ 17, 2018న ఆయుధ పూజ చేసుకుని నేడు అంటే అక్టోబర్ 18, 2018న విజయదశమి నిర్వహించుకుంటున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో నేడు ఆయుధపూజ జరుపుకుంటున్నారు. అందుకు కొన్ని కారణాలున్నాయి.



Click it and Unblock the Notifications
