For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శఠగోపం పెట్టడం వెనక ఉన్న ప్రాధాన్యత ఏంటి ?

By Swathi
|

గుడికి వెళ్తే.. దేవుడి దర్శనం, హారతి, తీర్థం. ఇవి మాత్రమే కాదు.. శఠగోపం పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడికి ఖచ్చితంగా శఠగోపం పెట్టి దీవిస్తారు ఆలయపూజారులు. దేవుడి దర్శనానికి వెళ్లిన భక్తులకు శఠగోపం పెట్టే ఆచారం ఎందుకు వచ్చింది ? దీనివల్ల ప్రయోజనమేంటి ? గుళ్లో శఠగోపానికి ఎందుకంత ప్రాధాన్యత ?

READ MORE: కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది ?READ MORE: కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది ?

దేవుడి దర్శనం అయ్యాక తీర్థం తీసుకుని తప్పకుండా శఠగోపం పెట్టించుకోవాలి. కొంతమంది దేవుడికి నమస్కారం చేసుకుని.. చకచకా వెళ్లిపోతుంటారు. కానీ.. ఆలయానికి వెళ్లాక ఖచ్చితంగా శఠగోపం పెట్టించుకుంటేనే మంచిది. అసలు శఠగోపం ఎందుకు పెట్టించుకోవాలి ? శఠగోపం వెనక ఉన్న శాస్త్రీయ కారణాలు, నమ్మకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గుళ్లో శఠగోపానికి ఎందుకంత ప్రాధాన్యత ?

గుళ్లో శఠగోపానికి ఎందుకంత ప్రాధాన్యత ?

శఠగోపం అంటే అత్యంత గోప్యామైనది అని అర్థం. శఠగోపంను వెండి, రాగి, కంచుతో తయారు చేస్తారు. దాని మీద విష్ణువు పాదాలుంటాయి. శఠగోపంను శఠగోప్యం, శఠారి అని కూడా పిలుస్తారు.

గుళ్లో శఠగోపానికి ఎందుకంత ప్రాధాన్యత ?

గుళ్లో శఠగోపానికి ఎందుకంత ప్రాధాన్యత ?

విష్ణుపాదాలు ఉన్న శఠగోపంను తలమీద పెట్టినప్పుడు మన కోరికలు భగవంతుడికి తెలపాలని ఈ శఠగోపం వివరిస్తుంది. పూజారికి కూడా వినిపించకుండా మన కోరికలను భగవంతునికి విన్నవించుకోవాలి. అంటే మన కోరికే శఠగోపం.

గుళ్లో శఠగోపానికి ఎందుకంత ప్రాధాన్యత ?

గుళ్లో శఠగోపానికి ఎందుకంత ప్రాధాన్యత ?

శఠగోపం మన తలపై పెట్టగానే ఏదో తెలియని అనుభూతి, మానసిక ఉల్లాసం కలుగుతుంది.

గుళ్లో శఠగోపానికి ఎందుకంత ప్రాధాన్యత ?

గుళ్లో శఠగోపానికి ఎందుకంత ప్రాధాన్యత ?

మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుంచి దూరంగా ఉంటామని తలూస్తూ తలవంచి శఠగోపం ద్వారా తీసుకోవటమని మరో అర్థం ఉంది.

గుళ్లో శఠగోపానికి ఎందుకంత ప్రాధాన్యత ?

గుళ్లో శఠగోపానికి ఎందుకంత ప్రాధాన్యత ?

శఠగోపమును రాగి, కంచు, వెండిలతో తయారు చేయడం వెనక మరో అంతరార్థం ఉంది. శఠగోపం తలమీద ఉంచినప్పుడు శరీరానికి లోహం తగలడం ద్వారా విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్‌ బయటకి వెళ్లిపోతుంది. దీని ద్వారా శరీరంలో ఆందోళన, ఆవేశం తగ్గుతాయి.

గుళ్లో శఠగోపానికి ఎందుకంత ప్రాధాన్యత ?

గుళ్లో శఠగోపానికి ఎందుకంత ప్రాధాన్యత ?

శఠగోపం రూపం వెనక మరో అర్థం ఉంది. శఠగోపంపై విష్ణుపాదాలు ఉంటాయి. అవి పూర్తీగా భక్తుల తలను తాకడానికి అనుకూలంగా ఉండటం కోసం ఇలా వలయాకారంలో తయారు చేస్తారు. దీన్ని తలపై పెడితే.. భగవంతుని స్పర్శ శిరస్సుకి తగిలి.. భక్తులను అనుగ్రహిస్తారని అర్థం.

గుళ్లో శఠగోపానికి ఎందుకంత ప్రాధాన్యత ?

గుళ్లో శఠగోపానికి ఎందుకంత ప్రాధాన్యత ?

శఠత్వం అంటే మూర్ఖత్వం, గోపం అంటే దాచిపెట్టడం అని అర్థం. భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడని ఆధ్యాత్మికత వేత్తలు వివరిస్తారు.

గుళ్లో శఠగోపానికి ఎందుకంత ప్రాధాన్యత ?

గుళ్లో శఠగోపానికి ఎందుకంత ప్రాధాన్యత ?

శఠగోపం గుడిలోని దేవత, దేవుడి విగ్రహానికి ప్రతీక. గుడికి వెళ్లిన భక్తులకు.. దేవతలను తాకే వీలుండదు కాబట్టి.. తీర్థప్రసాదాలిచ్చిన తర్వాత ఆలయ పూజారి శఠగోపంను భక్తుల తలపై పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

గుళ్లో శఠగోపానికి ఎందుకంత ప్రాధాన్యత ?

గుళ్లో శఠగోపానికి ఎందుకంత ప్రాధాన్యత ?

శఠగోపంను శఠారి అనిపిస్తారు. ఇక్కడ మరో అర్థం చెబుతున్నారు. శఠం అంటే మోసగాళ్లు, అరి అంటే శత్రువు. అంటే మోసగాళ్లకు శత్రువు అని అర్థం. భక్తుల తలపై శఠగోపం పెట్టగా.. చెడు తలంపులు, ద్రోహం వంటి లక్షణాలు నశించి మంచి ప్రవర్తన అలవడుతుందని అంతరార్థం ఉంది.

ఇంతకి గొప్ప అర్థం, అంతరార్థం ఉన్న శఠగోపంను ఇకపై ఆలయంలో తప్పకుండా.. మీ శిరస్సుపై పెట్టించుకుని, ఆ దేవుడి అనుగ్రహ, ఆశీస్సులు పొందండి.

English summary

The Meaning and Importance of Shadagopyam or Satagopam

The Meaning and Importance of Shadagopyam or Satagopam.
Desktop Bottom Promotion