మహాభారత యుద్ధానికి దారితీసిన అసలైన వాస్తవాలు

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky

మనందరికీ కౌరవులకు మరియు పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం చేజిక్కించుకోవడం కొరకు జరిగిన అత్యంత ప్రసిద్ధమైన మహాభారత యుద్ధం గురించి తెలిసిందే! ఇది నిజమే అయినప్పటికీ చాలామందికి తెలియని వాస్తవమేమిటంటే, ఈ మహాయుద్ధానికి బీజాలు అది జరగడానికి చాలా నాళ్ల పూర్వమే నాటబడ్డాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

హిందూమత కర్మ సిద్ధాంత అనుసారం మన ప్రస్తుత జీవితం, మన గతజన్మ పాపపుణ్య ఫలితాల ప్రకారం ఉంటుంది. కనుక మన ఈ జన్మ, పూర్వజన్మ కర్మఫలం. ఈ సిద్ధాంతం ప్రకారమే కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు గుడ్డితనం గురించి ఒక కథ ప్రచారంలో ఉంది.

The Real Reason Behind Mahabharata

ధృతరాష్ట్రుని పూర్వజన్మ:

పూర్వజన్మలో ధృతరాష్ట్రుడు ఒక క్రూరమైన రాజు. అతను తన సైన్యంతో వేటకు బయలుదేరాడు. బాగా అలసిపోయిన ధృతరాష్ట్రుడు నదీతీరంలో ఒక వృక్షం కింద సేదతీరడానికి ఆగాడు. అక్కడ నదిలో ఒక హంస తన పిల్లలతో ఆడుకుంటూ కనిపించింది. క్రూరమైన మనస్సు కలిగినవాడై, అతను తన సేవకులను ఆ హంస యొక్క కళ్ళను పెకిలించి, తన పిల్లల ప్రాణాలు తీయమని ఆజ్ఞాపించాడు. ఆ సేవకులు రాజు చెప్పిన విధంగానే చేశారు. ఈ దుష్కర్మకు మిక్కిలి దుఃఖించిన ఆ హంస, ఆ రాజుకు అతని తదుపరి జన్మలో గుడ్డితనం సంప్రాప్తిస్తుందని శపించింది.

ధృతరాష్ట్రుడు మరియు పాండురాజుల జననం:

శంతన మహారాజు ఆయన భార్య సత్యవతిలకు చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. చిత్రాంగదుడు యుద్ధంలో మరణిస్తాడు. అప్పుడు భీష్మాచార్యుడు అంబిక మరియు అంబాలికలను ఇద్దరు కన్యలను ఇచ్చి విచిత్రవీర్యుని కళ్యాణము జరిపించాడు. వివాహానంతరం విచిత్రవీర్యుడు కూడా తీవ్రంగా జబ్బుపడి మరణిస్తాడు.

కుమారుల మరణంతో సింహాసనానికి వారసులెవరూ లేరని తీవ్రంగా కలతచెందిన సత్యవతి వాల్మీకి మహర్షి వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. వాల్మీకి మహర్షి ఆశీస్సులతో అంబిక, అంబాలిక చెరొక కుమారునికి జన్మనిచ్చారు.

వాల్మీకి మహర్షి తన తపశ్శక్తితో బాలికలను ఆశీర్వదిస్తున్నప్పుడు అంబిక భయంతో తన కళ్ళు మూసుకుంది. కనుక ఆమెకు పుట్టిన బిడ్డ పుట్టుకతోనే అంధుడయ్యాడు. ఆ బాలుడు ధృతరాష్ట్రుడుగా పేరుగాంచాడు. ఈయనే కౌరవుల తండ్రి. అదే సమయంలో అంబాలిక భయంతో తెల్లబోయింది. కనుకనే, ఆమెకు పుట్టిన బిడ్డ పుట్టుకతోనే బలహీనుడు. ఈ బిడ్డే భవిష్యత్తులో పాండవులకు జన్మనిచ్చిన పాండురాజు.

మనకు గుణాలు ఎలా ప్రాప్తిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా?

ధృతరాష్ట్ర వివాహం: ధృతరాష్ట్రుడు, గాంధార రాజైన సుబలుని కుమార్తె అయిన గాంధారిని వివాహమాడాడు. గుడ్డివాడైన భర్తను చూడగానే గాంధారి తాను కూడా జీవితాంతం ఈ లోకాన్ని చూడబోనని ప్రతినబూని తన కళ్ళను నల్లగుడ్డతో కట్టుకుని ఎప్పటికి అలానే ఉండిపోయింది.

గాంధారి తన నిర్ణయానికి అమితంగా ప్రశంసించబడింది. ఆమె గురించి లోకానికి తెలియని నిజం ఒకటుంది. తన జన్మపట్టికలో ఉన్న జాతక దోషాల మూలంగా, దోష నివారణకు ఆమెకు ముందుగా ఒక మగ మేకతో వివాహం జరిపించి దానిని వధించారు

ఈ విషయం తెలిసిన ధృతరాష్ట్రుడు కోపోద్రిక్తుడయ్యాడు. కోపంతో ఆయన గాంధార రాజు సుబలుడిని, ఆయన కుమారులను చెరలో పెట్టించి, అమితమైన వేధింపులకు గురిచేశాడు. వారికి ఆహారపానీయాలను కూడా అందించలేదు. కొన్నాళ్ళకు వారందరూ మరణించారు. వారి కుమారులలో ఒకేఒక్కడు ప్రాణాలు దక్కించుకున్నాడు. ఆయనే శకుని. మహాభారతం యుద్ధంలో ముఖ్యపాత్ర పోషించిన, మనందరికి తెలిసిన తెలివయిన ప్రతినాయకుడే ఈ శకుని.

సుబలుడు తను చనిపోయేముందు చివరిసారి కోరికగా శకునిని విడిచిపెట్టమని కోరుకున్నాడు. కనుకనే శకునిని విడిచిపెట్టారు. ఇంకొక విశ్వాసం ప్రకారం సుబలుడు ఒకసారి తన కుమారుడైన శకునిని, తాను చనిపోయాక తన వెన్నులోని ఎముకలను జూదానికి వాడే పాచికలు తయారుచేయడానికి వాడమని అడిగాడు.

ఈ పాచికలను శకుని తన మాయతో నియంత్రించేవాడు. ఈ పాచికలనే జూదమాడేటప్పుడు శకుని పాండవులకు ఇచ్చి ఆడమని తన మాయతో వాటిని నియంత్రించి వాళ్ళు ఓడిపోయేటట్టు చేసాడు.

కారాగారవాసం ముగిసి చెరసాల బయటకు వచ్చిన మరుక్షణం నుండి శకుని, తన పన్నాగాలతో కౌరవులు మరియు పాండవుల మధ్య దూరం పెంచడంలో సఫలీకృతుడయ్యాడు. తనకు, తన తండ్రికి, తన అన్నదమ్ములకు దుర్గతి పట్టించిన ధృతరాష్ట్రుడు మరియు అతని వారసులపై ప్రతీకారవాంఛతో రగిలిపోయి, వారి వినాశనానికై అహరహం శ్రమించాడు శకుని.

పైకి కౌరవులకు మద్దతిచ్చినట్లు కనిపించినప్పటికి, లోలోపల తన పదునైన మెదడును సంపూర్తిగా ధృతరాష్ట్ర సంతానం తుడిచిపెట్టుకుపోవడానికి అవసరమైన ఎత్తులు వేయడానికి వాడాడు. ఈ విధంగా మహాభారత యుద్ధానికి నాంది పడి ఒక పురాణమైంది.

English summary

The Real Reason Behind Mahabharata

We all know that the famous battle of Mahabharata was fought between the Kouravas and the Pandavas, and also that it was fought for the throne of the kingdom Hastinapur. Well, while all this is true, there is another less-known fact that the seeds of the battle had been sown long before it actually took place. Lets us explore how.
Story first published: Tuesday, May 1, 2018, 12:00 [IST]