Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఈ గురువులు చాలా కాస్లీ గురూ..! ఆస్థులు చూస్తే షాక్ కావాల్సిందే..!
కలియుగంలో తాము దేవుళ్లమని చెబుతూ చాలా మంది ముందుకు వస్తారని పురాణాల్లో కూడా రాసివుంది. బహుసా ఇలా జరుగుతుందని పురాణాల్లో ముందుగానే వుంది. చాలా మంది ఆధ్యాత్మిక గురువులు తాము దైవాంశ సంభూతులుగా చెప్పుకుంటున్నారు. వారి వద్దకు దేశ నలుమూలల నుంచి మాత్రమే కాదు ప్రపంచంలో వివిధ దేశాల నుంచి వచ్చి వారిని దర్శించుకుంటున్నారు. ఇలా భారత దేశంలో కొందరు ఆధ్మాతిక గురువులు మిలియన్ల భక్తులను సంపాదించుకోవడంతో పాటు కోట్ల ఆస్తులను కలిగి వున్నారు.
సత్ గురువు జగ్గీ వాసుదేవ్
జగ్గీవాసుదేవ్ గురించి తెలియని వారుండరు. ఇప్పుడున్న ఆధ్యాత్మిక గురువలందరిలో ఆయన టాప్ స్థానంలో వున్నారనడంలో సందేహం లేదు. చాలా మంది సెలబ్రిటీలు ఆయన భక్తులుగా వున్నారు. ఇషా ఫౌండేషన్‌ను స్థాపించి ఆత్మాక బోధనలు చేస్తూ కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఆయనకు యోగా సెంటర్లు, విద్యా సంస్థలతో పాటు ప్రకృతిని కాపాడే ప్రాజెక్టులు కూడా వున్నాయ్. జీవతాన్ని ఎలా ఆస్వాదించాలి, శివతత్వం అంటే ఏంటి, సమస్యలను ఎలా ఎదుర్కోవాలి లాంటి అనేక విషయాలను తన భక్తులకు చెబుతూ వుంటారు. చెన్నైకు చెందిన ఈయనకు కోయంబత్తూర్‌లో ఆదియోగి సెంటర్ అనే పెద్ద ఆశ్రమం వున్నాది. ఈయన ఆస్థుల విలువ సుమారుగా 25 కోట్లు వుంటుదని అంచనా.
బాబా రాందేవ్
భారతదేశంలో యోగాలో ఈయనకు మించిన గురువు లేరు. పతంజలి ప్రాడక్ట్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి బిజినెస్‌ను సాధించారు. మొదట్లో బహిరంగంగా ఎన్నో యోగా సెంటర్లను స్థాపించారు. ఈయన ఆస్తుల విలువ మొత్తం రూ. 1700ల కోట్లకు పైగానే వుంటుందని అంటున్నారు.

ఆశారాం బాపు
దేశంలో వున్న పాపులర్ గురువుల్లో ఆశారాం బాపు కూడా ఒకరు ఈయనకు మొత్తం 350కి పైగా ఆశ్రమాలు వున్నాయని తెలిసింది. ఆశారం బాపుకు చెందిన ట్రస్టు సంవత్సరానికి 350 కోట్ల రూపాయల టర్నోవర్ కలిగి వుంటుందని అంటున్నారు.
నిత్యానంద
ప్రపంచంలోని ఒక చోట ఒక చిన్న దీవిని కొనుగోలు చేసి దానికి కైలాసం అని నామకరణం చేసి అదే ఈ భూమిపై పవిత్రమైన స్థలంగా చెబుతున్నారు. ఈయన నిత్యానంద ధ్యానఫీఠ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఎన్నో గురుకులాలను, ఆశ్రామలను నిత్యానంద నడిపిస్తున్నారు. సంవత్సరానికి ఈయనకున్న ట్రస్టుల టర్నోవర్ 10 వేల కోట్ల రూపాయలకు వరకు వుంటుందని అంటున్నారు.
మాతా అమృతానందమయ్
అమ్మగా మాతా అమృతానందమయి చాలా గుర్తింపును సాధించుకున్నారు. అమ్మగా ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని సాధించుకున్నారు. ఆమె ఆస్తుల విలువ రూ.1800 కోట్లకు పైగానే వుంటుందని అంటున్నారు. ఈమె ట్రస్టు కింద పాఠశాలలు, కాలేజీలు కూడా నడుస్తున్నాయ్.
శ్రీశ్రీ రవిశంకర్
ఎప్పుడూ ప్రసన్న వదనంతో వుండే శ్రీశ్రీ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫైండేషన్‌ను స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా పేరు సంపాదించుకున్నారు. మొత్తం 150 దేశాల నుంచి చాలా మంది భక్తులు ఈయనను అనుసరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా శ్రీశ్రీ రవిశంకర్‌కు 30 కోట్ల మంది భక్తులు వున్నారని అంటారు. ఈయన ఆస్థుల విలువ సుమారు రూ.1500ల కోట్ల వరకు వుంటుందని చెబుతున్నారు. తెలుగు భాషను కూడా అనర్గలంగా మాట్లాడ్డం విశేషం.



Click it and Unblock the Notifications