Latest Updates
-
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.! -
సాయంత్రం వేళ ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించాలి?అష్టైశ్వర్యాలు తెచ్చే అద్భుతమైన మార్గం.. -
చేతి గోళ్లు ఇలా ఉంటే కిడ్నీల ఆరోగ్యానికి వార్నింగ్.. మీకూ ఇలా ఉందా.? -
ఈ పద్ధతిలో అల్లం చట్నీ చేస్తే.. ఎవరైనా సరే నాలుగు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి సొరకాయ దోశ..అప్పటికప్పుడు ఈజీగా చేసుకోండిలా.. -
మంచి భర్త కోసం ఉపవాసం చేస్తున్నారా.. కానీ శివారాధనలో అమ్మాయిలు చేసే పొరపాట్లు ఇవే.!
గణేశుడిని ఇంటికి తీసుకొచ్చేముందు రెడీగా ఉంచుకోవాల్సిన పూజా సామాగ్రి
ఇది పండగ సీజన్, మనందరికీ వినాయక చతుర్ధి జరుపుకోవడం చాలా ప్రీతిపాత్రం.మనింటికి గణేశుడిని తీసుకొచ్చేముందు తయారు గా ఉంచుకోవాల్సినవాటి గురించి ఈరోజు తెలుసుకుందాము.
ఈ పండగ ని హిందువులు అతి విలాసవంతంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవాల్లో మహమ్మదీయులు కూడా పాల్గొంటారు.ఈ సమయం లో కొన్ని వస్తువులని తయారుగా ఉంచుకోవాలి.ఎందుకంటే ఈ వస్తువులన్నీ ఏదో ఒక ప్రాముఖ్యత కలిగి ఉన్నవే.గణేశుడిని ఇంటికి తీసుకువచ్చేముందు తయారు గా ఉంచుకోవాల్సిన సామాగ్రితో పాటు గణేశుడిని తీసుకొచ్చే ముహుర్తం కూడా ముఖ్యమే.
ఈరోజు మీరు మీ ఇంటికి గణేశుడిని తీసుకొచ్చేముందు తయారుగా ఉంచుకోవాల్సిన ముఖ్య సామాగ్రి గురించి ఇస్తున్నాము.చదవండి మరి.
అగరుబత్తులు:
అగరుబత్తుల లేదా సాంబ్రాణి ధూపం వెయ్యడమనే సంప్రదాయం అనాదిగా వస్తున్నదే.మీ ఇంటిలో కాసిని అగరుబత్తులని లేదా సాంబ్రాణిని సువాసన కోసం వెలిగించండి.ఈ ధూపం మిమ్మల్ని ప్రశాంతం గా ఉంచడంతో పాటు పూజలో మీ ధ్యానం చెదరకుండా ఉంచుతుంది.

అగరుబత్తులు:
అగరుబత్తుల లేదా సాంబ్రాణి ధూపం వెయ్యడమనే సంప్రదాయం అనాదిగా వస్తున్నదే.మీ ఇంటిలో కాసిని అగరుబత్తులని లేదా సాంబ్రాణిని సువాసన కోసం వెలిగించండి.ఈ ధూపం మిమ్మల్ని ప్రశాంతం గా ఉంచడంతో పాటు పూజలో మీ ధ్యానం చెదరకుండా ఉంచుతుంది.

హారతి పళ్ళెం:
దీనిలో దీపాలు పెట్టి అలంకరించండి.ఇంకా హారతి సమయం లో కావాల్సిన సామగ్రి(హారతి కర్పూరం, అగ్గిపెట్టె వంటివి) దీనిలో తయారుగా ఉంచండి.పూవులు,హారతి కర్పూరం,కొబ్బరికాయ, కుంకుమ హారతి పళ్ళెంలో ఉంచాల్సిన సామగ్రి.

గంట:
గంట కి పూజలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో పూజ చేసి హారతి ఇచ్చే సమయంలో గంట ని మ్రోగించాలి. గంట మోగించడం వల్ల దేవతలు ప్రసన్నులవుతారు.

పచ్చి బియ్యం:
మనింటికి తెచ్చిన గణేశుడి విగ్రహాన్ని బియ్యం మీద నిలబెట్టడం ఆచారం.ఒక పళ్ళెంలో బియ్యం పోసి దానిలో గణేశుడిని నిలబెట్టి పూజా గృహం లో ఉంచి పూజ చెయ్యాలి.

పీట
గణేష విగ్రహాన్ని ప్రతిష్టింప చేసి పూజించుటకు తప్పనిసరిగా పీట అవసరం అవుతుంది.

తెల్లని వస్త్రం
తెల్లని వస్త్రం, పీట మీద పరవడానికి ఒకటి, మరొకటి పూజా సమయంలో గణేషుడు ముఖం కనబడకుండా తెల్లని వస్త్రం కప్పి ఉంచుతుంది. పూజ అలంకరణ తర్వాత తొలగించేస్తారు.

గంధంలో ముంచిన శుభ్రమైన క్లాత్
గంధంలో ముంచిన ఒక శుభ్రమైన క్లాత్ ను దేవుడిని ప్రతిష్టిచడానికి ముందు పీట మీద వేస్తారు.

పండ్లు
గణేషుడుకి ఇష్టమైన పండ్లు, అరటిపండ్లు, ఎలక్కాయి, దోసకాయలు వంటి పండ్లను సిద్దం చేసుకోవాలి

పువ్వులు
గణేషుడికి ఇష్టమైన పువ్వులు, చామంతి, బంతిపూలు, రోజూ పువ్వులు, గన్నెరు పువ్వులను సిద్దం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications