For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లిలో ఈ తప్పులు చేస్తే... వధూవరులకు ఎంత నష్టమో తెలుసా...!

ఏయే పొరపాట్లు చేస్తే దాంపత్య జీవితం నాశనమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

|

పూర్వకాలంలో మన దేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరి ఇంట్లో కళ్యాణం వంటి కమనీయ కార్యక్రమం జరుగుతుందంటే అది ఎంతో ఘనంగా జరిగేది. ఐదురోజుల పెళ్లి.. ఆకాశమంత పందిరి.. అదిరిపోయే వంటలు బంధువులు.. బంధాలు.. అనుబంధాలు.. ఆప్యాయతలు.. అనురాగాలు.. అప్పగింతల వరకు అంతా ఓ పండుగలా జరుపుకునేవారు.

Things youre doing wrong that will spoil your marriage life in Telugu

ఇంతటి ముఖ్యమైన రోజు కోసం ఎంతోకాలం ముందుగానే ప్లాన్ చేసుకునేవారు. ఏడడుగుల బంధం గురించి.. దాంపత్య జీవితం పవిత్రత గురించి మన సనాతన ధర్మాలు, పండితులు మనకు తెలియజేసేవారు.

Things youre doing wrong that will spoil your marriage life in Telugu

కానీ ప్రస్తుతం పెళ్లి అంటే ఎక్కడా పండుగ వంటి వాతావరణం కనిపించడం లేదు. పైగా విదేశీ కల్చర్ మోజులో పడి మన శాస్త్ర విలువలను మరచి అధోగతి పాలవుతున్నారు. ఫ్యాషన్ పేరిట మన వివాహ సంప్రదాయాలను, కట్టుబాట్లను లెక్కచేయకుండా, తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. అంతేకాదు వారు కూడా పీస్ ఫుల్ లైఫ్ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అందుకు గల ముఖ్యమైన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

లోక కళ్యాణం కోసమే శ్రీవారి బ్రహ్మోత్సవాలు...!లోక కళ్యాణం కోసమే శ్రీవారి బ్రహ్మోత్సవాలు...!

మంచి ముహుర్తం..

మంచి ముహుర్తం..

ప్రస్తుతం చాలా మంది సిటీ లైఫ్ కల్చర్ కు అలవాటు పడి, తమకు నచ్చిన సమయంలో పెళ్లికి సిద్ధమవుతున్నారు. అదే టైములో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మన సనాతన ధర్మం ప్రకారం మూడు ముళ్లతో ఒక్కటయ్యే ముహుర్తానికి అస్సలు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. దీని వల్ల వారికి మనోవైకల్యం, దంపతుల మధ్య సాన్నిహిత్యం లేకపోవడం, భార్యాభర్తలు మంచి సంతానం పొందకుండా ఇబ్బందులు ఎదుర్కొంటారని పండితులు చెబుతున్నారు.

ఫొటోలు, వీడియోలకే ప్రాధాన్యత..

ఫొటోలు, వీడియోలకే ప్రాధాన్యత..

హిందూ ధర్మం ప్రకారం, పెళ్లి అంటే మూడు ముళ్లు వేయటం ఒక్కటే కాదు.. జీలకర్ర బెల్లం తల మీద ఉంచి, ఒకరి కళ్లలో మరొకరు చూపులు కలుపుకోవడం వంటి కార్యక్రమాలెన్నో ఉంటాయి. అయితే ఇలాంటివి కూడా చాలా మంది జరుపుకోవట్లేదు. రిసెప్షన్ పేరిట కేవలం ఫొటోలు, వీడియోలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫొటోలు స్వీట్ మెమోరీస్ ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ముందు ధర్మం ఆచరించాలి కదా. ఆ తర్వాతే ఇంకేదైనా అనే విషయాలను మరచిపోతున్నారు.

వాటిపైనే ఎక్కువ శ్రద్ధ..

వాటిపైనే ఎక్కువ శ్రద్ధ..

కళ్యాణం వంటి కమనీయమైన కార్యక్రమంలో కేవలం ఫొటోలు, వీడియోలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల సంస్కారం లోపించడం వంటి నష్టాలు జరుగుతాయి.

వాస్తుశాస్త్రం ప్రకారం ఆ వైపునే తిరిగి పడుకోవాలి... ఈ వైపునే తిరిగి నిద్ర లేవాలి...!వాస్తుశాస్త్రం ప్రకారం ఆ వైపునే తిరిగి పడుకోవాలి... ఈ వైపునే తిరిగి నిద్ర లేవాలి...!

థర్మకోల్ లేదా రంగుల గుండ్లు..

థర్మకోల్ లేదా రంగుల గుండ్లు..

పెళ్లిలో తలంబ్రాలు(పసుపు బియ్యం)కు బదుల థర్మకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవడం చాలా కామన్ గా మారిపోయింది. అయితే ఇలా చేయడం వల్ల బంధువుల మధ్య ద్వేషం, ఆర్థిక ఇబ్బందులు వంటివి ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు.

పాదరక్షలేసుకుని..

పాదరక్షలేసుకుని..

ఇంతకుముందు పెళ్లిళ్లను ఎక్కువగా దేవాలయాల్లో జరిపించేవారు. దీంతో అందరూ చక్కగా గుడిబయట పాదరక్షలను వదిలి వచ్చేవారు. అయితే ప్రస్తుతం చాలా మంది కళ్యాణ మంటపాల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇక్కడికి మాత్రం అందరూ పాదరక్షలు వేసుకుని వస్తున్నారు. అంతేకాదు వాటిని కాళ్లకు ఉంచుకునే వధూవరులను ఆశీర్వదించడం చేస్తున్నారు. దీని వల్ల మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సినిమా పాటలు..

సినిమా పాటలు..

పెళ్లిళ్లలో వేద మంత్రాలు అనేవి చాలా ముఖ్యమని పండితులు చెబుతున్నారు. అయితే చాలా మంది పెళ్లి సమయంలో దీనికి బదులుగా వాటి స్థానంలో సినిమా పాటలు పెట్టి వింటున్నారు. దీని వల్ల దైవ కటాక్షం దూరమవుతుందట.

అలాంటి సమయాల్లో మీకు భయమేస్తుందా? అయితే ఈ చిట్కాలు పాటించండి...!అలాంటి సమయాల్లో మీకు భయమేస్తుందా? అయితే ఈ చిట్కాలు పాటించండి...!

ఇంకా ఎన్నో పొరపాట్లు..

ఇంకా ఎన్నో పొరపాట్లు..

చాలా మంది వివాహం విషయంలో ఇవే కాకుండా ఇంకా ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు. ఇప్పటినుండైనా పైన చెప్పిన పొరపాట్లు, ఫలితాలను గ్రహించి శాస్త్రీయ విధానాన్ని అనుసరించి పెళ్లిళ్లు జరుపుకుంటే, మీకు భగవంతుని ఆశీర్వాదం, మీరు మంచి దాంపత్య జీవితం గడపడం, సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా నిలవడం వంటివి జరుగుతాయి. ఇలాంటి శాస్త్రీయ విషయాలను తెలియని వారందరికీ తెలియజేయండి. మనకు తెలిసింది ఇతరులకు చెప్పకపోతే మనదే తప్పు అవుతుంది. చెప్పినా వారు పాటించకపోతే అది వారి కర్మ.

భారతీయ హిందూ వివాహ వ్యవస్థ..

భారతీయ హిందూ వివాహ వ్యవస్థ..

వీటన్నింటినీ శాస్త్రంలో ప్రతి పనీ యొక్క నిర్దిష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు. ఇక నుండైనా భారతీయ హిందూ వివాహ వ్యవస్థ నిర్దేశించిన లక్ష్యం నెరవేరేటట్లుగా ఇతరులకు తెలియజేస్తూ, మీరు సధర్మాన్ని ఆచరింపచేస్తారని ఆశిస్తున్నాం.

English summary

Things you're doing wrong that will spoil your marriage life in Telugu

Here are these things you're doing wrong that will spoil your marriage life in telugu. Take a look
Story first published:Tuesday, September 22, 2020, 14:44 [IST]
Desktop Bottom Promotion