Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
గుడిలో బతికే ఉన్న స్వామి..మన దగ్గర్లోనే..ప్రపంచంలో దీనికి మించిన మిస్టరీ వేరే లేదు
మనదేశంలో వీధికో ఆలయం ఉంటుంది. అంటుపట్టని రహస్యాలతో నిండి ఉన్న అనేక దేవాలయాలు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. అయితే వాటిలో ప్రధానమైనది తెలంగాణలోని మల్లూరు నరసింహ స్వామి టెంపుల్. ప్రకృతి రమణీయత,ఎన్నో విశేషాలు కలిగిన మల్లూరు ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించి తరించాల్సిందే. ములుగు జిల్లాలోని మల్లూరు గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో హేమాచల నరసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి 4,000 ఏళ్ల చరిత్ర ఉంది.
ఇక్కడ నరసింహస్వామి విగ్రహం మానవ శరీరంలా మెత్తగా ఉంటుంది. అంతేకాకుండా మూలవిరాట్టుపై ఎక్కడ వేలుతో నొక్కినా సొట్ట కూడా పడి అక్కడి నుండి వేలు తీయగానే మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఇలాంటి వింతైన విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు. అంతేకాదు నరసింహ స్వామి విగ్రహానికి ఛాతి పై వెంట్రుకలు కూడా ఉంటాయి. ఉదర భాగం కూడా మానవ శరీరంలా మెత్తగా ఉండి..మనుషులకు వచ్చినట్టే చెమట కూడా వస్తుంది.

నరసింహ స్వామి బొడ్డులో నుండి ఒక ద్రవం ఎప్పుడూ స్రవిస్తూనే ఉంటుంది. స్వామి వారి విగ్రహాన్ని చూసినోళ్లు నోట మాట రాక సంభ్రమాశ్చార్యాలలో మునిగిపోతున్నారు. శాస్త్రవేత్తలు ఈ వింత ఎలా జరుగుతోందనే విషయం అంతుబట్టక తలలు పట్టుకుంటున్నారు
ఈ ప్రాంతాన్ని శాతవాహన శక ప్రభువు దీలీపకర్ణి పాలించే సమయంలో ఓ రోజు ఆయనకు కలలో నరసింహస్వామి కనబడి తాను ఓ గుహలో స్వయంభువుగా వెలసి ఉన్నానని చెప్పడంతో ఆ రాజు వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళి సైన్యంతో ఆ ప్రాంతమంతా త్రవ్విస్తుండగా అనుకోకుండా ఒక గునపం స్వామి నాభిలోకి గుచ్చుకుందట. అప్పటి నుండి ఆ గాయం నుండి ద్రవం కారుతోంది. అయితే పూజారులు ఆ ద్రవాన్ని కట్టడి చేయడానికి అక్కడ చందనం పెడతారు. ఈ చందనాన్ని ప్రతి శని, ఆది, సోమవారాలలో భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. సంతానం లేమితో బాధపడే వారికి ఈ చందనంతో సంతానం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. స్వామి వారి విగ్రహం అచ్చం మానవ శరీరంలా ఎలా ఏర్పడిందనే విషయం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.
ఇక స్వామివారి పాదాల చెంత నుండి నిత్యం ఒక జలధార ప్రవహిస్తూ ఉంటుంది. దానినే చింతామణి జలధారగా పిలుస్తారు.ఈ నీరు కొద్ది కొద్దిగా కొన్ని రోజుల పాటు త్రాగితే అన్ని రోగాలూ తగ్గిపోతాయనీ ఆ జలం సర్వ రోగ నివారిణి అనీ, భక్తులు విశ్వసిస్తారు. స్వామి పాదాల నుంచి వచ్చే ఆ నీరు చింతామణి జలపాతాన్ని సమీపించే లోపు అనేక ఔషధ విలువలు గల చెట్ల క్రింది నుండి రావడం వల్ల ఆ నీటికి అంతటి శక్తి పెంపొందిందని అంటారు.
రాణీ రుద్రమదేవి అనారోగ్యానికి గురైన సమయంలో ఈ జలపాతంలోని నీటిని తాగడంతో ఆమె అనారోగ్యం నుంచి కోలుకుందని చెబుతుంటారు.. ఆ తర్వాత అక్కడి నీటి విశిష్ఠత తెలుసుకున్న రుద్రమదేవి ఆ జలపాతానికి చింతామణి అనే పేరు పెట్టింది. చింతామణి జలధార నీటిని ఇప్పడు కూడా విదేశాలలో ఉన్న తమ వారికి కూడా పంపిస్తూ ఉంటారు.



Click it and Unblock the Notifications
