Tholi Ekadashi రేపే తొలి ఏకాదశి/ ఆషాఢ ఏకాదశి రోజున ఇలా పూజచేస్తే అఖండ రాజయోగం వరిస్తుంది..

Tholi Ekadashi / Devshayani Ekadashi and Ashadi Ekadashi సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. కానీ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి లేదా ఆషాఢ శుద్ద ఏకాదశి చాలా ప్రవిత్రమైనది. తోఈ ఏకాదశిని శయని ఏకాదశి , తొలి ఏకాదశి, పద్మ శయన ఏకాదశి అని పిలుస్తారు. తొలి ఏకాదశి రోజును శ్రీమహావిష్ణువును పూజిస్తారు. తొలి ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువు శయనిస్తాడు. తొలి ఏకాదశి పండుగను ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడేవారు చాలా వైభవంగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం ఏకాదశి రోజున, తొలి ఏకాదశిని జరుపుకుంటారు, దీనిని దేవ శయనీ ఏకాదశి, ఆషాఢ ఏకాదశి మరియు హరిశయని ఏకాదశి పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు.

ఈ ఏకాదశి తిథి నుండి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. మాసాలలో ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం మాసాలు చాలా విశేషమైనటువంటివి.తొలి ఏకాదశి రోజు నుండి చాతుర్మాసం ప్రారంభమవుతుంది . ఈ రోజు నుండి దేవతల రాత్రి ప్రారంభమవుతుంది మరియు విష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ సంవత్సరం తొలి ఏకాదశిని ఏ రోజు జరుపుకుంటారు మరియు దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం?

Tholi Ekadashi Devshayani Ekadashi

తొలి ఏకాదశి రోజు నుండి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ ఏకాదశి నుండి చతుర్మాస దీక్ష కూడా చేస్తారు. దక్షిణాయనం కూడా ప్రారంభం అవుతుంది. ఈ సమయం ప్రపంచ శాంతి కోసం పీఠాదిపతులు, మునులు, దీక్ష చేస్తారు. దీన్ని చాతుర్మాస దీక్ష అంటారు. మరియు శ్రీ హరి నిద్రించే కాలం ప్రారంభమవుతుంది, అందుకే దీనిని దేవశయని ఏకాదశి అంటారు. ఈ కాలంలో వివాహం, గృహ ప్రవేశం, ముండ వంటి శుభ, శుభ కార్యాలు నిర్వహించరు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ యాత్ర తర్వాత ఈ ఏకాదశి వస్తుంది. నాలుగు నెలల తర్వాత దేవుత్తని ఏకాదశి రోజున శ్రీ హరి నిద్ర లేవగానే మళ్లీ శుభకార్యాలు ప్రారంభమవుతాయి.

తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి ఎప్పుడు?
హిందు పంచాగం ప్రకారం ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి తిథి జూలై 16న మంగళవారం రాత్రి 8:33గంటలకు ప్రారంభమై జూలై 17వ తేదీ బుధ వారం రాత్రి 09: 02 గంటలకు ముగుస్తుంది. 2024 దేవశయని ఏకాదశి పారయణం జూలై 18, 2024న చేయబడుతుంది. 18 జూలై 05:34 AM నుండి 08:19 AM వరకు పారాయణం చేయడానికి ఉత్తమ సమయం.

Tholi Ekadashi Devshayani Ekadashi

తొలి ఏకాదశి ప్రాముఖ్యత
వ్యవసాయ సమాజానికి తొలి ఏకాదశి చాలా ముఖ్యమైనది, ఎందుకంటే వారు ఈ రోజున మొదటి వర్షం తర్వాత విత్తనాలను విత్తడం ప్రారంభిస్తారు. ఈ రోజున గొప్ప విందు ఏర్పాటు చేస్తారు. ఈ రోజు పేద ప్రజలకు మరియు పిల్లలకు ఆహారం అందించడం ద్వారా శ్రీ హరివిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. వైష్ణవ దేవాలయాలలో ఈ రోజుకి చాలా ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే ఈ రోజున శ్రీ హరికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పేదలకు మరియు అనాదలకు దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. తొలి ఏకాదశి రోజున ఉపవాసం మరియు పూజలు చేయడం వల్ల పాపాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి.

తొలి ఏకాదశి పూజా విధానం

  • తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి , ఇల్లు శుభ్రం చేయాలి. ఇంటి గుమ్మం శుభ్రం చేసి గంధం బొట్లు, ముంగిట ముగ్గు వేయాలి.
  • తర్వాత తలస్నానం చేసి, పూజగది శుభ్రం చేయాలి. పటాలకు గందం, కుంకుమబొట్లుతో అలంకరించాలి.
  • తర్వాత శ్రీ వెంకటేశ్వరస్వామివారిని , శ్రీ మహావిష్ణువును ఎర్రటి పువ్వులు సమర్పించి పూజచేయాలి. ఇలా చేస్తే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి.
  • ఈ పవిత్రమైన రోజున విష్ణువుతో పాటు లక్ష్మీ దేవిని పూజించండి.
  • తొల ఏకాదశి రోజును విష్ణువును పూజిస్తారు. ఉపవాసాలు ఉంటారు. ఈరోజు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా పవిత్రంగా ఉపవాసం ఉంటారు.
  • ఈ రోజంతా విష్ణు సహ్రసనామాలు, లేదా ఓం నమో నారాయణాయ: అని పఠిస్తూ ఉపవాసం ఉంటే చాలా మంచిది.
  • ఈ రోజున దీపారాధనకు నువ్వుల నూనె లేదా ఆవు నూనెతో దీపారాధాన చేస్తే అఖండ రాజయోగం వరిస్తుంది.
  • ఈ ఏకాదశి రోజున స్వామివారికి తప్పకుండా తులసి ఆకులను సమర్పించాలి. ఏవి ఉన్నా లేకున్నా ఒక్క తులసి ఆకు సమర్పిస్తే చాలు మీకు కష్టాలన్నీ తీరిపోతాయి.
  • అలాగే పూజలో కొబ్బరి కాయను కొడితే చాలా శుభ ప్రదం, ఆ విష్ణువు అనుగ్రహం వల్ల మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది.
  • నైవేద్యంగా పానకం లేదా పేలాల పిండిని సమర్పిస్తారు. ఇది తినడ వల్ల చలికాలంలో జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. దీన్ని బెల్లం బియ్యం పిండిని వాడటం వల్ల వ్యాధులను దూరం చేస్తాయి. ఇది విష్ణు మూర్తికి అత్యంత ఇష్టమైన ప్రసాదం. అందుకే ఏకాదనిరోజు ఈ ప్రసాదం తప్పనిసరిగా చేస్తారు. ఇలా విష్ణు పూజిస్తే ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. తిన్నా తరగనంత ఐశ్వర్యం లభిస్తుంది.
Tholi Ekadashi Devshayani Ekadashi

ఏకాదశి రోజును పఠించవల్సిన మంత్రాలు

విష్ణు సహస్రనామాన్ని ఎంతో భక్తితో, భక్తితో పఠించండి.
- "ఓం నమో భగవతే వాసుదేవాయ " అనే కృష్ణ మహా మంత్రాన్ని జపించండి.

దేవశయని ఏకాదశి మంత్రం
- "ఓం నమో భగవతే వాసుదేవాయ"
- ''అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం

రామ నారాయణం జానకీ వల్లభం.
- "రామ రామ రామేతి
రమే రమే మనోరమే

సహస్రనామ తతుల్యం రామ నామ వరాననే''
- హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే''.

విశిష్టత
మాసాలలో ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం మాసాలు చాలా విశేషమైనటువంటివి. సముద్ర సాన్నం చేయాలనుకునే వారు ఈ మాసాలలో చేస్తే చాలా విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది. ఈ మాసాలలో సముద్రాలకు చాలా శక్తి ఉంటుంది. ఆషాఢంలో సముద్ర స్నానం చేసే వారు ఈ ఏకాదశి నుండి ప్రారంభిస్తారు. 41రోజుల పాటు చేయడం చాలా శక్తివంతంగా ఉంటుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి , ధాన ధర్మాలు చేస్తే ఆ వ్యక్తి అన్ని ఆనందాలను అనుభవిస్తాడని మరియు చివరికి మోక్షాన్ని పొందుతాడని నమ్ముతారు.

Story first published: Tuesday, July 16, 2024, 16:33 [IST]
Desktop Bottom Promotion