Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
శ్రీవారి ఆలయంలో దాగివున్న ఎన్నో రహస్యాలు..! మీకు తెలుసా..?
భారత దేశంలో ఎన్నో అద్భుమైన రహస్య దేవాలయాలు వున్నాయ్. వాటిలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒకటి. తిరుమల బాలాజీ ఆలయం అత్యంత రహస్యమైన దేవాలయంగా దేశంలోనే కాదు ప్రపంచంలో గుర్తింపు పొందింది. ఈ తిరుమల ఆలయం విష్ణు మూర్తికి అంకితం చేయబడింది. తిరుపతి బాలాజీ అసలుు పూరు శ్రీ వెంకటేశ్వర స్వామి.
పురాణాల ప్రకారం తిరుమల బాలాజీ సతీదేవి పద్మావతితో తిరుమల కొండపై వెలసి వున్నాడు. వెంకటేశ్వర స్వామిని గట్టిగా ప్రార్థిస్తే చాలా భక్తుల కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ధనవంతులైన ఎందరో దేవుళ్లలో వెంకటేశ్వర స్వామి కూడా ఒకరు.
మనకు తెలియని ఎన్నో రహస్యాలు తిరుమల దేవస్థానంలో దాగి వున్నాయ్. తిరుమల దేవస్థానం గర్భగుడి లోపలికి వెళ్లి మళ్లీ బయలకు వచ్చి చూస్తే వెంకటేవ్వర స్వామి విగ్రహం కుడివైపు వున్నట్లు మనం గ్రహిస్తాము. దీని వెనక వున్న రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవ్వరమూ కనిపెట్టలేక పోయాము.

వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూస్తే కూడా రాయితే తయారు చేసినట్టుగా వుండదు, ఎవరో మనిషిని చూసినట్టుగా వుంటుంది. వెంకటేశ్వస్వామి విగ్రహానికి జుట్టూ కూడా వుంటుందని అంటున్నారు. ఆలయం కింద విరజానది ప్రవహిస్తుంది. స్వామి వారి విగ్రహం చెవి దగ్గర చెవ పెట్టి వింటే ఆ నది ప్రవహించే చప్పుడు వినబడుతుందని చెబుతున్నారు.
కలియుగంలో బాగా డబ్బున్న దేవుడిగా వెంకటేశ్వరస్వామికి పేరు వుంది. చాలా మంది భక్తులు స్వామి దగ్గరకు వెళ్లి తమ కోరికలు తీర్చమని మొరపెట్టుకుంటారు. ఆలయంలో డబ్బు లెక్కపెట్టడానికి రోజుకు 20 మంది వరకు పనిచేస్తుంటారు. ఒక్క రోజులోనే కోట్లలో దక్షిణలు వస్తుంటాయ్.
శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తడిగానే వుంటుంది. పూజారులు విగ్రహాన్ని ఎన్ని సార్లు పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం తడిగానే వుంటుందని అన్నారు. శ్రీవారి విగ్రహం రాతితో తయారు చేసినా ఎప్పుడూ 110 డిగ్రీల ఫారన్‌హీట్‌తో వేడిగా వుంటుంది.
శ్రీవారు వున్న దగ్గర ఎంత చల్లగా వున్నప్పటికీ విగ్రహం మాత్రం ఎప్పుడ చెమటలతో వుంటుందని చెబుతున్నారు. ఈ చెమటను పట్టువస్త్రాలతో అర్చకులు ఎప్పటికప్పుడు తుడుస్తూనే వుంటారు. తిరుమల ఆలయంలో రోజుకు మూడున్నర లక్షణ లడ్డూలను ఉత్పత్తి చేస్తారు.
ప్రసాద తయారీ గదుల్లో 270 మంది వంట మనుషులు వుంటారు. వీరితో పాటు 600ల మంది హెల్పర్లు కూడా పనిచేస్తూ వుంటారు. తిరుమల ఆలయంలో ఉపయోగించే పువ్వులు, వెన్న, నెయ్యి ఇతర అన్ని వంట సామాగ్రి, పూజ సామాగ్రి తిరుమల నుంచి 22 కిలోమీటర్ల దూరంలో వున్న రహస్య గ్రామం నుంచి తీసుకొని వస్తారు. ఆ గ్రామంలోని ప్రజలు చాలా నియమ నిష్టలతో వుంటారు.
గర్భగుడిలో శ్రీవారి ముందు వున్న మట్టిదీపాలు ఎప్పుడూ కొండెక్కవు. అవి ప్రతీ రోజూ ఎల్లప్పుడూ వెలుగుతూనే వుంటాయ్. ఎంత పెద్ద ఉపద్రవం వచ్చినా అవి అలాగే వెలుగుతూనే వుంటాయ్. శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చ కర్పూరం రాస్తున్నా రాయి మాత్రం అలాగే వుండడం శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరుస్తుంది.
శ్రీవారి దేవాలంలో చాలా మహిమలు వున్నాయ్. ఇన్ని మహిమలు వున్న తిరుమల దేవాలయాన్ని జీవితంలో కనీసం ఒక్కసారైనా ఖచ్ఛితంగా దర్శించుకోవాలి.



Click it and Unblock the Notifications