Latest Updates
-
జ్వరం వచ్చినప్పుడు త్వరగా కోలుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? -
వంకాయ వండటం ఓ కళ.. అయ్యంగార్ స్టైల్ లో ఇలా చేస్తే రుచికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే! -
పేరెంట్స్ రిచ్ అయితే జెన్ జెడ్ చెడుదారులు పడుతుందా.. వైరల్ పోస్ట్‌పై చర్చ.! -
కన్నయ్య కరుణ: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నుంచి ఈ రాశులకు కుబేర యోగమే! -
యమ్మీ స్పైసీతో స్ట్రీట్ ఫుడ్ స్టైల్ మసాలా నూడుల్స్.. ఈ ట్రిక్ పాటిస్తే అస్సలు విరిగిపోదు.! -
150 డిగ్రీల కోణంలో శని, బుధులు..సెప్టెంబర్ 1న షడాష్టక యోగంతో ఈ 4 రాశులకు అఖండ ఐశ్వర్యం! -
Sorakaya Payasam Recipe: పైదరాబాదీ వెడ్డింగ్ స్టైల్ సొరకాయ పాయసం..రుచిలో లేదు దీనికి సాటి.. -
పోషకాల గని.. వర్షాకాలంలో తప్పనిసరిగా తాగాల్సిన చెట్టినాడ్ ఫ్రూట్ పాయసం.! -
Chicken Benefits: చికెన్ తింటే కలిగే 5 అద్భుత ప్రయోజనాలు ఇవే! -
ప్రోటీన్స్ నిండిన రాజస్థానీ పంచరత్న దాల్..అమృతాన్ని తలపించే రుచి..ఎలా చేసుకోవాలంటే..
Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ..శ్రీవారి దర్శనానికి ఎంత టైం పడుతుందంటే..
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకి చేరుకుంటున్నారు. మహా కుంభమేళా ఎఫెక్ట్ తో కొద్దిపాటి సంఖ్యలో భక్తుల రద్దీ తగ్గినప్పటికీ మళ్లీ తిరిగి ప్రారంభమయింది. ఇవాళ మాఘపూర్ణిమ కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకున్నారు. దీంతో తిరుమల వీధులన్నీ భక్తులతో కిక్కిరిసి పోయాయి. సాయంత్రం వరకు భక్తుల రద్ధీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.
స్వామివారి దర్శనం కోసం ప్రస్తుతం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని సమాచారం. భక్తులు ఇబ్బంది పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం శ్రీవారి దర్శనానికి సమయం పడుతుంది.

మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 67,192 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 20,825 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించారు. మంగళవారం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.15 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలను టీటీడీ ప్రకటించింది. శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరపనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 17వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.



Click it and Unblock the Notifications