Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..తిరుమల వెళ్తే ఇక ఆ ఇబ్బంది ఉండదు!
తిరుపతి(Tirupati) అంటే చాలామందికి ఓ ఎమోషన్. ఏడు కొండలపై కొలువైన ఆ వేంకటేశ్వరస్వామిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని అనుకుంటారు. ఒక్క హిందూమతానికి చెందినవాళ్లే కాదు అనేక ఇతర మతాలకు చెందినవాళ్లు కూడా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తిరుమల(Tirumala) వెంకన్నను దర్శించుకుంటారు. ఏడాదిలో అన్నీ రోజులు భక్తుల రద్దీతో ఉండే టెంపులో ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది తిరుమలనే. అయితే కొన్నేళ్లుగా భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతున్నప్పటికీ తిరుమల కొండపై సౌకర్యాల విషయంలో చాలా విమర్శలే వచ్చాయి. ఇక,ఇటీవల తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం ఎంత పెద్ద రచ్చ అయిందో మనకు తెలిసిందే.
తిరుమలలో ఇప్పటివరకు జరుగుతున్న పొరపాట్లను సరిచేస్తామని ఏడుకొండల పవిత్రను కాపాడతామని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కొత్త చైర్మన్ బీఆర్ నాయుడు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు ప్రారంభించిన టీటీడీ.. గదులు దొరక్క ఇబ్బందిపడే భక్తుల కోసం నూతన లాకర్ కౌంటర్ అందుబాటులోకి తెచ్చింది. " యాత్రికుల వసతి సముదా3"లో సెంట్రల్ లాకర్ కౌంటర్ అందుబాటులోకి తెచ్చారు.

శుక్రవారం(నవంబర్ 22)టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి యాత్రికుల వసతి సముదాయం 3లో ఈ సెంట్రల్ లాకర్ ల కేటాయింపు కౌంటర్ ను ప్రారంభించారు. పీఏసీ-3లో లాకర్ ను కేటాయించడానికి మూడు కౌంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 1420 లాకర్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వసతి గదులు లభించని భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని టీటీడీ తెలిపింది.
శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు కొండపై ఉండటానికి గదులు అద్దెకు తీసుకుంటూ ఉంటారు. భక్తుల కోసం టీటీడీ వసతి గదులను కూడా అందుబాటులో ఉంచింది అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే రూమ్ లు దొరక్క చాలామంది కొండపై ఉన్న లాకర్లలో తమ సామాగ్రిని భద్రపరుచుకుంటారు. దర్శనానికి వెళ్లే ముందు లాకర్లలో తమ వస్తువులను పెట్టుకొని దర్శనం తర్వాత తిరిగి తీసుకుంటారు. అయితే తిరుమలకు భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో లాకర్ల కోసం కూడా భారీగా డిమాండ్ ఉంటోంది. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఈ తాజా నిర్ణయం తీసుకుంది.
మరోవైపు,తిరుమలలో ఉన్నది ఏడు కొండులు కాదు ఎనిమిది కొండలు అంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairman B.R. Naidu)తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఎనిమిదో కొండ చెత్త కొండ అని..గత కొన్నేళ్లుగా తిరుమలలోని వ్యర్థ్య పదార్థాలను తీసుకెళ్లి రెండు కొండల మధ్యలో డంప్ చేస్తున్నారని..దీన్ని ఏళ్ల తరబడి ఎవరూ క్లీన్ చేయించకపోవడం వల్ల ఆ చెత్త కూడా ఓ కొండలా మారిందని టీటీడీ చైర్మన్ అన్నారు. ఆ చెత్తను పూర్తిగా అక్కడ లేకుండా చేయాలని తాను ఇప్పటికే ఆదేశాలు జారీ చేశానని..తర్వలో అదంతా క్లీన్ అవుతుందని ఆయన తెలిపారు.



Click it and Unblock the Notifications