Latest Updates
-
ఇతరులు మిమ్మల్ని ఇష్టపడాలంటే.. ముందు మీ నోటి నుంచి ఈ 4 ప్రశ్నలు రాకుండా చూసుకోండి! -
ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ.. వర్షాకాలంలో దోమల నివారణకి ఆయుర్వేద చిట్కాలు.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కాజు కట్లీ.. కేవలం 2 పదార్థాలతో నోట్లో వెన్నలా కరిగిపోయేలా! -
మీకు నిజంగా బీపీ ఉందా.. ఈ చిన్న తప్పులే మందులు వాడేలా చేస్తాయని తెలుసా.? -
గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? గుండే ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత లెవల్ ఉండాలి? ఎలా పెంచుకోవాలి? -
బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌తో నో యూజ్.. రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఈ టిఫిన్స్ తప్పనిసరి.! -
బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కి దీన్ని మించింది లేదు..కొండలను పిండి చేసే శక్తి! -
ఈ భాగాల్లో తరచుగా వాపు.. అస్సలు లైట్ తీసుకోకండి.. వీటి ఆరోగ్యానికి బ్యాడ్ సిగ్నల్.! -
ఆఫీసుకైనా, స్కూల్‌కైనా హెల్తీ లంచ్ బాక్స్.. కాజు మునక్కాడ కర్రీ ఇలా చేశారంటే రుచి అదుర్స్.! -
పరగడుపునే గ్లాస్ నీళ్లతో ఒక స్పూన్ తీసుకుంటే చాలు.. మలబద్ధకం సమస్య పరార్.!
Tungabhadra Pushkaralu 2020 : కరోనా నేపథ్యంలో పుష్కరాల ముహుర్తం ఎప్పుడంటే...
తుంగభద్ర పుష్కరాలు 2020లో ఏ సమయంలో వచ్చాయి.. ఎన్ని రోజులు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో ముఖ్యమైన నదులకు పుష్కరాల సంప్రదాయం అనేది అనాదిగా వస్తున్న కాలం. ఈ పుష్కరాలు గురుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరాలనేవి వస్తుంటాయి.

అలా ఈ ఏడాది హిందూ క్యాలెండర్ ప్రకారం శార్వరి నామ సంవత్సరంలో క్రిష్ణా నదికి ఉప నది అయిన పవిత్రమైన తుంగభద్ర నదికి పుష్కరాలు వచ్చాయి. పుష్కరకాలం(పన్నెండు సంవత్సరాలు) తర్వాత వచ్చే ఈ పుష్కరాలు నవంబర్ 20వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు జరగనున్నాయి.

మన దేశంలో ప్రముఖమైన నదులలో తుంగభ్రద ఒకటి. పుష్కరాలు జరిపే నదులలో తుంగభ్రద నదికి ఎంతో విశిష్టత ఉంది. నవగ్రహాల్లో ఒకటైన గురు గ్రహం సంవత్సరానికి ఒకసారి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తుంటుంది. ఇలా ఒక్కొక్క రాశిలో గురుడు ప్రవేశించే సమయంలో ప్రతి నదికి పుష్కరాలను జరుపుతారు.

ఈ తుంగభద్ర నది పుష్కరాలు చివరిసారిగా గురుడు మకరరాశిలో ప్రవేశించే సమయంలో అంటే 2008 సంవత్సరంలో జరిగాయి. ఈ పుష్కరాలు జరిగే సమయంలో ముక్కోటి దేవతలు ఆ నదులలో కొలువై ఉంటారని చాలా మంది నమ్మకం. ఈ సమయంలో నదిలో స్నానమాచరించిన వారి సకల పాపాలు తొలగిపోయి.. పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా పుష్కరాలకు శుభముహుర్తం ఎప్పుడు.. ఏయే ప్రాంతాల్లో పుష్కరాలు జరుగుతాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కర్నాటకలో మొదలై..
ఈ తుంగభద్ర నది పశ్చిమ కనుమల నుండి మొదలై కర్నాటకలో ఎగువ భాగాన ఉన్న పశ్చిమ కనుమలలో ఉద్భవించినది. ఇది కర్నాటకలోని క్రిష్ణా పరివాహక ప్రాంతం మీదుగా ప్రవహిస్తూ.. తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవహిస్తుంది.

12 రోజుల పాటు..
ఈ తుంగభద్ర పుష్కరాలు నవంబర్ 20వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు అంటే సరిగ్గా 12 రోజుల పాటు జరగనున్నాయి. ఈ సమయంలో కర్నాటకలోని హంపి పుణ్యక్షేత్రం.. ఆంధ్రప్రదేశ్ లో మంత్రాలయం, నాగలదిన్నె, గురజాల, పుల్లికల్, రాజోలి, తెలంగాణలోని ఆలంపూర్, నాగలదిన్నెతో పాటు ఇంకా అనేక చోట్ల పుష్కరఘాట్లు ఏర్పాటు చేస్తారు.

పుష్కర ముహుర్తం..
తుంగభద్ర పుష్కరాలు 2020లో ఎప్పుడు మొదలవుతాయంటే.. హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలోని శుక్ల పక్ష శాస్తి రోజున అంటే నవంబర్ 20వ తేదీన శుక్రవారం నాడు అర్థరాత్రి 1:23 గంటల నుండి ప్రారంభమవుతాయి. ఇవి 12 రోజుల పాటు కొనసాగిన అనంతరం డిసెంబర్ 1వ తేదీన మంగళవారం నాడు ముగియనున్నాయి.

సంగమేశ్వరం వద్ద
ఈ తుంగభద్ర నదీ తీరంలో కొలువై ఉన్న దేవుళ్ల పాదాలను తాకుతూ... సంగమేశ్వరం వద్ద క్రిష్ణా నదిలో కలిసిపోతుంది. ఈ ఏడాది కర్నాటకతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురవడంతో.. నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి.

పుష్కర ఘాట్లు..
గతంలో భక్తులు స్నానం చేసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో మొత్తం 17 ఘాట్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కర్నాటకలో హంపితో పాటు పలు ప్రాంతాల్లో.. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, సంగమేశ్వరం, కౌతాళం, గురజాల, పుల్లికల్,రాజోలి, నాగలదిన్నెలలో పుష్కరఘాట్లను ఏర్పాట్లు చేయనున్నారు. తెలంగాణలోనూ ఆలంపూర్ వద్ద పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తున్నారు.

కరోనా కాలంలో..
ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గినప్పటికీ.. మళ్లీ అది పెరిగే అవకాశం ఉన్నందున చాలా మంది ఇళ్లలోనే స్నానాలు చేసి రావాలని.. నదిలో నీళ్లను నెత్తిన వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.



Click it and Unblock the Notifications