For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తుంగభద్ర పుష్కరాలు 2020 : ఈ కాలంలో నదిలో స్నానం ఎందుకు చేయాలి? అలా చేస్తే వచ్చే ఫలితాలేంటి?

పుష్కరాల సమయంలో నదిలో స్నానం చేస్తే వచ్చే ఫలితాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

|

తెలుగు రాష్ట్రాల్లో ఇంతకుముందు గోదావరి, క్రిష్ణా పుష్కరాలు ఎంత ఘనంగా జరిగాయో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి పుష్కర వేడుకలు మరోసారి కనువిందు చేయనున్నాయి.

Tungabhadra Pushkaralu significance and history in Telugu

కరోనా వంటి మహమ్మారి కాలంలో ఈ ఏడాది నవంబర్ 20వ తేదీన మధ్యాహ్నం 1.21 గంటలకు పుష్కర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలు డిసెంబర్ 1వ తేదీ వరకు అంటే మొత్తం 12 రోజుల వరకు కొనసాగనున్నాయి.

Tungabhadra Pushkaralu significance and history in Telugu

ఈ పుష్కరాల సమయంలో భక్తులందరూ తుంగభద్ర నదిలో స్నానమాచరించేందుకు ఎంతో ఉత్సాహం చూపుతారు. ఉత్తర భారతంలో గంగానదిలో స్నానం చేయడం వల్ల ఎంత పుణ్యం వస్తుందో.. దక్షిణాన తుంగభద్ర నది నీళ్లను తాగేందుకు అంతే ప్రాధాన్యత ఇస్తారు భక్తులు.

Tungabhadra Pushkaralu significance and history in Telugu

ఇంతకుముందు 2008 సంవత్సరంలో తుంగభద్ర పుష్కరాలు ఘనంగా జరిగాయి. అయితే ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే కరోనా కారణంగా అప్పటిలా అందరూ వస్తారా లేదా అనేది కొంత సందేహమే. అయితే పుష్కరాల సమయంలో చాలా మంది ఎందుకని నదిలో నీటిలో స్నానం చేయాలనుకుంటారు.. దీని వల్ల వచ్చే ఫలితాలేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Tungabhadra Pushkaralu 2020 : కరోనా నేపథ్యంలో పుష్కరాల ముహుర్తం ఎప్పుడంటే...Tungabhadra Pushkaralu 2020 : కరోనా నేపథ్యంలో పుష్కరాల ముహుర్తం ఎప్పుడంటే...

జలమే జీవనాధరం..

జలమే జీవనాధరం..

ఈ లోకంలో జలానికి ఎంతగానో ప్రాధాన్యత ఉంది. సకల జీవకోటి రాశులన్నింటికీ నీళ్లుంటేనే పండుగ.. నీళ్లతోనే పండుగ. అలాంటి జలం పుట్టిన తర్వాతే జీవకోటి విస్తరించింది. అలాగే జలాధారాల వెంటనే మన నాగరికత విస్తరించింది.

జలదేవత..

జలదేవత..

అలాంటి జలాన్ని దేవతగా భావించి ఆ తల్లిని ఆరాధించడం హిందూ సంప్రదాయంలో ఆనవాయితీగా వస్తుంది. అందుకే మన దేశంలో నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మాగస్నానాలు, మంగళస్నానాలు అని హిందూ సంప్రదాయాలతో నీటితో ముడి వేశారు.

జలంతోనే..

జలంతోనే..

భక్తుల తీర్థయాత్రలు మరియు పుణ్యక్షేత్రాల దర్శనాలు కూడా జలంతోనే ముడిపడి ఉన్నాయి. శ్రాద్ధ కర్మలు, పిండప్రదానాలు, తర్పణాలు అన్నీ నీటితో లింకున్నవే.

పుష్కరస్నానం..

పుష్కరస్నానం..

పుష్కరాల కాలంలో నదులలో పుష్కరస్నానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. తైత్తరీయ ఉపనిషత్తు బ్రహ్మ నుండి ఆకాశం.. ఆకాశం నుండి వాయువు.. వాయువు నుండి జలం.. జలం నుండి భూమి.. భూమి నుండి ఔషధాలు వాటి నుండి ఆహారం ఇతర జీవులు పుట్టాయని పురాణాలు చెబుతున్నాయి.

జీవరాశులకు ప్రధానం..

జీవరాశులకు ప్రధానం..

ఇలా జీవరాశులన్నింటికీ స్నానం అనేది ఎంతో విశిష్టత కలిగినది అని గుర్తు చేసేవే పుష్కరాలు. పుష్కరం అంటేనే 12 సంవత్సరాలు. ఇవి మన దేశంలోని 12 ముఖ్యమైన నదులన్నింటిలో వస్తాయి. పుష్కర సమయంలో ఆయా నదులలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని చాలా మంది హిందువులు నమ్ముతారు.

మకరరాశి వారు..

మకరరాశి వారు..

బృహస్పతి గ్రహం ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు పలు నదులకు పుష్కరాలు వస్తుంటాయి. ఆ గ్రహం ఆ రాశిలో ఉన్నంత కాలం ఆ నది పుష్కరంలో ఉన్నట్టే. అలాగే ఒక్కో రాశికి ఒక్కో నదితో ముడి పడి ఉంటుంది. అలా తుంగభద్ర నదికి మకరరాశికి అనుబంధం ఉంది.

పుష్కరకాలమంటే..

పుష్కరకాలమంటే..

సాధారణంగా పుష్కరకాలం అంటే ఒక సంవత్సరమంతా ఉంటుంది. అయితే, పుష్కరకాలంలోకి మొదటి 12 రోజులను పుష్కరం అని, చివరి పన్నెండు రోజులను అంత్యపుష్కరం అని పిలుస్తారు. అందుకే భారతదేశంలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నదులకు పుష్కరాల పేరుతో ఉత్సవాలు జరిపే ఆనవాయితీ ఉంది.

ఓ ద్వీపం పేరు..

ఓ ద్వీపం పేరు..

పుష్కర అనేది భూమి మీద ఉన్న సప్త ద్వీపాలలోని ఒక దానిపేరు. అయితే పుష్కరాలు అంటే నదులకు జరిగే పుష్కరోత్సవాలకే ప్రతీక.

పురాణాల ప్రకారం..

పురాణాల ప్రకారం..

వాయు పురాణాల ప్రకారం.. బ్రహ్మలోక వాసి అయిన పుష్కరుడు గురుగ్రహం ఎప్పుడైతే ఒక రాశి నుండి మరొకరాశిలోకి ప్రవేశిస్తాడో ఆ కాలాన్ని బట్టి పన్నెండు నదులను దర్శిస్తుంటాడు.

పవిత్రమైన కాలం..

పవిత్రమైన కాలం..

బ్రహ్మ స్వయంగా పంపించిన వాడు కావడం చేత పుష్కరుడు నదులకు వచ్చినప్పుడు సప్త మహారుషులు ఆయనకు ఆతిథ్య గౌరవం ఇస్తుంటారని, వారు సూక్ష్మదేహంతో నదులకు వస్తంటారు కాబట్టి, వారు వచ్చిన కాలం పవిత్రమైనదనీ చాలా మంది నమ్మకం.

All Images Credited to FB

English summary

Tungabhadra Pushkaralu 2020 Date, Significance and History in Telugu

Here we talking about tungabhadra pushkaralu signifance and history in telugu. Read on
Desktop Bottom Promotion