Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
వర్షాలు ఆలస్యం.. రోడ్డు, అగ్ని ప్రమాదాలు ఎక్కువ.. భవిష్యవాణిలో హెచ్చరించిన అమ్మవారు
ప్రతీ ఏటా తెలంగాణలో జరిగే బోనాల పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు... రాష్ట్ర వ్యప్తంగా పోతరాజుల విన్యాసాలు, శివసత్తులు పూనకాలు, ముద్దుగా ముస్తాబై బోనాలు ఎత్తుకొని ఆడ పడుచులు చేసే సందడి అంతా ఇంతా కాదు. గ్రామ దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, నల్ల పోచమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ, ముత్యాలమ్మ, బబాలమ్మ.. ఇలా అన్ని దేవతలకు బోనం సమర్పిస్తారు. ఆషాఢ మాసంలో ప్రతీ ఆదివారం ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

అయితే నిన్ననే సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మావారికి బోనాలు సమర్పించాలు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని సందడి చేశారు. అయితే ఈ బోనాల పండుగల అతిపెద్ద కార్యక్రమం రంగం. జోగిని స్వర్ణలత ప్రతి ఏటా భవిష్యవాణి వినిపిస్తుంది. అంటే రాష్ట్రం భవిష్యత్తు గురించి వివరిస్తుంది. వర్షాలు, ఏడాదంతా ఎలా ఉండబోతుందని వివరిస్తుంది. ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహించగా.. చాలా విషయాలను తెలిపింది అమ్మవారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఏడాది వర్షాలు కాస్త ఆలస్యమైనా కచ్చితంగా కురుస్తాయని స్వర్ణలత తెలిపారు. అగ్నిప్రమాదాలు కూడా జరుగుతాయని.. కానీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వివరించారు. తన వద్దకు వచ్చే ప్రజలను కాపాడే భారం తనదేనన్నారు. ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూసుకునే బాధ్యత తనేదనని భక్తులకు హామీ ఇచ్చారు. అయితే ఐదు వారాల పాటు తప్పనిసరిగా తనకు.. అంటే మహంకాళి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించాలని సూచించారు. ఏది, ఎప్పుడు బయట పెట్టాలో తనకే తెలుసంటూ వ్యాఖ్యానించారు.
ప్రజలు చేస్తున్న పూజలను, బోనాలను సంతోషంగా అందుకుంటున్నానని వెల్లడించారు. ప్రజలు భక్తితో చేసే ఏ పూజ అయినా తనకు సంతోషాన్ని ఇస్తుందని.. తన వద్దకు వచ్చి మొక్కులు చెల్లించుకునే ప్రతీ ఒక్కరికీ తన అండ ఉంటుందని అన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో వెల్లి విరిసేలా చూస్తానన్నారు. అలాగే గతేడాది తనకు ఇచ్చిన వాగ్దానం మరిచిపోయారని అన్నారు. కావాల్సిన బలాన్ని ఇచ్చానని.. భక్తుల వెంటనే ఉంటాననిఅమ్మవారు చెప్పారు.
ఇంతటితో మహంకాళి అమ్మవారి బోనాలు పూర్తి కాలేవు. భవిష్యవాణి పూర్తి అయిన వెంటనే అంబారి ఊరేగింపు వైభవంగా సాగనుంది. ఈ కార్యక్రమం తర్వాత అంటే చివరగా మహంకాళి అమ్మవారి ఫలహారం బండ్ల ఊరేగింపు ను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ రెండు అయిపోతే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర పూర్తి అయినట్లే. ఈ వేడుకలకు లక్షల్లో భక్తులు హాజరు అయ్యారు. అమ్మవారికి, బోనాలకు తెలంగాణలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రజలంతా ఆషాఢ మాసం కోసం తెగ వేచి చూస్తుంటారు.
అందులోనూ బోనాలు ఎత్తుకోవడం, అమ్మవార్లకు భక్తితో పూజలు చేయడం.. రంగం అంటే భవిష్యవాణి కార్యక్రమం వినడం మరింత ఇష్టం. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలందరికీ అందించేందుకు అన్ని న్యూస్ ఛానెళ్లు కృషి చేస్తుంటాయి. హైదరాబాద్ కు రాలేని వారంతా టీవీల్లో, ఫోన్లలో ఈ రంగం కార్యక్రమాన్ని చూస్తుంటారు.



Click it and Unblock the Notifications