Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
ప్రపంచంలోనే ఫేమస్ శ్రీకృష్ణ టెంపుల్ ఇదే..మహాభారతంతో కూడా కనెక్షన్
మనదేశంలో అనేక శ్రీ కృష్ణుడి ఆలయాలు ఉన్నాయి. కొన్ని వందల,వేల ఏళ్ల క్రితం నిర్మించిన అనేక శ్రీ కృష్ణుడి ఆలయాలు మనదేశంలో ఉన్నాయి. ఇటీవల కాలంలో విదేశాలలో ముఖ్యంగా యూరప్, ఆఫ్రికా దేశాలలో శ్రీ కృష్ణుడి భక్తులు పెరుగుతుండటంతో అక్కడ కూడా కొత్త కృష్ణ మందిరాలు ఏర్పాటవుతున్నాయి.సనాతన ధర్మంలో శ్రీ కృష్ణుడు ప్రపంచమంతటా పూజింపబడే ఒక అవతారం. శ్రీ కృష్ణుడిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో కొలుస్తుంటారు. బాల్యం నుండి మహాభారత యుద్ధంలో అర్జునుడి ద్వారా సమస్త ప్రాణకోటికి గీతా జ్ఞానాన్ని అందించడం వరకు శ్రీ కృష్ణుని ప్రతి రూపంతో భక్తులకు అనుబంధం ఉంటుంది. అయితే మనదేశంలో లక్షలాది శ్రీ కృష్ణుడి ఆలయాలు ఉన్నా..ఓ ఆలయం మాత్రం వెరీ వెరీ స్పెషల్. సాధారణంగా శ్రీ కృష్ణుడు అనగానే మొదట మన మదిలో మెదిలే రూపం..నీలం రంగులో శరీరఛాయ,చేతిలో వేణువు,తలలో నెమలి ఫించం,మీసాలు లేకుండా ఉండటం. అయితే ఓ ఆలయంలో శ్రీ కృష్ణుడు మీసంతో దర్శనమిస్తాడు. అంతేకాకుండా ఈ ఆలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మహాభారతంతో కూడా కనెక్ట్ ఉంది. అయితే ఈ స్పెషల్ శ్రీ కృష్ణుడి ఆలయం ఎక్కడ ఉంది..ఏంటీ ఆలయ ప్రత్యేకత అనేది ఇప్పుడు చూద్దాం.
తమిళనాడు రాజధాని చెన్నైలో ట్రిప్లికేన్ ఏరియాలో పార్థసారథి దేవాలయం ఉంది. ఇదే ప్రత్యేకమైన శ్రీ కృష్ణ దేవాలయం.పార్థసారథి అంటే సంస్కృతంలో అర్జునుడి రథసారథి అని అర్థం.మహాభారతంలో యుద్ధ సమయంలో అర్జునుడి రథసారథిగా కృష్ణుడు వ్యవహరించిన విషయం తెలిసిందే. జీవితంలో మనుషులు ఎదుర్కొనే కష్టాల నుంచి ఎలా బయటపడాలో అర్జునుడి ద్వారా కృష్ణ పరమాత్మ మానవాళికి తెలియజేశాడు. 8 శతాబ్దంలో పల్లవులు మొదట పార్థసారథి ఆలయాన్ని నిర్మించగా..ఆ తర్వాత కాలంలో చోళులు,విజయనగరరాజులచే ఇది పునరుద్దరించబడింది. ఈ ఆలయంలో 8వ శతాబ్దానికి చెందిన పల్లవ రాజు నందివర్మన్ గురించిన శాసనాలు కూడా ఉన్నాయి.ఈ ఆలయానికి నరసింహవర్మన్ రాజు పునాది వేశారు.
గీతా బోధకుడిగా కృష్ణ భగవానుడు పూజించబడే భారతదేశంలోని ఏకైక సాంప్రదాయ దేవాలయం ఇదే. ఈ పురాతన ఆలయంలో ప్రతిష్టించిన దేవుని విగ్రహంలో శ్రీ కృష్ణుడు "మీసాలతో"కనిపిస్తాడు. ఈ ఆలయం గోపురం,శిల్పకళకు కూడా ప్రసిద్ధి చెందింది. ఆలయం,ప్రాంతం పేరు దాని చుట్టూ ఉన్న పవిత్రమైన చెరువు నుండి ఉద్భవించింది. ఇందులో 5 పవిత్ర బావులు ఉన్నాయి..వీటిలో నీరు పవిత్రమైన గంగా నది కంటే పవిత్రంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయంలో శ్రీమహావిష్ణువుని ఇతర అవతారాల విగ్రహాలు కూడా ఉన్నాయి.

ఈ ఆలయంలో నరసింహస్వామి, గజేంద్ర వరదర్, రాముడు, రంగనాథ,శ్రీ యోగ నరసింహ, తిరుమగన్,వేదవల్లి తాయార్ విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. ఈ ఆలయానికి వెళ్లినప్పుడు పార్థస్వామి,నరసింహ స్వామి ఆలయాల తలుపులు వేర్వేరుగా ఉన్నట్లు మీరు చూడవచ్చు.
ఈ ఆలయంలో వైష్ణవ సంప్రదాయంలోని తెంకలై శాఖ సంప్రదాయాలను అనుసరించబడతాయి. ప్రతి ఏటా ఏప్రిల్-మే నెలలో పార్థసారథికి గొప్ప బ్రహ్మోత్సవాలు ఉంటాయి.అదే నెలలో ఉదయవర్ ఉత్సవం కూడా జరుపుకుంటారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక వైకుంఠ ఏకాదశి పండుగ రోజు అయితే చెన్నై మాత్రమే కాకుండా తమిళనాడులోని అలాగే భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.



Click it and Unblock the Notifications