For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రహ్మం గారి అంచనాల ప్రకారం కరోనా తర్వాత ఏం జరగనుందో తెలుసా...?

బ్రహ్మం గారి అవతారాన్ని బట్టి ఆయనను అందరూ ఆధ్యాత్మికవేత్త అనుకునేవారట. కానీ ఆయన హేతువాదిగా ఉండేవారట. అంతేకాదు సంఘసంస్కర్త అని చరిత్రకారులు చెబుతున్నారు.

|

బ్రహ్మం గారు తనకు ఉన్న అపారమైన మేధస్సును ఉపయోగించి.. మరో జ్యోతిష్య శాస్త్రం, ఖగోళ శాస్రం ఆధారంగా భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ముందే తెలియజేశాడు. అయితే అందులో కొన్ని సంఘటనలు నిజమయ్యాయి. మరికొన్ని సంఘటనలు నిజం కాలేదు.

Unknown Facts about VeeraBramhendra Swamy

బ్రహ్మం గారి అవతారాన్ని బట్టి ఆయనను అందరూ ఆధ్యాత్మికవేత్త అనుకునేవారట. కానీ ఆయన హేతువాదిగా ఉండేవారట. అంతేకాదు సంఘసంస్కర్త అని చరిత్రకారులు చెబుతున్నారు. క్రీ.శ1608 నుండి 1693 మధ్య జీవించిన ఈయన కాలజ్ణానాన్ని బోధించిన యోగిగా అప్పట్లో మంచి పేరు తెచ్చుకున్నారని చరిత్ర ద్వారా తెలుసుస్తోంది. అయితే ప్రస్తుతం బ్రహ్మంగారి ప్రస్తావన మరోసారి తెరమీదకు వచ్చి తెగ హల్ చల్ చేస్తోంది. ప్రపంచంలో ఏ వింత చోటు చేసుకున్నా.. అది బ్రహ్మంగారు ఆనాడే చెప్పారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అందులో కరోనా వైరస్ కూడా ఒక్కటి. అయితే ఇంతటితో ఈ భయంకరమైన పరిస్థితులు ఆగిపోవని బ్రహ్మంగారు చెప్పారట. కరోనా వైరస్ తర్వాత మరిన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పారట. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

గంగానది వరదలు...

గంగానది వరదలు...

బ్రహ్మంగారి కాలజ్ణానం ప్రకారం ఇప్పటివరకు జరిగిన విషయాల గురించి ఓ సారి పరిశీలిద్దాం. కాశీలోని దేవాలయం నలభై రోజులు పాడుపడుతుంది అని చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే 1910-12 మధ్యలో గంగానదికి భారీ వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీని వల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు భక్తులెవ్వరూ వెళ్లలేదు.

రాజ్యాధికారంలో మహిళ..

రాజ్యాధికారంలో మహిళ..

రాచరికాలు, రాజుల పాలన నశించిపోతాయి. మన దేశంలో రాచరిక వ్యవస్థ అనేది ఉండదు. ఒక అంబ పదారేళ్లు రాజ్యాధికారం దక్కించుకుంటుంది. ఆ విధంగానే ఇందిరాగాంధీ 16 సంవత్సరాల కాలంలో మన దేశ ప్రధానిగా పని చేశారు. అలాగే బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. ప్రస్తుతం ఉన్న బ్రహ్మాణులకు తెలియదు కానీ.. వందేళ్ల క్రితం బ్రాహ్మాణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ఇప్పుడు ఎక్కడా అగ్రహారాలు లేవు.

బ్రహ్మంగారు చెప్పినట్లే..

బ్రహ్మంగారు చెప్పినట్లే..

వ్యభిచారిణుల వల్ల చాలా మంది భయంకర రోగాలకు గురవుతారు. వావీ వరసలు లేకుండా మనుషులు పశువుల్లా ప్రవర్తిస్తారు. ఇదివరకే ప్రపంచాన్ని గడగడలాడించిన ఎయిడ్స్ వ్యాధికి మందే అనేదే దొరకలేదు. ఈ వ్యాధి వచ్చి లక్షలాది మంది చనిపోయారు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు కూడా దారి తీశాయి. తీస్తున్నాయి.

ఈశాన్య దిక్కున..

ఈశాన్య దిక్కున..

బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఓ పద్యం ఉంది.

ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను

లక్షలాది ప్రజలు సచ్చేరయ

కోరంకియను జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ

కరోనా వైరస్ ను ఉద్దేశించి.. ప్రస్తుతం ఈ పద్యం ఉన్న చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బ్రహ్మంగారు చైనాలో పుట్టే ఈ కరోనా వైరస్ భూతాన్ని ఆనాడే ఊహించి చెప్పారని చాలా మంది చెబుతున్నారు.

జల ప్రళయం..

జల ప్రళయం..

ఇదిలా ఉంటే.. రాబోయే రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మంగారు తన కాలజ్ణానంలో ఇంకా చాలా విషయాలు చెప్పారు. అందులో ముఖ్యమైనది ఏంటంటే.. మన తెలుగు రాష్ట్రాల్లోని క్రిష్ణా నది కనకదుర్గమ్మ వారి ముక్కు పడకను తాకుతుందట. ఒకవేళ జల ప్రళయం వచ్చి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే క్రిష్ణా నది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది.

కప్ప కోడై కూయటం..

కప్ప కోడై కూయటం..

క్రిష్ణా నది మధ్యలో ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కంటి చూపు పోతుందట. అలాగే పర్వతానికి ఒక మొసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి, భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు లాగా అరిచి మాయమవుతుందట. అలాగే కర్నూలు జిల్లా ఆదోని మండలంలో కప్ప కోడై కూస్తుందని చెప్పారట. అలా జరిగితే ఎన్నో వినాశనాలు జరుగుతాయట.

విగ్రహం నుండి రక్తం..

విగ్రహం నుండి రక్తం..

శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లిపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతారట. పగిలిన రాతిముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని చెప్పారు. కర్నాటకలో కామాక్షమ్మ విగ్రహం నుండి రక్తం కారుతుందట. కలియుగంలో 5 వేల సంవత్సరాలు పూర్తయ్యేసరికి కాశీలో గంగ కనబడదట.

గమనిక : పైన తెలిపిన సమాచారం ఇంటర్నెట్ లో మరియు వివిధ మాధ్యమాల ద్వారా సేకరించినది. ఈ సమచారంపై పాఠకులదే తుది నిర్ణయం. ఈ ఇన్ఫర్మేషన్ కు బోల్డ్ స్కై తెలుగు ఎలాంటి బాధ్యత వహించదని పాఠకులు గమనించగలరు.

English summary

Unknown Facts about VeeraBramhendra Swamy

Here we talking about unknown facts about veerabramhendra swamy. Read on
Story first published:Saturday, May 2, 2020, 17:33 [IST]
Desktop Bottom Promotion