హనుమంతుని గురించి చాలమందికి తెలియని కథలు

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

భారతదేశం అంటేనే పురాణాల భూమి. మరియు ఈ పురాణాలలో ప్రతి ఒక్క పాత్రకి సంబంధించి వందలాది తెలియని కథలు కూడా ఉన్నాయి. హిందూ మతం పురాణాలలో అత్యంత ప్రసిద్ధమైన పాత్రలలో హనుమంతుని పేరు ప్రముఖం. తన యొక్క భక్తిప్రపత్తులతో రాముని గుండెలలో దాచుకున్న మహానుభావుడు హనుమంతుడు. హనుమంతుడు శ్రేష్ఠమైన ధైర్యం మరియు బలాన్ని కలిగి తన భక్తులకు ఎల్లప్పుడు అండగా ఉంటాడని ఎంతో మంది విశ్వసిస్తుంటారు.

వాస్తవానికి, రాముడు లంకను గెలిచి సీతా దేవిని ఇంటికి తీసుకుని రావడానికి హనుమంతుడే ప్రధాన కారణం. తన వానర సైన్యంతో రామునికి అండగా నిలిచి యుద్దాన్ని గెలవడానికి హనుమంతుడు తన ప్రాణాలకు సైతం తెగించి పొరాడి తన భక్తిప్రపత్తులను చాటుకున్నాడు.

మనలో చాలామంది హనుమంతుని పటాన్ని ఇళ్ళలో కలిగి ఉంటారు, కానీ ఈ ఏకైక వానరదేవుని యొక్క అనేకములైన కథలు నేటి తరానికి తెలియదు. ఈ వ్యాసం అటువంటి కథల శ్రేణులను వెలుగులోకి తెస్తుంది. అందువల్ల, హనుమంతుని గురించి మీ జ్ఞానాన్ని మెరుగుపర్చడానికి దీనిని చదివి మీ తర్వాతి తరానికి వినిపించటానికి కొన్ని తక్కువగా తెలిసిన వాస్తవ కథలను తెలుసుకోండి.

హనుమంతుని విగ్రహం ఎరుపు రంగులో ఎక్కువగా కనిపించడానికి కారణం:

హనుమంతుని విగ్రహం ఎరుపు రంగులో ఎక్కువగా కనిపించడానికి కారణం:

మనమంతా హనుమంతుని సింధూర వర్ణపు విగ్రహాన్ని ఏదో ఒక సమయంలో చూసే ఉంటాము. ఎక్కువగా హనుమంతుని విగ్రహం పచ్చగా కానీ ఎరుపు రంగులో కానీ ఉంటుంది. పచ్చ రంగు అతని సహజం అయితే సింధూర వర్ణానికి మాత్రం ఒక కథ ఉంది. దీనికి ప్రధాన కారణం , హనుమంతుడు సింధూర వర్ణములో తనను తాను మార్చుకున్నాడు. దీనికి సంబంధించిన కథ ఇలా ఉంది: ఒకరోజు హనుమంతుడు, సీతా దేవి తన నుదిటిపై సింధూరం ధరించడం చూసి, ఆమెను ఎందుకు సింధూరం వినియోగించారు అని ప్రశ్నించినప్పుడు, ఆమె రాముని పై తన ప్రేమకు గౌరవ సూచకంగా రాసుకున్నట్లు వివరించింది. రాముని పై తన భక్తిని నిరూపించడానికి, హనుమంతుడు తన శరీరo మొత్తాన్ని సింధూరంతో కప్పాడు. ఇది తెలుసుకున్న తరువాత, రాముడు హనుమంతునికి ఒక వరం ఇచ్చాడు, భవిష్యత్తులో తనను ఆరాధించే వారు, వారి వ్యక్తిగత ఇబ్బందులు నెమ్మదిగా తగ్గుముఖం పట్టడాన్ని చూస్తారని.

హనుమంతునికి కూడా కుమారుడు:

హనుమంతునికి కూడా కుమారుడు:

లంకా దహనం తరువాత, హనుమంతుడు ఉద్రేకాన్ని తగ్గించుకొనుటకు మరియు తన శరీరం చల్లబరచుకోవడానికి సముద్రంలో మునిగాడు. ఆ క్షణం లో అతని చెమట చుక్క ఒక మత్స్యం సేవించడం ద్వారా, మకరద్వజుడు అనే కుమారుడు జన్మించడం జరిగినది. బ్రహ్మచారి అయినప్పటికీ, హనుమంతునికి సొంత కుమారుడు ఈ మకరద్వాజుడు.

రాముడు హనుమంతుని మరణాన్ని ఆదేశించాడు:

రాముడు హనుమంతుని మరణాన్ని ఆదేశించాడు:

నారదుడు ఒకసారి హనుమంతుని దగ్గరకు వెళ్ళి, విశ్వామిత్రుని తప్ప, అందరు ఋషులకు అభివాదాలు తెలుపమని చెప్పాడు. దీనికి కారణం విశ్వామిత్రుడు ఒకప్పుడు రాజుగా ఉన్న కారణాన ఋషులకు ఇవ్వవలసిన గౌరవం అతనికి లేదు అని నారదుని అభిప్రాయం. నారదుని ఆజ్ఞల మేరకు, హనుమంతుడు విశ్వాసంతో అతను చెప్పినట్లే చేశాడు. ఇది విశ్వామిత్రులని ప్రభావితం చేయలేదు. కానీ నారదుడు అదిపనిగా విశ్వామిత్రుని వద్దకి వెళ్ళి హనుమంతునికి వ్యతిరేకంగా ప్రేరేపించాడు . ఆగ్రహోజ్వాలలకు గురైన విశ్వామిత్రుడు చివరికి హనుమంతుని బాణాలచే మరణశిక్షను విధించమని రాముడిని ఆజ్ఞాపించాడు. రాముడు విశ్వామిత్రునికి విశ్వాసపాత్రుడైన శిష్యుడు, గురువు ఆదేశాలను నిర్లక్ష్యం చేయలేక,. హనుమంతుడికి మరణశిక్ష విధిస్తానని విశ్వామిత్రునికి చెప్పి, ఆపై మరణశిక్షను ఆదేశించారు. పరిస్థితి యొక్క ప్రభావాన్ని అర్దం చేసుకున్న నారదుడు విశ్వామిత్రుని వద్దకు వెళ్ళి తాను చేసిన చర్యలను అంగీకరించాడు. ఫలితంగా హనుమంతుడు రక్షింపబడ్డాడు.

హనుమంతుడు సీత నుండి బహుమతిని తిరస్కరించే ధైర్యం చేశాడు :

హనుమంతుడు సీత నుండి బహుమతిని తిరస్కరించే ధైర్యం చేశాడు :

ఒక రోజు, సీతా దేవి హనుమంతునికి అందమైన తెల్లటి ముత్యాల హారాన్ని బహుమతిగా ఇచ్చింది. హనుమంతుడు ఆ హారంలోని ప్రతి ముత్యాన్ని కొరికి ముక్కలు చెయ్యడం ప్రారంభించాడు. ఆగ్రహించిన సీతాదేవి కారణం అడగగా, ఆ ముత్యాలలో ఎక్కడా తనకు రాముడు కనపడలేదని బదులిచ్చాడు. దీనికి సంతోషించిన రాముడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ చిరంజీవికమ్మని దీవించారు.

హనుమంతునికి 108 పేర్లు ఉన్నాయి:

హనుమంతునికి 108 పేర్లు ఉన్నాయి:

దయచేసి తప్పుగా భావించకండి, మేము ఇక్కడ 108 వేర్వేరు భాషల గురించి మాట్లాడటం లేదు. ఒక్క సంస్కృత భాషలోనే హనుమంతునికి 108 వేర్వేరు పేర్లు ఉన్నాయి. ఇన్ని పేర్లు కలిగి ఉండడం అతను స్థానిక జానపద కథలలో అతనికి ఉన్న గొప్ప ప్రజాదరణను నిరూపిస్తుంది.

హనుమంతుడు తన స్వీయ అనుభవాలతో కూడిన రామాయణాన్ని కలిగి ఉన్నారు :

హనుమంతుడు తన స్వీయ అనుభవాలతో కూడిన రామాయణాన్ని కలిగి ఉన్నారు :

లంక తో యుద్ధం పూర్తయిన తర్వాత, హనుమంతుడు ఈ వివరాలతో కూడిన కథను రచించడానికి హిమాలయాలకు వెళ్ళాడు. అతను హిమాలయాల గోడలపై తన చేతి గోర్లతో రాముని చరిత్రను కధలుగా చెక్కాడు. అదే సమయంలో, మహర్షి వాల్మీకి రామాయణాన్ని రచించాడు. రెండు పూర్తయినతర్వాత, హనుమంతుని రామాయణం తన రామాయణం కన్నా బాగుందని మహర్షి కలత చెందాడని తెలుసుకున్న హనుమంతుడు తన చేతి రామాయణాన్ని విరమించుకున్నాడు. అంత గొప్ప వ్యక్తిత్వం హనుమంతునిది. జీవితకాలంలో చేసిన అసంఖ్యాక త్యాగాలలో ఇది కూడా ఒకటిగా నిలచి , అమరునిగా చేసింది.

English summary

Unknown stories of Lord Hanuman

Unknown stories of Lord Hanuman,There are a few stories that one might not know about Lord Hanuman. So read to know the lesser known facts about Lord Hanuman