Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
ఎక్కడా ప్రస్తావించని లక్ష్మణుడి భార్య ఊర్మిళ చేసిన గొప్ప త్యాగం.. !!
రామాయణం అంటే అందరికీ శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఇలా ప్రధాన పాత్రల గురించే ఎక్కువగా ప్రస్తావిస్తారు. విష్ణువు అవతారం శ్రీరాముడిది, లక్ష్మీదేవి అవతారం సీతగా చెప్పుకుంటాం. వీళ్లిద్దరు అనేక త్యాగాలు చేసి.. తమ రాజ్య ప్రజల సంతోషాన్ని కోరుకున్నారని రామాయణం వివరిస్తుంది.
సీతారామ లక్ష్మణులు ఎలా చనిపోయారో తెలుసా ?
కానీ మరో ఇద్దరు రామాయణంలో చేసిన త్యాగాలు, బాధల గురించి మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఏమీ ఆశించకుండా.. వాళ్లిద్దరూ తమ బాధ్యతను ఓర్పుతో నిర్వహించారు. వాళ్లే లక్ష్మణుడు, అతని భార్య ఊర్మిళ. వీళ్లిద్దరూ కూడా 14 ఏళ్లు ఎన్నో త్యాగాలు చేశారు. లక్ష్మణుడు, ఊర్మిళ త్యాగం సీతారాముల కంటే.. చాలా పెద్దదని రామాయణం వివరిస్తోంది. ఎవరికీ తెలియని లక్ష్మణుడు, ఊర్మిళాల జీవిత విశేషాలు మీకోసం..

లక్ష్మణుడి జననం
దశరథుడు, సుమిత్రా దేవికి లక్ష్మణుడు, శత్రుఘ్నడు కవలలుగా జన్మించారు. పెద్ద సోదరుడు రాముడితో లక్ష్మణుడు చాలా చనువుగా, ఇష్టంగా ఉన్నట్టు రామాయణం వివరిస్తుంది.

లక్ష్మణుడు, రాముడు
రావణుడి సంహారం కోసం.. వీళ్లిద్దరూ 14 ఏళ్ల వనవాసం వెళ్లినప్పుడు.. రాముడిగా కవచంలా ఉండేవాడు లక్ష్మణుడు.

ఊర్మిళ కథ
ఊర్మిళ గురించి ఎవరూ పెద్దగా విని ఉండరు. అయితే ఆమె గురించి, ఆమె వేదన గురించి వాల్మీకి రామాయణం వివరించింది. జనకమహారాజుకి ఊర్మిళ రెండో కుమార్తే అని అంటే.. సీతకు చెల్లిలిగా వివరిస్తోంది.

వివాహం
సీతారాముల వివాహం తర్వాత.. రాముడి సోదరుడు, సీత సోదరీల వివాహం కూడా జరిగింది. అలాగే శత్రుఘ్నుడు శ్రుత్కిర్తీని, భరతుడు మాండవిని వివాహమాడారు.

వనవాసానికి
రాముడు తాను అయోధ్యను వదిలి వనవాసానికి వెళ్తున్నట్టు చెప్పబోతున్న సమయంలో.. తనతోపాటు వస్తానని ప్రకటించాడు లక్ష్మణుడు. 14ఏళ్లపాటు రాముడి వెంటే ఉంటానని.. తన తల్లి, మహారణి కైకేయి కోరిక మేరకే.. తన వెంటనే వస్తానని వివరించాడు.

ఊర్మిళాకు వివరించడం
ఇప్పుడు లక్ష్మణుడికి పెద్ద సమస్య ఎదురైంది. రాముడితో పాటు వనవాసానికి వెళ్లడానికి నిర్ణయించుకున్నట్టు ఊర్మిళకు చెప్పడం గురించి ఆలోచించాడు. అప్పుడు ఆమె బాధ్యతను కూడా వివరించాడు. యువరాణిగా, కోడలిగా తన తల్లిదండ్రులను చూసుకోవాలని, రాజ్య ప్రజల బాధ్యత తీసుకోవాలని వివరించాడు.

వివరణ
తన తండ్రిగా భావించే రాముడు, తల్లిగా భావించే సీత వెంటే అడవుల్లో ఉంటూ.. వాళ్లతో 14 ఏళ్లు గడుపుతానని వివరించాడు. రేయింబవళ్లు వాళ్ల వెంటే ఉండాలని చెప్పాడు. తన నిర్ణయాన్ని అంగీకరించాలని, తన బాధ్యతగా తల్లిదండ్రులు, అయోధ్య ప్రజల కోసం త్యాగం చేయాలని ఊర్మిళాను కోరాడు.

ఊర్మిళ
లక్ష్మణుడు చెప్పిన దానికి ఊర్మిళ చాలా ధైర్యంగా.. సమాధానం చెప్పింది. రాముడు, సీతకు తన భర్త చేయాల్సిన సేవలను అర్థం చేసుకుని, ఈ వనవాసం గడిపే రోజుల్లో తన గురించి కనీసం ఆలోచించకూడదని లక్ష్మణుడి నుంచి ప్రామిస్ తీసుకుంది.

తల్లిదండ్రులుగా భావించాలని
రాముడు, సీతలను తల్లిదండ్రులుగా భావించి సేవలందించాలని, ఇక్కడ ఉన్న తమ గురించి ఆలోచించకని ఊర్మిళ లక్ష్మణుడికి చెప్పింది. సీతారాములకు నిజాయితీగా సేవ చేయమని కోరుతూ.. ప్రోత్సహించింది.

ఊర్మిళ త్యాగం
ఊర్మిళ లక్ష్మణుడి కుటుంబ సభ్యులందరి కోసం త్యాగం చేసింది. తన భర్త 14 ఏళ్లు ఎలాంటి ఆటంకం లేకుండా.. సీతారాములకు సేవ చేయాలని భావించిన ఊర్మిళ.. నిద్రాదేవిని తన భర్త లేకపోయినా.. డీప్ స్లీప్ కావాలని వరం కోరుకుంది.

అయోధ్యలో ఊర్మిళ
సీతారామ లక్ష్మణులు వనవాసానికి వెళ్లిన తర్వాత ఊర్మిళ అయోధ్యలో చాలా నిడారంబర జీవితం గడిపింది. హంగులు, ఆర్బాటాలు, నగలు లేకుండా.. చాలా సాధారణ జీవితం గడిపింది.

యువరాణిలా
తాను వనవాసానికి వెళ్తున్నట్టు తన నిర్ణయాన్ని లక్ష్మణుడు ఊర్మిళాకు వివరించడానికి వచ్చినప్పుడు ఆమె యువరాణిలా.. నగలు వేసుకుని కనిపించినట్టు కొన్ని కథలు చెబుతున్నాయి. ఊర్మిళాను యువరాణిలా చూసిన లక్ష్మణుడు ఆగ్రహానికి లోనై.. రాజ్యమంతా సంతాపంలో ఉంటే.. నువ్వు హంగులు, ఆర్భాలతో ఎలా కనిపిస్తున్నావని కోపానికిగురయ్యాడట. అదే సమయంలో.. తనను భార్యగా భావించలేనని చెబుతూ.. ఇప్పటికే మన సంబంధం తెగిపోయినట్టేనని వెళ్లిపోయాడట.

భర్త ఆగ్రహించేలా
రాముడు, సీతకు ప్రతి క్షణం చాలా శ్రద్ధాభక్తులతో సేవలందించాలని భావించిన ఊర్మిళ.. తాను లక్ష్మణుడికి గుర్తు రాకూడదనే ఉద్ధేశ్యంతోనే.. తనను అసహ్యించుకునేలా చేసిందట.

సన్యాసిగా
ఆమె ఈ పద్నాలుగేళ్లు.. ఆమె తన భర్త, సీత, రాముడి కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తూ.. ఆరాధనాభావంలో మునిగిపోయి.. సన్యాసిగా మారిపోయింది. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. అయోధ్య నుంచి తిరిగి వచ్చిన సీత అడగడంతో అంతా వివరించింది.

సీత
అప్పుడు సీత ఊర్మిళను ఓదారుస్తూ.. తాను తమకోసం ఎంతో త్యాగం చేసిందని.. నీ వేదన తీర్చడానికి లక్ష్మణుడితో మాట్లాడుతానని తెలిపింది. వెంటనే విషయం తెలుసుకున్న లక్ష్మణుడు తన తప్పు తెలుసుకుని.. ఊర్మిళకు క్షమాపన చెప్పాడు.

త్యాగం
ఊర్మిళ కేవలం 14 ఏళ్లు సన్యాస జీవితం గడపడమే కాదు.. రాయల్ లైఫ్ ని కూడా పక్కనపెట్టింది. భర్త నుంచి వ్యతిరేకత పొందింది. 14 ఏళ్లు నిద్రపోయింది. ఇదంతా కేవలం తన భర్త బాధ్యత నేరవేర్చడం కోసమే ఊర్మిళా త్యాగం చేసింది. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా.. ఇంతటి త్యాగం చేసింది లక్ష్మణుడి భార్య ఊర్మిళ.



Click it and Unblock the Notifications