Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
vaikunta ekadashi 2025: ఈ రోజు ఇంట్లో అవి ఉంచితే..లక్ష్మీదేవి అనుగ్రహం పొంది కోటీశ్వరులైపోతారు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇవాళ తెల్లవారుజామునుంచే దేశవ్యాప్తంగా వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీమహావిష్ణువుని ఉత్తరద్వారం గుండా ఈ రోజు దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే శ్రీహరి ఉత్తర ద్వార దర్శనం కోసం తిరుపతి సహా దేశవ్యాప్తంగా వైష్ణవాలయాలకు భక్తులు పొటెత్తారు. అదిగాక ఇవాళ శుక్రవారం.
శ్రీమహావిష్ణువు భార్య,సంపదల దేవత అయిన లక్ష్మీదేవికి శుక్రవారం రోజు అంకితం చేయబడినందున ఈ వైకుంఠ ఏకాదశి మరింత ప్రత్యేకమైనది, పవిత్రమైనది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున ఇంట్లోకి కొన్ని వస్తువులు తీసుకురావడం వల్ల అదృష్టం కలుగుతుంది. లక్ష్మీదేవి సంతోషించి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది.

ఈ రోజున ఇంటికి తీసుకురావాల్సినవి ఇవే
లక్ష్మీదేవి ఫొటో లేదా పటం
విష్ణు పురాణం ప్రకారం సముద్ర మథనం సమయంలో సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి కనిపించింది. కాబట్టి వైకుంఠ ఏకాదశి రజున అంటే ఇవాళ లక్ష్మీ దేవి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం ద్వారా మీరు లక్ష్మీ దేవి నుండి అపారమైన అనుగ్రహాన్ని పొందుతారు.
శంఖం
శాస్త్రాలలో శంఖం లక్ష్మీదేవి సోదరుడిగా వర్ణించబడింది. సముద్ర మథనం నుండి ఉద్భవించిన 14 రత్నాలలో శంఖం ఒకటి. దీన్ని ఇంట్లో ఉంచడం వల్ల డబ్బుకు లోటు ఉండదు. వైకుంఠ ఏకాదశి రోజున శంఖం మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి సంతోషించి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. దీంతో మీ జాతకం మారిపోతుంది.
పారిజాత మొక్క
సముద్ర మథనం సమయంలో వెలువడిన 14 విలువైన రత్నాలలో పారిజాత మొక్క ఒకటి. పురాణాల ప్రకారం ఈ మొక్కను స్వర్గంలో ఇంద్రుడు స్వయంగా స్థాపించాడు. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు మీ ఇంట్లో పారిజాత మొక్కను నాటవచ్చు. ఈ మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల ఆనందం, శ్రేయస్సు పెరుగుతుందని నమ్ముతారు. లక్ష్మీదేవి సంతోషించి మీకు అనుగ్రహం ఇస్తుంది.
కామధేనువు
వైకుంఠం నుండి ఉద్భవించిన కామధేను గోవును బ్రహ్మవాది మహర్షులు దత్తత తీసుకున్నారని చెబుతారు. విష్ణు పురాణం ప్రకారం కామధేను ఆవు మనస్సు స్వచ్ఛతకు చిహ్నం. కాబట్టి కామధేను గోవు విగ్రహాన్ని లేదా ఫొటోని ఇంట్లో భద్రపరిచే దగ్గర లేదా దుకాణం తలుపు దగ్గర ఉంచడం వల్ల డబ్బు ప్రవాహం పెరుగుతుంది.
ఇలా చేస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రం
వైకుంఠ ఏకాదశి రోజున పేదలకు ఆహారం,వస్త్రాలు,మీ శక్తి సామర్థ్యం మేరకు ఆర్థిక సాయం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. అంతేకాదు శ్రీహరి, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.



Click it and Unblock the Notifications