Latest Updates
-
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా..
Vaikunta Ekadashi 2020 : ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాస సమయంలో పాటించాల్సిన పద్ధతులేంటో తెలుసా...
ముక్కోటి ఏకాదశి రోజున ఎందుకని ఉపవాసం ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర మాసం శుక్ల పక్షంలో వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి లేదా స్వర్గ ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి 2020 సంవత్సరంలో డిసెంబర్ 25వ తేదీన అంటే శుక్రవారం నాడు వచ్చింది.

సూర్యుడు దక్షిణయానం నుండి ఉత్తరయాణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి ఇదేనని.. దీన్నే మోక్షద ఏకాదశి అని కూడా పండితులు చెబుతారు. ఈరోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకుంటే సమస్త కోరికలు తీరుతాయని, పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కాబట్టే దీన్ని మోక్షద ఏకాదశి అంటారు.

ఈ పర్వదినాన శ్రీమహా విష్ణువు గరుడ వాహనంపై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని, అందుకే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని పండితులు చెబుతున్నారు. ఇంతటి పవిత్రమైన ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వచ్చే ఫలితాలేంటి.. ఈరోజున విష్ణుమూర్తిని ఎందుకు ఆరాధించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

బ్రహ్మముహుర్తంలో..
వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ విధిగా బ్రహ్మ ముహుర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా శ్రీమహా విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే.. సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

విష్ణు సహస్రనామ పారాయణం..
ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగిపోవడమే కాకుండా.. ఆ దేవదేవుని అనుగ్రహం కచ్చితంగా లభిస్తుంది. ఈరోజున ఎవరైతే ఉపవాసం ఉండి మహా విష్ణుమూర్తిని ఆరాధిస్తారో.. అదే సమయంలో ఎవరు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది.

ఉపవాస పద్ధతి..
వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం అంటే.. కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటమే కాదు.. ఉప+ఆవాసం అంటే అనునిత్యం దేవుడిని స్మరించుకుంటూ భక్తి మార్గంలో ఉండటాన్నే ఉపవాసం అంటారు.

ఆహారం ఎందుకు తీసుకోకూడదంటే..
పురాణాల ప్రకారం..సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడి వరంతో అనేక శక్తులు సంపాదిస్తాడు. ఆ తర్వాత ప్రజలు, రుషులు, దేవతలను పీడించడం ప్రారంభిస్తాడు. ఈ రాక్షసుడి బాధలు తట్టుకోలేక దేవతలు, రుషులు, ప్రజలంతా కలిసి విష్ణుమూర్తిని ఆ రాక్షసుడి నుండి విముక్తి కల్పించమని కోరగా.. విష్ణువు ఆ రాక్షుడితో యుద్ధం చేస్తాడు. అయితే ఆ యుద్ధంలో విష్ణుమూర్తి అలసిపోవడం జరిగింది. అలసట తీర్చుకునేందుకు ఆ దేవుడు గుహలో విశ్రాంతి తీసుకుంటాడు. అయితే అదే అదనుగా భావించిన మురాసురుడు తనను సంహరించామని ప్రయత్నించేలోపే.. విష్ణుమూర్తి శరీరం నుండి ఒక్కసారిగా ప్రకాశవంతంగా యోగమయ అనే కన్య ఉద్భవించి.. ఆ రాక్షసుడిని సంహరిస్తుంది. అయితే ఆ కన్య 11వ రోజు ఉద్భవించడంతో తనకు ఏకాదశి అని పేరు పెట్టారు. తనకు ఇష్టమైన తిథి ఏకాదశి అని.. ఎవరైతే ఉపవాస దీక్ష చేస్తారో.. వారు సకల పాపాల నుండి విముక్తి పొందుతారని మహా విష్ణువు అభయమిచ్చెను. అలా మనుషులంతా అప్పటి నుండి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటూ పాప విముక్తులవుతున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి.



Click it and Unblock the Notifications