Latest Updates
-
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.! -
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే..
భువిలో శ్రీమహావిష్ణువు కొలువైన రోజు వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత..
హిందూమత సాంప్రదాయాలలో కొన్ని పండుగలు శైవతత్వాన్ని బోధిస్తే మరికొన్ని పండుగలు వైష్ణవ తత్వాన్ని బోధిస్తాయి. అనాదిగా ఈరెండు ఆధ్యాత్మిక తత్వాలను బోధించే ఎన్నో పండుగలు భారతీయ హిందూమత సాంప్రదాయంలో వేలాది సంవత్సరాలుగా ఇమిడిపోయాయి. విష్ణుమూర్తిని ఆరాధించే భక్తులు అతి పవిత్రంగా భక్తితో జరుపుకునే పండుగలలో ‘ముక్కోటి ఏకాదశి' కి ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ ముక్కోటి ఏకాదశినే ‘వైకుంఠ ఏకాదశి' అనే పేరుతో పిలుస్తూ ఉంటాం.
ఈరోజు శ్రీమహావిష్ణువు సర్వాలంకార భూషితుడై వైకుంఠoలో ఉత్తర ద్వారం వద్దకు శ్రీమహావిష్ణువు విచ్చేయగా అక్కడ సకల దేవతలు ఆయనను సేవించే రోజు కనుక పవిత్రమైన ఈరోజుకు ‘వైకుంఠ ఏకాదశి' అనే పేరు వచ్చింది. అందువల్ల ఈరోజు వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. ఈ ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలిగి పోతాయని మన నమ్మకం.
ఈ రోజున సూర్యోదయానికిముందే స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకోవడానికి భక్తులు ఆలయాల్లో బారులు కడుతుంటారు. ఈ నేపథ్యంలో ముక్కోటి ఏకాదశి రోజున దర్శించుకోవలసిన క్షేత్రాలలో విశిష్టమైనదిగా 'ర్యాలి' దర్శనమిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలానికి సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. పురాణపరమైన నేపథ్యాన్నీ ... చారిత్రక వైభవాన్ని కలిగివున్న ఈ క్షేత్రంలో 'శ్రీ జగన్మోహినీ కేశవస్వామి' కొలువుదీరి కనిపిస్తుంటాడు.

ఈరోజు శ్రీమహావిష్ణువుతో పాటు ముప్పైమూడు కోట్ల దేవతలు భూమికి దిగివస్తారని మన పెద్దలు చెపుతారు. ఈనాడు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములంతా ఈరోజు స్వర్గానికి చేరుకుంటారని నమ్మకం. ఇక ఈరోజు భారతదేశంలోని వైష్ణవ ఆలయాలు అన్నీ అత్యంత అద్భుతంగా అలంకరించి శ్రీమహావిష్ణువును కొలుస్తూ అనేక చోట్ల ‘వైకుంఠ ఏకాదశి' వ్రతం నిర్వహిస్తారు.
ఈరోజు ఏకాదశి వ్రతం చేసి, విష్ణువుని పూజించి, ఉపవాసం, జాగరణ పాటించడ౦ వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయి అని అంటారు. ఏకాదశి రోజున చాలామంది విష్ణు భక్తులు ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఉపవాశం ఉంటే వచ్చే మొత్తం ఫలితం కన్నా ‘ముక్కోటి ఏకాదశి' రోజున ఉపవాసం ఉంటే 24 ఏకాదశిల ఉపవాసం చేసిన ఫలితం లభిస్తుంది అని అంటారు.
శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైన తిరుప్పావై స్మరణతో ఈరోజు వైష్ణవ దేవాలయాలు మారుమ్రోగిపోతాయి. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న మనిషికి కర్తవ్య భోధన చేసే ఎన్నో అంశాలు ఈ తిరుప్పావైలో ఉండటమే కాకుండా సమాజానికి ఉపకరించే భావ సంపద ఈ తిరుప్పావైలో నిఘూడoగా దాగి ఉంటుంది. నూతన సంవత్సరంతో పాటు కలిసి వచ్చిన ‘వైకుంఠ ఏకాదశి' రోజున ఆ శ్రీమహావిష్ణువు అందరికీ శుభాశిస్సులు కలగాచేయాలని కోరుకుందాం..
వైకుంఠ ఏకాదశి రోజున సందర్శించవల్సిన క్షేత్రాలు:
ఒకే సాలగ్రామశిలకు ఒకవైపున కేశవస్వామి ... మరోవైపున జగన్మోహిని రూపం గల ఈ మూలమూర్తి స్వయంభువు అని పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి స్వయంభువు సాలగ్రామ శిల ఈ ప్రపంచంలో మరెక్కడాలేదని చెబుతారు. అసురులకు అమృతం అందకుండా చేయడం కోసం శ్రీమహావిష్ణువు జగన్మోహినీ రూపాన్ని ధరిస్తాడు. ఆ సౌందర్యానికి ఆకర్షితుడైన పరమశివుడు ఆతృతగా జగన్మోహినిని అనుసరిస్తాడు. అలా జగన్మోహిని రూపంలో వడివడిగా ఈ ప్రదేశానికి చేరుకున్న శ్రీమహావిష్ణువు నిజరూపాన్ని పొంది సదాశివుడికి తన లీలావిశేషాన్ని తెలియజేశాడని స్థలపురాణం చెబుతోంది.
శ్రీమహావిష్ణువు జగన్మోహినీ రూపంలో అసురులకు అమృతం అందకుండా చేస్తాడు. భస్మాసురుడి బారి నుంచి శివుడిని కాపాడతాడు. మోహినీ రూపంతో పరమశివుడిని ఆకర్షితుడిని చేయడం వలన, వాళ్ల తేజస్సు నుంచి 'మణికంఠుడు' జన్మిస్తాడు. అలా మణికంఠుడు జన్మించినది కూడా అసురసంహారం కోసమే. ఇలా లోకకల్యాణం కోసం శ్రీమహావిష్ణువు జగన్మోహినీ రూపాన్ని ధరించాడు. ఆ లీలావిశేషాన్ని ఆవిష్కరించే ఈ క్షేత్రాన్ని ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున దర్శించడం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది ... అనంతమైన పుణ్యఫలాలను అందిస్తుంది.



Click it and Unblock the Notifications
