Latest Updates
-
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.!
Varuthini Ekadashi 2024: మే4 ఈ రోజు వరూధిని ఏకాదశి.. ఉపవాసం ఉంటే సిరిసంపదలు..
ఈ రోజు వరూధిని ఏకాధశి. ఈ రోజు ప్రాముఖ్యతను, ఉపవాసము ఉండడం, పూజ తదితర విషయాలను తెలుసుకుందాం.
వరూధిని ఏకాదశి రోజు చేసే పూజా విధానం
ఏకాధశి రోజున మనం శ్రీమహాశిష్ణువును పూజిస్తాము. వైశాఖ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని వరూధిని ఏకాదశి అని అంటాం. ఈ పవిత్ర రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవినీ కూడా ఆరాధిస్తాము. ఈ సంవత్సరం మే 4న వరూథిని ఏకాదశిని జరుపుకుంటున్నాం. ఈ రోజు శ్రీమహావిష్ణువును పూజింజి వేడుకుంటే అనుకున్నవి జరుగుతాయని పండితులు చెబుతున్నారు.

ఈ రోజు మొత్తం విష్ణుదేవుడికి పూజించాలి. ఇంట్లో విష్ణు దేవుడి ఫోటో ఉంటే దానిని ప్రత్యేకంగా పూలు, బొట్టుతో అలంకరించి పూజచేయాలి. విష్ణువుకు తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి తులసిని ఈ రోజు చేసే పూజలో ఖచ్ఛితంగా ఉపోయోగించాలి. అయితే ఏకాదశి రోజు తులసి ఆకులను తెంపవద్దనే ఆచారం ఉంది కాబట్టి ముందు రోజు తెంపుకొని పెట్టుకోండి. ఇంటికి దగ్గరిలో శ్రీమహావిష్ణువు, వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడి ఆలయాలు ఉంటే వెళ్లి దర్శించుకోవాలి. వరూధిని ఏకాదశి రోజున ఈ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయ్.
వరూధిని ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సిరిసంపదలు
కేవలం సాత్విక భోజనాన్ని మాత్రమే వండుకోవాలి. ఏకాదశి తరువాత రోజు వచ్చేది ద్వాదశి, ఆ ద్వాదశి అయిపోక ముందే ఏకాదశి వ్రతాన్ని ముగించాలి. ఈ ఒక్క రోజు ఇంట్లో నిష్టతో ఎటువంటి మాంసాహారం వండకుండా, మద్యం సేవించకుండా, తామసిక వంటలు పనులు చేయకుండా ఉండాలి. ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఏకాదశి రోజున ఉపవారం ఉంటే జీవితంలో సంతోషం లభిస్తుందని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే అన్నట్లు పురాణాలు మనకు చెబుతున్నాయ్. వరూధిని ఏకాదశి రోజు ప్రశాంతంగా, భక్తితో ఉండి విష్ణుపూజను చేసుకోండి. విష్ణు సహస్రనామాన్ని చదవడానికి ప్రయత్నించండి లేదంటే భగవద్గీతను అయినా పఠించండి. వరూధిని ఏకాదశి రోజున దానధర్మాలు చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications
