Latest Updates
-
మీ భోజనంలో ఈ ఒక్క లోపంతో ఇన్ని సమస్యలా.. బలహీనమైన జుట్టు, గోళ్లకు ఇదే కారణం.! -
రోడ్ సైడ్ టిఫిన్ సాంబార్..ఏం రుచిరా బాబు కేక అంతే..10 నిమిషాల్లో మీ ఇంట్లో చేసుకోండిలా.. -
కన్ను అదురుతుందని ఇలా చేస్తున్నారా.. అసలు కారణం తెలిస్తే ఈ తప్పులు చేయరు.! -
డాక్టర్ సలహా..షుగర్ ఉన్నవారు తప్పకుండా తినాల్సిన 3 కూరగాయలు, 3 పండ్లు.. -
చుక్క నూనె లేకుండా రెస్టారెంట్ స్టైల్ మలాయ్ చికెన్..సాఫ్ట్ గా, జ్యూసీగా చేయండిలా -
చితి మంటల్లో కూడా కాలిపోని శరీర భాగం ఇదే..99శాతం మందికి తెలియని నిజం! -
వీకెండ్ స్పెషల్..గొంతుకు హాయినిచ్చే పెప్పర్ చికెన్ గ్రేవీ..పూరీ,చపాతీ,అన్నం దేనికైనా అదుర్స్ -
పెద్దలు కుదిర్చిన పెళ్లి: మీ కాబోయే భాగస్వామి ఒత్తిడితో పెళ్లికి ఒప్పుకున్నారా? ఇలా కనిపెట్టండి! -
విటమిన్లు, ఐరన్ పుష్కలం..చక్కెర,బెల్లం లేకుండానే సూపర్ టేస్టీ డ్రై ఫ్రూట్ రోల్ చేసుకోండిలా -
బరువు తగ్గాలా? ఈ ఆయుర్వేద చిట్కాతో కొవ్వును కొవ్వొత్తిలా కరిగించొచ్చు!
Vastu Tips For Home :ఇల్లు కట్టుకోవాలంటే.. ఈ వాస్తు చిట్కాలను తప్పనిసరిగా ఫాలో అవ్వండి...
భారతీయ వాస్తు ప్రాచీన రహస్యాలు.. ఇంటి నిర్మాణం సమయంలో పాటించాల్సిన పద్ధతులేంటో తెలుసుకోండి.
వాస్తు శాస్త్రం గురించి ఇప్పటితరం వారికి అంతగా అవగాహన లేదని చెప్పొచ్చు. మన పూర్వీకులు, పెద్దలకు మాత్రం వాస్తు శాస్త్రం గురించి సంపూర్ణ అవగాహన ఉంది.

వాస్తు చిట్కాలను అనుసరించి వారు కట్టిన కట్టడాలు వందలు, వేళ్ల సంవత్సరాలు దాటినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా బలంగా ఉన్నాయి. అలాంటి ప్రాచీనమైన అద్భుతమైన విజ్ణానాన్ని మనలో చాలా మంది మరచిపోతున్నారు.

పాశ్చాత్య కల్చర్ కు అలవాటు పడి తాత్కాలిక సంతోషాలకు.. తాత్కాలిక నిర్మాణాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణం కోసం ఎలాంటి భూమిని ఎంపిక చేసుకోవాలి.. ఏ దిక్కున ముఖ ద్వారం ఉండాలి.. ఏ దిశలో కిచెన్.. ఎక్కడ బెడ్ రూమ్, హాలు ఉండాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

భూమి ఎంపికలో..
మన శాస్త్రాల ప్రకారం, వాస్తు శాస్త్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులోని కొన్ని రహస్యాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు ఏదైనా ఇంటి నిర్మాణం చేయాల్సినప్పుడు చూడాల్సింది భూమిని. భూమిని పరీక్షించకుండా మీరు ఎంత మంచి నిర్మాణం చేసినా అది వ్యర్థమే అవుతుంది. మీరు ఇంటి నిర్మాణం చేసే చోట భూమిలో చిన్న పెంకులు ఉంటే.. అది అశుభసంకేతమని, అదే విధంగా ఎముక యొక్క బూడిద ఉంటే కూడా మీరు చాలా నష్టపోతారని.. బొగ్గులు మరియు సౌడు ఉంటే అది కూడా మీకు హానికరంగా ఉంటుందట

భూమి వాసన..
మీరు ఇంటి నిర్మాణం కోసం భూమిని ఎంపిక చేసుకునేటప్పుడు అది తెల్లని రంగులో మంచిదని.. ఎర్రని రంగులో ఉంటే మిశ్రమ ఫలితాలు వస్తాయని.. అదే పచ్చని రంగులోని భూమి అయితే అధమ పరిస్థితులొస్తాయని, నల్లని రంగు భూమిలో అయితే అసలు నిర్మాణాలే చేయకూడదట. అలాగే భూమిని తవ్వినప్పుడు తామరపద్మం వంటి వాసన వస్తే మంచిదని.. గుర్రం, ఏనుగు మదం వంటి వాసన వస్తే అందులో మధ్యమ ఫలితాలొస్తాయిన, అదే పశువులు, ధాన్యం వాసన వస్తే అది చెడు సంకేతంగా భావించాలట. ఇలాంటి వాసనలు వచ్చిన చోట నిర్మాణాలు చేయకూడదట.

నాలుగు దిక్కులు..
మీరు నిర్మాణం చేసే చోట భూమి నాలుగు దిక్కులు సమానంగా ఉండాలట. అలాగే గంధపు వర్ణం కలిగిన భూమి ఇంటి నిర్మాణానికి చాలా అనుకూలంగా ఉంటుందట. అలాగే మీరు ఏదైనా మూలలో గొయ్యి తవ్వి దానిలో రాత్రి వేళ అందులో నీరు పోయాలి. ఉదయాన్నే లేచి చూసినప్పుడు నీరు పూర్తిగా ఇంకిపోకుండా నిలిచి ఉంటే, అది శుభ సంకేతమట. ఇదే పద్ధతిని కొన్ని ప్రాచీన వాస్తు గ్రంథాలలో నీటిజాడని కనుక్కోడానికి వాడేవారట. అదే గుంటలో నీరు ఇంకి బురదగా ఉంటే.. మద్యస్తంగా నీరు పడుతుందట. నీరు పూర్తిగా ఇంకి భూమి నెర్రెలు వచ్చినట్టు ఉంటే.. అక్కడ మీరు ఎంత ప్రయత్నించినా నీరు అనేదే పడదట.

గుండ్రని ఆకారంలో..
మీరు ఇంటి నిర్మాణం చేపట్టే స్థలం గుండ్రని ఆకారంలో ఉంటే.. అందులో మీరు ఇంటిని నిర్మించి.. నివసించడం వంటివి చేస్తే దరిద్రులుగా మారిపోయే అవకాశం ఉందట. విషమ కోణంలోని స్థలంలో నివసించేవారు ఎక్కువ దుఃఖిచే పరిస్థితులొస్తాయట. ముక్కోణం గల స్థలంలో ఇల్లు కట్టి నివసించే వారికి సివిల్ కేసుల వంటి ఇబ్బందులు ఎదురవుతాయట.

ఈ దిశల్లో..
వాయువ్యం, ఆగ్రేయ దిశలో కట్టిన ఇళ్లు అగ్నికి ఆహుతి అవుతాయని భ్రుగమహార్షి చెప్పారట. ఈశాన్య, నైరుతి దశలకు ఎదురుగా ఉన్నట్టు ఇంట్లో నివాసముంటే కూడా నాశనం అవుతారట. వీరికి ఎల్లప్పుడూ గొడవలు వచ్చే అవకాశం ఉంటుందట.

ఇంట్లోకి ప్రవేశించే సమయం..
వాస్తు శాస్త్రం ప్రకారం, కొత్త ఇంట్లోకి ప్రవేశించే వారు మధ్యాహ్నంలోపే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. మధ్యాహ్నం దాటాక ఇంట్లోకి ప్రవేశిస్తే.. ఆ ఇంట్లో మరణం సంభవించొచ్చట. అలాగే సంధ్యా సమమయం, రాత్రి వేళల్లో ఐశ్వర్యం కోరుకునే వారు ఈ పనులు చేయకూడదట. రాత్రి పూట కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే లేదా శంకుస్థాపన చేసిన చెడు ఫలితాలొస్తాయట. అలాగే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కూడా కొత్త ఇంట్లోకి అడుగు పెట్టకూడదట. అలా చేస్తే గర్భహాని లేదా ఇంటికి హాని కలుగుతుందట. అలా చేయాల్సి వస్తే.. డెలివరీ అయిన 5 నెలల తర్వాత కొత్త ఇంట్లోకి ప్రవేవించాలట.

ఇవి నిషేధమట..
గర్భం ధరించి స్త్రీల భర్తలు సింధూ స్నానం చేయకూడదట. అలాగే చెట్లు నరకడం చేయకూడదు. షేవింగు చేసుకోకూడదు. ఎవరైనా చనిపోతే వారి శవాన్ని కూడా మోయకూడదు. అలాగే విదేశీ ప్రయాణాలు సైతం వాయిదా వేసుకోవాలి. విష్ణు ఆలయాల వెనుక భాగం, పరమేశ్వరుని ఎదుట, శక్తి ఆలయాలకు పక్కభాగంలో, వీధి శూలల నందు ఇళ్లను నిర్మించరాదు.

మూడు ప్రదేశాలు..
మీరు నిర్మించుకునే ఇంట్లో మూడు ద్వారాలు, మూడు మంచాలు, మూడు దీపాలు, మూడు కిటికీలు ఉంటే ఆ ఇంట్లో దుఃఖం ఏర్పడుతుందట. అలాగే ఇంట్లోని నీరు తూర్పుుదిశలో వెళ్లడం మంచిదట. ఉత్తర దిశలో వెళితే ఆర్థిక పరంగా లాభదాయకం. పడమర, దక్షిణ దిశలో నీరు పోతే.. నష్టపోవాల్సి ఉంటుదట. అదే విధంగా మీరు నిర్మాణం చేసే చోట భూమి దక్షిణ, పశ్చిమాలు ఎత్తుగా ఉంటే శుభ పరిణామమట. తూర్పు, ఉత్తర దిశలు ఎల్లప్పుడూ పల్లముగా ఉండాలట.

చెట్లు ఉండకూడదు..
మీరు ఇంటి నిర్మాణం చేసుకునే చోట పెద్ద పెద్ద చెట్లు ఉండకూడదట. అయితే తులసి చెట్టు ఉండొచ్చు. మీ ఇంటి సమీపంలో గడ్డిలో, దేవాలయంలో, పల్లపు ప్రదేశంలో, నాలుగు దార్లు కలిసేచోట, ఇంటి దూలం కింద, తన మరియు పర స్త్రీల సమీపంలో అస్సలు నిద్రించకూడదట.
మీరు ఇంటి నిర్మాణం కోసం భూమిని ఎంపిక చేసుకునేటప్పుడు అది తెల్లని రంగులో మంచిదని.. ఎర్రని రంగులో ఉంటే మిశ్రమ ఫలితాలు వస్తాయని.. అదే పచ్చని రంగులోని భూమి అయితే అధమ పరిస్థితులొస్తాయని, నల్లని రంగు భూమిలో అయితే అసలు నిర్మాణాలే చేయకూడదట. అలాగే భూమిని తవ్వినప్పుడు తామరపద్మం వంటి వాసన వస్తే మంచిదని.. గుర్రం, ఏనుగు మదం వంటి వాసన వస్తే అందులో మధ్యమ ఫలితాలొస్తాయిన, అదే పశువులు, ధాన్యం వాసన వస్తే అది చెడు సంకేతంగా భావించాలట. ఇలాంటి వాసనలు వచ్చిన చోట నిర్మాణాలు చేయకూడదట.
వాస్తు శాస్త్రం ప్రకారం, కొత్త ఇంట్లోకి ప్రవేశించే వారు మధ్యాహ్నంలోపే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. మధ్యాహ్నం దాటాక ఇంట్లోకి ప్రవేశిస్తే.. ఆ ఇంట్లో మరణం సంభవించొచ్చట. అలాగే సంధ్యా సమమయం, రాత్రి వేళల్లో ఐశ్వర్యం కోరుకునే వారు ఈ పనులు చేయకూడదట. రాత్రి పూట కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే లేదా శంకుస్థాపన చేసిన చెడు ఫలితాలొస్తాయట. అలాగే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కూడా కొత్త ఇంట్లోకి అడుగు పెట్టకూడదట. అలా చేస్తే గర్భహాని లేదా ఇంటికి హాని కలుగుతుందట. అలా చేయాల్సి వస్తే.. డెలివరీ అయిన 5 నెలల తర్వాత కొత్త ఇంట్లోకి ప్రవేవించాలట.

Click it and Unblock the Notifications