Latest Updates
-
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా
వెంకటేశ్వర స్వామి మహాత్యం..పులిహోరలో భక్తులకు దర్శనం
ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది భక్తులను కలిగిన వెంకటేశ్వరస్వామిని కలియుగ ప్రత్యక్ష దైవమని అంటారు. శ్రీమహావిష్ణువు కలియుగ అవతారమే వెంకటేశ్వరస్వామి అని చెబుతారు.వెంకట్వేశ్వరస్వామిని తమిళనాడులో బాలాజీ అని, కర్ణాటకలో తిమ్మప్ప అని ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు. మన దగ్గర కూడా శ్రీనివాసుడు, వెంకన్న, వెంకటేశ్వరుడు, వేంకటా చలపతి అని వివిధ పేర్లతో వెంకటేశ్వర స్వామిని కొలుస్తుంటారు. దేశంలోని చాలా చోట్ల ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రతి 10 మందిలో ఇద్దరి పేర్లు వెంకటేశ్వరస్వామి పేరుతోనే ఉంటాయి. శ్రీనివాస్, వెంకటేష్, వెంకటేశ్వరరావు ఇలా స్వామి పేర్లు పిల్లలకు పెడుతుంటారు మన పెద్దలు. కొన్ని వందల ఏళ్లుగా ఇలానే పేర్లు పెట్టబడుతున్నాయి.
తిరుమలలో ఏడుకొండలపై కొలువైన వెంకటేశ్వరుడిని దర్శించుకోడానికి ప్రపంచం నలుమూలల నుండి నిత్యం లక్షలాది మంది తిరుమలకు వెళ్తుంటారు. జీవితంలో ఒక్కసారి అయినా శ్రీవారి దర్శనం చేసుకుంటే చాలు జన్మ ధన్యమైపోతుందని భక్తులు పరితపిస్తారు. ఒక్క హిందువులు మాత్రమే కాదండోయ్..అనేక ఇతర మతాలకు చెందిన అనేకమంది ఇష్టదైవం కూడా వెంకటేశ్వరస్వామినే.
తాజాగా కాకినాడ జిల్లాలోని తునిమండలంలోని ఎస్ అన్నవరం గ్రామంలో 150 కేజీల పులిహారలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చారు. ధనుర్మాసం సందర్భంగా ఈ ప్రత్యేక అలంకరణ చేసినట్లు ఆలయ కమిటీ తెలిపింది. అర్చక స్వాములు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. గోవింద నామాలు జపిస్తూ భక్తులు భక్తిశ్రద్ధలతో పులిహోరలో దర్శనమిస్తున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందం చెందారు.

ధనుర్మాస ఉత్సవాలు ఎస్.అన్నవరం ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అధ్యంతం రమణీయంగా కొనసాగుతున్నాయి. ఏడాదికి ఒకసారి జరుగు ఈధనుర్మాస ఉత్సవాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న భక్తులకు శ్రీవారితో పాటు శ్రీ గోదాదేవి అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉంటాయని అర్చకులు తెలిపారు.



Click it and Unblock the Notifications