Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మీ చావు ఎప్పుడు,ఎలా వస్తుందో ముందే చెప్పే ఆలయం గురించి మీకు తెలుసా?
రేపు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం అందరికీ ఉంటుంది. చిలక జ్యోసం, నాడీ జ్యోసం, జ్యోతిష్యశాస్త్రం, ఇలాంటి అనేకమైనవి మన భవిష్యత్తుని అంచనా వేసి చెబుతుంటాయి. అయితే కొందరు కేవలం దీన్ని కేవలం మూఢనమ్మకం అని కొట్టిపారేస్తుంటారు. అయితే మరికొందరు వీటిని విశ్వసిస్తారు. మన తలరాత గురించి చెప్పే వాడి తలరాతను ఫస్ట్ చూసుకోమను, వాడి తలరత బాగుంటే మనకు తలరాతలు చెప్పే కర్మ వాడికెండుదకు పట్టిందో అంటూ కొందరు సరదాగా ఎగతాలి కూడా చేస్తుండటం మనం తరచూ గమనిస్తుంటాం. అయితే మనదేశంలోని ఓ ఆలయంలో మీ భవిష్యత్తుతో పాటు మీరు ఎప్పుడు చనిపోతారనేది కూడా ఖచ్చితంగా చెప్పేస్తారంట. ఇంతకీ ఆ గుడి ఎక్కడ ఉంది? దాని విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
తమిళనాడు రాష్ట్రంలోని శివగంగై జిల్లాలో వేతీశ్వరన్ కోయిల్ అనే ఒక గుడి ఉంది. ఈ గుడిలో శివుడిని వైద్యనాథస్వామి(వేతీశ్వరన్)గా కొలుస్తారు. అనారోగ్యాలను నయం చేసే దేవుడిగా ప్రసిద్ధి. వేతీశ్వరన్ ఆలయానికి ప్రపంచవ్యాప్త ఖ్యాతిని తెచ్చిపెట్టింది మాత్రం ఇక్కడి నాడి జ్యోతిష్యం. పురాణాల ప్రకారం..కొన్ని వేల సంవత్సరాల క్రితం అగస్త్య మహర్షి తన దివ్య దృష్టితో భూమిపై పుట్టే ప్రతి జీవి భవిష్యత్, వర్తమాన కాలాల వివరాలను తాళపత్రాలపై రాసి భద్రపరిచారట. ఈ తాళపత్ర గ్రంథాలనే నాడి గ్రంథాలు అంటారు. ఈ గ్రంథాలు సుమారు 2000 సంవత్సరాల నాటివని, అవి ఇప్పటికీ ఈ గుడిలో భద్రంగా ఉన్నాయని నమ్మకం.

వేలిముద్రతో మొదలయ్యే అన్వేషణ
నాడి జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వెళ్లిన వారిని మొదటగా వారి వేలిముద్రను అడుగుతారు. మగవాళ్లకు అయితే కుడిచేతి బొటనవేలు, మహిళలకు అయితే ఎడమచేతి బొటనవేలు ముద్రను తీసుకుంటారు. వేలిముద్రలు ప్రపంచంలో ఎవరికీ ఒకేలా ఉండవు. ఈ ప్రత్యేకత ఆధారంగానే వారి జీవితానికి సంబంధించిన తాళపత్రాన్ని వెతకడం మొదలుపెడతారు. బొటనవేలి ముద్రను బట్టి దానిని 108 రకాలుగా వర్గీకరించి, ఆ వర్గానికి చెందిన తాళపత్రాల కట్టను బయటకు తీస్తారు. ఇక్కడి నుండే అసలైన ప్రక్రియ ప్రారంభమవుతుంది. నాడి జ్యోతిష్కుడు మీ ఫింగర్ ప్రింట్ ని 108 తాళ పత్రాలతో కంపేర్ చేసి నీకు సరిపోయే తాటి పత్రం వచ్చేవరకు డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. నీ పేరు, తల్లిదండ్రుల పేర్లు, జన్మస్థలం, ఏ నక్షత్రం ఇలాంటివి అడుగుతారు. వాళ్లు అడిగినవాటన్నింటికి కరెక్ట్ సమాధానం చెప్పిన తర్వాత నాడి జ్యోతిష్కుడు మీ గతం, వర్తమానం, భవిష్యత్తుకు సంబంధించిన కీలక ఘట్టాలను చదివి వినిపిస్తాడు.
మీ పూర్వజన్మ వివరాల నుండి మొదలుకొని, ఈ జన్మలో మీ చదువు, ఉద్యోగం, వివాహం, సంతానం, ఎదుర్కోబోయే కష్టసుఖాల వరకు ప్రతి విషయాన్ని వివరిస్తారు. అన్నింటికంటే ఆశ్చర్యపరిచే, ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఆ తాళపత్రంలో మీ మరణం ఎప్పుడు, ఎలా సంభవిస్తుందో కూడా స్పష్టంగా రాసి ఉంటుందని చెబుతారు. జాతకంలో ఉన్న దోషాలను, రాబోయే గండాలను తప్పించుకోవడానికి కొన్ని పరిహారాలను, పూజలను చేయమని సూచిస్తారు.

వివాదాలు కూడా
ఈ ఆలయాన్ని సందర్శించడానికి రూ.500 నుండి రూ.30000 వరకు ఖర్చు పెట్టుకుంటారు. ఈ గుడిపై కొన్ని వివాదాలు, విమర్శలు కూడా ఉన్నాయి. ఈ టైంపుల్ మీద ఫ్రాడ్ కేసులు కూడా రిజిస్టర్ అయ్యాయి. ఈ జ్యోతిష్యం పేరుతో కొందరు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని, వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications