ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ మల్లేస్వార స్వామి వార్ల దేవస్థానం మెట్లపై రాళ్ళు పేర్చితే సొంతింటి కల నెరవుతుంది

ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ మల్లేస్వార స్వామి వార్ల దేవస్థానం మెట్లపై రాళ్ళు పేర్చితే సొంతింటి కల నెరవుతుంది

దక్షిణభారతదేశంలో ప్రసిద్ధపుణ్యక్షేత్రాలలో ఒకటిగా, అఖిలాండకోటి బ్రహ్మాండాలను కాపాడుతూ బెజవాడలోని ఇంద్రకీలాద్రి మీద కొలువై భక్తుల కోరికలు కోరిందే తడవుగా వారికోరికలను తీర్చుతున్న అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తి కనకదుర్గమ్మతల్లి. ఈ దేవాలయం విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద దేవాలయం. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది. ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

What are the importance of Sri Kanaka Durga, Malleswara Jyotirlinga temple in Vijayawada?
పేరువెనుక చరిత్ర

పేరువెనుక చరిత్ర

కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మావారుని గురించి తపస్సు చేసి, ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసురమర్ధిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనక దుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది.

క్షేత్ర పురాణం

క్షేత్ర పురాణం

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు. అంతే కాదు, ఈ దేవాలయానికి వచ్చే వారు ఆ దేవాలయ మెట్లు మీద రాళ్ళు పేర్చితే సొంతింటి కల నెరవేరుతుందనే విశ్వాసం చాలా మందిలో ఉంది.

రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు.

శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు

శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు

జ్యోతిర్లింగ రూపం దీనితో సంతుష్టుడైన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. అలా వెలసిన స్వామిని బ్రహ్మదేవుడు మల్లి,కదంబ పుష్పాలతో పూజించటం వల్ల స్వామివారికి మల్లికార్జునుడు అనే పేరొచ్చిందని గాధ. మరో గాధ ప్రకారం ద్వాపరయుగంలో అర్జునుడు పాసుపతాస్త్రం కోసం ఇంద్రకీలాద్రి పై వుగ్ర తపస్సు చేయగా తనని పరీక్షించటానికి శివుడు కిరాకుడుగా వచ్చి అర్జునునితో మల్లయుద్ధం చేసి అర్జునుని భక్తికి మెచ్చి పాసుపతాశ్త్రాన్ని అనుగ్రహించాడు.

జగద్గురు ఆదిశంకరాచార్యులు

జగద్గురు ఆదిశంకరాచార్యులు

జగద్గురు ఆదిశంకరాచార్యులు స్వామి ఇక్కడ మల్లయుద్ధం చేసాడు కాబట్టి మల్లికార్జునుడిగా పిలవబడుతున్నాడు. ఈ క్షేత్రాన్ని దర్శించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు జ్యోతిర్లింగం అదృశ్యంగా వుండటం గమనించి అమ్మ ఆలయ ఉత్తరభాగాన మల్లికార్జునిని పునఃప్రతిష్టించారు.

 శ్రీచక్ర యంత్ర ప్రతిష్ట

శ్రీచక్ర యంత్ర ప్రతిష్ట

శ్రీచక్ర యంత్ర ప్రతిష్ట మహారౌద్రంగా వున్న అమ్మవారిని ఆలయంలో శ్రీచక్ర యంత్ర ప్రతిష్ట చేసి శాంతింపజేసారు. అప్పట్నుంచీ అమ్మ పరమశాంతస్వరూపిణిగా భక్తులను కనువిందు చేస్తోంది. ఈ దేవాలయంలో వినాయక స్వామి, ఈశ్వరుడు, శ్రీ రాము ల వారు కొలువుతీరి ఉన్నారు. ఈ దేవాలయాన్ని దర్సించుటకు అనేక మంది భక్తులు అనేక ప్రదేశాల నుండి వస్తారు.

Desktop Bottom Promotion