Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
గరుడ పురాణంలో.. మరణించిన పాపులకు ఎలాంటి శిక్షలు వుంటాయో తెలుసా..?
గరుడ పురాణం గురించి మనకు మొత్తం తెలియకపోయినా గరుడ పురాణంలో శిక్షలు భయంకరంగా వుంటాయన్న విషయం మనకు తెలిసిందే. మనిషి చనిపోయిన తరువాత చేసిన పాపాలకు ఎలాంటి శిక్షలు వేస్తారో ఈ గురుడ పురాణంలో వుంటుంది. ఈ విషయం అపరిచితుడు సినిమాలో విక్రం చెప్పడం దీని గురించి మరింత మందికి తెలిసేలా చేసింది. అసలు గురుడ పురాణం ఏంటి, అందులో ఎలాంటి శిక్షలు వేస్తారు. లాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం.
భరతదేశంలో మహారుషులు మనకు పురాణాలు అందించారు. అవి మొత్తం అష్టాదశ పురాణాలు. వాటిలో గరుడ పురాణం ఒకటి. ఈ గరుడ పురాణాన్ని వ్యాస మహర్షి రచించాడు. గరుడ పురాణం అని అనగానే చాలా మంది భయపడతారు. ఇందులో యమధర్మరాజు పాపులకు వేసే శిక్షల గురించి వుంటుంది కాబట్టి ఈ పుస్తకాన్ని ఇంట్లో వుంచుకోవడానికి కూడా చాలా మంది భయపడిపోతుంటారు.
ధర్మ, అధర్మాలకు సంబంధించిన పరిఘ్నానానికి సంబంధించి శ్రీ మహావిష్ణువు గురుత్మంతుడికి బోధించాడు. గరుడపురాణంలో మొత్తం 18వేల స్లోకాలు వున్నాయ్. వీటని మూడు రకాలుగా విభజించారు. అవి సాత్విక, రాజసిక, తామసికగా విభజించారు. గరుడ పురాణంలో పూర్వ ఖండం, ఉత్తర ఖండం అని రెండున్నాయ్. పుర్వ ఖండంలో విష్ణువును ఎలా ఆరాధించాలనే విషయాలు వున్నాయ్. తరువాత ఉత్తర ఖండం వుంటుంది. ఈ ఖండంలో మనిషి మరణించిన తరువాత వేసే శిక్షల గురించి వుంటుంది.

ఈ ఉత్తర ఖండంలో మనిషి చేసిన పాపాలు, వాటికి శిక్షలు, పాపాలను ఎలా కడిగేసుకోవచ్చు, పాప పరిష్కార మార్గాలు, లాంటి అంశాలు వున్నాయ్. నరకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలు అనుభవించాల్సి వుంటుందని గరుడ పురాణంలో వుంటుంది. గురుడ పురాణంలో శిక్షలు భయంకరంగా వున్నా అవి మనకు క్రమశిక్షణను బోధిస్తాయ్.
అవీచి
తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు మాటలు, అబద్ధాలు, వ్యాపారాల్లో మొసం చేసే వారికి ఈ శిక్ష విధిస్తారు. ఈ అవీచి శిక్ష చాలా కఠినంగా వుంటుంది. నీటి బొట్టు కూడా లేని ప్రాంతంలో వీరిని పడేస్తారు.
అయోపానం
మద్యం ఎక్కువగా తాగేవారికి ఈ శిక్ష విధిస్తారు. ఆడా మగా ఇద్దరికీ వేరువేరుగా శిక్ష విధిస్తారు. ఆడవాళ్లకు ఇనుప ద్రవాన్ని తాగిస్తారు, మగవారికి మరిగే లావాను తాగిస్తారు.
అవీచి మీంత
అబద్దపు సాక్ష్యాలు చెప్పే వారికి ఈ శిక్షను విధిస్తారు. ఈ శిక్షలో ఎత్తైన పర్వతం నుంచి కిందకు పడేస్తారు.
అవధ నిరోధకం
మానసికంగా హింసించే వారికి, కిడ్నాప్ చేసే వారికి ఈ శిక్షలను విధిస్తారు. ఈ శిక్షలో పాపులను గదిలో విషప పొగల మధ్య పెట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తారు.
మహాజ్వాల
ధర్మాలను ధ్వంసం చేసే వారికి ఈ శిక్షను విధిస్తారు. ఈ శిక్షలో మండుతున్న అగ్ని జ్వాలలో పాపులను పడేస్తారు.
దండసూకర
హత్యలు చేసేవారిని, మనుషులను హింసించే వారికి ఈ దండసూకర శిక్షను అమలు చేస్తారు. ఈ శిక్షలో పాపులను పాములతో కరిపిస్తారు, ఎలుకలతో కొరికిస్తారు.
కుంభీపాకం
వేటతో సాధు జంతువులను హతమార్చే వారికి ఈ శిక్షను వేస్తారు.ఇతరులను హింసించి రాక్షసానందం పొందేవారికి ఈ శిక్షను విధిస్తారు. రాగి పాత్రలో వాళ్లని పడవేసి రాగిపాత్ర కింద మంటపెట్టి వారికి ఈ శిక్ష వేస్తారు.
కాలసూత్ర
వేదాలను ధిక్కరించిన వారికి ఈ కాలసూత్ర శిక్ష వుంటుంది. ఈ శిక్షలో పాపులను కత్తులతో కోయడం, కొరడాతో కొట్టం చేస్తారు.



Click it and Unblock the Notifications