Latest Updates
-
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా?
బ్రహ్మంగారు చెప్పినవన్నీ జరుగుతున్నాయ్.. 2041లో 7 కోట్ల మంది దుర్మరణం..!
బ్రహ్మంగారి కాలఘ్నానం గురించి మనకందరికీ తెలిసిందే. కొంతమంది బ్రహ్మంగారి కాలఘ్నానాని తేలికగా తీసి పారేస్తుంటారు. అలాంటి వారికి కాలఘ్నానంపై ఎటువంటి అవగాహన లేదు. బ్రహ్మంగారు చెప్పినవన్నీ కూడా జరుగుతూనే వున్నాయ్. గత సంవత్సరంలో జరిగిన వింత విషయాలు కాలఘ్నానంలో వున్నాయ్, ఈ సంవత్సరంలో జరుగుతున్న జరబోతున్న విషయాలను బ్రహ్మంగారు ముందుగానే చెప్పారు. ఆ మహర్శి చెప్పిన విషయాలను మళ్లీ ఒకసారి స్మరించుకుందాం.

బ్రహ్మంగారు ముందే చెప్పిన విషయాలు
1. బ్రహ్మంగారు కాలఘ్నానాన్ని ఒకేసారి చెప్పలేదు. వేరు వేరు సందర్భంలో వేరు వేరు మనుషులకు చెప్పారు. కాలఘ్నానాన్ని ఒక తాలపత్రంలో రాసి దాన్ని ఒక దగ్గర పాతి పెట్టారు. పాతి పెట్టిన ఆ ప్రదేశంపై చింత చెట్టు కూడా పెరిగింది.
2. ఒక అమ్మ 16 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తుందని 500 ఏళ్ల క్రితమే చెప్పారు. తరువాత ఇందిరా గాంధీ భారతదేశానికి 16 సంవత్సరాలు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
3. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతయని కూడా ఆయన చెప్పారు. ప్రస్తుతం బ్రాహ్మణులెవ్వరికీ అగ్రహారాలు ఇవ్వడం లేదు. అలాగే జనాభా కూడా విపరీతంగా పెరిగిపోతుందని ముందే చెప్పారు.
4. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. కానీ చనిపోయిన మనిషిని బ్రతికించే యంత్రాన్ని, మనిషికి జన్మనిచ్చే యంత్రాన్ని కనుగ్గొనలేదని చెప్పారు. ప్రకృతిని మార్చే ప్రయత్నం కూడా చేస్తారని ముందుగానే చెప్పారు.
5. వావివరసలు లేకుండా మృగాళ్లా ప్రవర్తిస్తారని బ్రహ్మంగారు ముందుగానే చెప్పారు. ప్రస్తుతం అదే జరుగుతోంది. రోజూ వార్తాపత్రికల్లో ఎలా వావివరసలు మరిచిపోయి వ్యవహరిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు.

6. విదేశీయులు భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన అన్నట్టుగానే బ్రిటీష్ వారు భారతదేశాన్ని పరిపాలించారు.
7. ఇరు ప్రాంతాల మధ్య యుధ్దం దేశాల మధ్య యుద్ధానికి దారి తీస్తుందని అన్నాడు. 2023లో ఉక్రెయిన్, రష్యా మధ్య జరిగిన యుద్ధం తరువాత ఏడు దేశాలు ఈ యుద్ధంలో పాల్గొన్నాయ్. చాలా దేశాలపై ఈ ప్రభావం పడింది.
8. రెండు ప్రయాణ చక్రాలు ఢీకొని పెను ప్రమాదాన్ని సృష్టిస్తుందని ముందే చెప్పారు. 2023లో ఒడిస్సా బాలాసోర్ ట్రైన్ ప్రమాదం జరిగిన విషయం మనకు తెలిసిందే. దీన్ని కూడా ఆయన ముందుగానే అంచనా వేశారు.
9. భారీ వర్షాల వల్ల ప్రకృతి వైపరీత్యం చోటుచేసుకుంటుందని చెప్పారు. 2023 ప్రారంభంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు తుఫాను కారణంగా భారీగా దెబ్బతిన్నాయ్.
10. రావణ కాష్టాల కల్లోలం రేగి ఆ రాజ్యం కుప్పకూలెను అని బ్రహ్మం గారి కాలఘ్నానంలో వుంది. శ్రీలంకలో మౌలిక సదుపాయాలు కరువై సివిల్ వార్ వచ్చిన విషయం మనకు తెలిసిందే.
11. అడవిమృగాలు దేవాలయ ప్రాంగణంలో ప్రవేశించి మనుషులను చంపుతాయని చెప్పాడు. ఇలాంటి సంఘటనా చాలా సార్లు జరిగిన విషయం తెలిసిందే.
12. మద్య తూర్పులో యుద్ధాలు చేసి పసిపిల్లల ప్రాణాలను బలిగొంటారని చెప్పారు. పాలస్తీనా, ఇజ్రాయిల్ యుద్ధంలో లక్షల మంచి చిన్నారులు ప్రాణాలు విడిచిన విషయాన్ని మరవవద్దు.
13. 5వేల యేళ్ల తరువాత కాశీలో వున్న గంగ మాయమైపోతుందని అన్నాడు. ప్రస్తుతం గంగ పరిస్థితి దారుణంగా వుంది. వ్యర్థాలు ఎక్కువగా పేరుకొని పోతున్నాయ్. పాపులు పెరిగి, పుణ్యాత్ములు తగ్గుతారని ముందే చెప్పాడు.
14. ఉత్తరదేశంలో ఓ కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటి గాంధీ అన్న విషయం మనకు తెలిసిందే.
15. భవిష్యత్తులో జరగబోయే విషయాలను బ్రహ్మంగారు ముందుగానే చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా రెండు మతాల మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుందని చెప్పారు. 2037 నుంచి 20238, 2038 నంచి 2039 ఇంకా 2040 నుంచి 2041 వరకు ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు జరిగి కోట్ల మంది మరణిస్తారని చెప్పారు.
16. 2040లో కాశీలోని గంగలో నీళ్లు వుండదని చెప్పారు. 2041 ఫిబ్రవరి 16న ఒకేసారి 7 కోట్లమంది చనిపోతారని చెెప్పారు.



Click it and Unblock the Notifications