Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
మరణించిన తరువాత ఆత్మ ప్రయాణం ఎలా వుంటుందో తెలుసా..? వేరే శరీరంలో ఎప్పుడు ప్రవేశిస్తుందంటే..?
పునర్జన్మ నిజంగా వున్నదా అనే దానిపై ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మేధావులు పరిశోధనలు చేశారు. మన దేశంలో ఈ పునర్జన్మలు, ఆత్మల గురించి పురాణాల్లో స్పష్టంగా చెప్పబడి వుంది. మరణించిన తరువాత మనిషి ఆత్మ ఎన్ని రోజులు ప్రయాణిస్తుంది, తరువాత ఎన్ని రోజులకు వేరే శరీరంలో ప్రయాణిస్తుంది. ఆత్మహత్య చేసుకున్న ఆత్మలు త్వరగా మోక్షం పొందక అక్కడే కొట్టుమిట్టాడుతూ వుంటాయంటారు. నిజంగా ఇవి ఎలా జరుగుతాయ్, ఎంత సమయం పడుతుంది లాంటి ప్రశ్నలకు సమాధానలను ఇస్తున్నాము.
మరణించిన తరువాత ఆత్మ సూక్ష రూపంలో మూలాధార చక్రం ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చే సమయంలో శరీరం చుట్టూ కాంతి వలయం ఏర్పడుతుంది. అప్పుడు యమ భటులు వచ్చి ఆత్మను వేరు చేస్తారు. ఆ సమయంలో శరీరంలో జరుగుతున్న విషయాలను మనము గమనించవచ్చు. శరీరంలోకి మళ్లీ ఆత్మ వెళ్లలేక బంధువులను స్నేహితులను కొన్ని నిమిశాలపాటు అలాగే చూస్తూ వుంటుంది.

మరణించిన తరువాత 7 రోజుల పాటు సూక్ష్మ శరీరంలో బంధువులను, కుటుంబ సభ్యులను చుట్టుముట్టి వస్తుంది. ఆ తరువాత యమభటులతో కలిసి ప్రయాణిస్తుంది. 13 రోజుల పాటు శ్రాద్ధ కర్మలు జరిగింతవరకు ఆత్మలు వేరేలోకానికి వెళ్లకుండా అలాగే వుంటాయ్. శ్రాధ్ద కర్మలు పూర్తయిన తరువాత అప్పుడు వేరే లోకానికి వెళ్తాయ్.
అకాల మరణం పొందిన ఆత్మలు ఆయుష్సు తీరేవరకు మన చుట్టూ తిరుగుతాయ్. ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మలు మొత్తం ఆయుష్షు తీరేంత వరకు ఈ భౌతిక ప్రపంచంలోనే వుంటాయ్. బలహీన శరీరాలను చూసుకొని వారిలో ప్రవేశించి తాము అనుకున్నవి చేయడానికి సిద్ధపడతాయ్. అకాల మరణం పొందిన ఆత్మలు ఆ తరువాత యమలోకానికి బయలుదేరుతాయ్. 16 నగరాలను దాటి, 171వ రోజుకు యముడి సోదరుడి విచిత్ర నగారానికి చేరుకుంటుంది.

ఈ నగరానికి ఆనుకొని వైతరినీ నది వుంటుంది. నరకంలోకి ప్రవేశించాలంటే ముందుగా ఈ వైతరినీ నదిలోకి ప్రవేశించాలి. ఈ నదిలో నీటికి బదులుగా చీమూ నెత్తురూ సలసలా మరుగుతూ వుంటుంది. ఇక్కడ పాపాలకు శిక్షణు అనుభవించడానికి వీలుగా ఒక యాతనా శరీరాన్ని ఇస్తారు. దీనికి స్పర్ష, వాసన వుంటాయ్. అప్పుడు వీరిని యమపురిలోకి తీసుకెళ్తారు. మరణించిన తరువాత ఇక్కడికి చేరడానికి సుమారు 365 రోజులు పడుతుంది.
వారికి సంవత్సరికాన్ని భూమిపై పూర్తిచేసిన తరువాత వారికి భూమికీ బంధం తెగిపోతుంది. యమపురిలో చేసిన పాపాలకు శిక్షలు వేస్తారు. ఈ శిక్షలు 5 నుంచి 6 సంవత్సరాల వరకూ వుంటుందని చెబుతున్నారు. ఆత్మ యాతనా శరీరంలోచి బయటకు వచ్చిన తరువాత మళ్లీ కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది. పురుషుడి ద్వారా స్త్రీ శరీరంలోకి ప్రవేశించి 9 నెలల తరువాత భూమిపై అడుగుపెడుతుంది. పుట్టిన ఆ పిల్లల్లో గత జన్మ ఘ్నాపకాలు 40 నుంచి 4 సంవత్సరాల వరకు వుంటాయ్. అందుకే కొందరు పిల్లల ప్రవర్తన భిన్నంగా వుండడం మనం చూస్తుంటాం. భగవద్గీతలో అన్నట్టు.. పుట్టిన వారు మరణించక తప్పదు, మరణించిన వారు మళ్లీ పుట్టక తప్పదు. అనివార్యమగు ఈ విషయము గూర్చి శోకింపతగదు అని శ్రీకృష్ణుడు అంటాడు.



Click it and Unblock the Notifications