Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
మౌన వ్రతం అంటే ఏమి? మనౌవ్రతం ఎందుకు చేస్తారు? దీనివల్ల పొందే లాభాలేంటి..?
పూర్వం మునులు, యోగులు, మహర్షులు మౌనవ్రతాన్ని పాటించేవారు. కానీ ఈ రోజుల్లో కూడా కొంత మంది తాచార్యులు చాతుర్మాస దీక్షలో మౌన వ్రతాన్ని పాటిస్తున్నారు. ఇంకా కొంతమంది నెలలో కొన్ని రోజులు లేక వారానికి ఒక రోజున మౌనవ్రతాన్ని పాటిస్తున్నారు.
మౌనం అంటే, ముని వ్రుత్తి..మునులు ఆచరించే విధానం అని అర్ధం. మునీశ్వరులు ఎక్కువగా మౌన వ్రతం పాటిస్తారు. మౌన వ్రతం పాటించేవారు కనుకే వారికి ముని అనే పేరు వచ్చిది. మనకు పంచ జ్జానేద్రియాలు ఉన్నాయి. శరీరం కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, వీటన్నింటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రతాన్ని ఆచరించడం శరీరాన్ని ఎవ్వరూ తాకకుండా, కళ్లతో ఏదీ చూడకుండా, చెవులు వేటినీ వినకుండా, నాలుక ఏమీ మాట్లాడకుండా, లేక ఘన ఆహారం ఏమీ తినకుండా , ముక్కతో ఉశ్చ్వాస..నిశ్చ్వాస క్రమాలు, క్రమబద్దీరకంగా ఉండగలిగిండాలి. ఇవేకాక, శరీరంలోని మిగితా ఇంద్రియాలన్నే కలిపి దశ ఇంద్రియాలు కూడా పూర్తిగా మౌనం పాటించడం, నిజమైన మౌన వ్రతం పాటించడం.
అందుకే మౌన వ్రతం చేయునప్పుడు, ద్రవ ఆహారం తీసుకోవాలి అంటారు. కానీ ఘన ఆహారం కాదు. కడుపు నిండితే నిద్రపోతాయే తప్ప, ఇంక దైవ ధ్యానంపై ఆసక్తి ఎక్కడ ఉంటుంది? ఇంత నిష్టగా చేసే మౌన వ్రతం, ఒక్క క్షణం చేసినా చాలు. మనం పుట్టిన నాటి నుండి, జీవించి ఉన్నంత కాలం, నిరంతరం ఆగకుండా పనిచేసే ఏకైక యంత్రం, మనవ శరీరం. మరి ఈ శరీరాన్ని మౌన వ్రతం వల్ల అయినా, కానీసం కాసేపైనా సరే విశ్రాంతి తీసుకునేలా చేసుకోగలిగితే, 'దేహమే దేవాలయం' అన్న వాఖ్యానికి నిర్వచనం ఇచ్చినట్లుగా ఉంటుంది.
ఇప్పటికీ చాలామంది చాతుర్మాస దీక్షలోనో లేక వేరో ఏదో కొన్నిరోజులో లేకపోతే ఫలానా వారమనో మౌన వ్రతాన్ని పాటిస్తున్నారు. ఇది ఎందుకు చెయ్యాలి? దీని వల్ల ఉపయోగం ఏమైనా వుంటుందా?
తప్పకుండా వుంటుంది. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా మౌనవ్రతం మనిషికి ఎంతో మేలు చేస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే మౌనవ్రతం వల్ల వాక్శుధ్ది, వాక్ శక్తి పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే మనని మనం ప్రశాంతంగా వుంచుకోవటానికీ, కోపాన్ని అదుపులో పెట్టుకోవటానికి ఈ మౌనవ్రతం ఉపయోగపడుతుంది. సిధ్ధులు వాక్ శక్తిని పెంచుకోవటానికి, వాళ్ళని వాళ్ళు ప్రశాంతంగా వుంచుకోవటానికి ఎక్కువగా మౌనవ్రతాన్ని పాటిస్తారు.

మౌన వ్రతం వల్ల పొందే ప్రయోజనాలేంటి?
ఇలా మౌన వ్రతంతో విశ్రాంతి తీసుకున్న మనస్సు శరీరానికి, హీలింగ్ పవర్ పెరిగి, మరింత ఉత్సహాన్ని పుంజుకుని, శరీరం పనిచేస్తుంది. అందుకే, మౌనవ్రతం చేస్తున్నాం అంటూ , అన్ని పనులూ చేయ్యడం, టీవులు చూడటం, పాటలు వినడం, కుట్లు, అల్లికలు, లేక అర్థం లేని ముచ్చట్లలో పాలు పంచుకోవడం, మనకెంత మాత్రం మేలు చెయ్యదు సరికదా? ఒక విధంగా హానే చేస్తుంది.

మౌన వ్రతం వల్ల పొందే ప్రయోజనాలేంటి?
ఆరోగ్య పరంగా, ఆధ్యాత్మికంగా మౌన వ్రతం పాఠించడం వల్ల చాలా ఉపయోగం ఉంది. ఆధ్యాత్మికంగా మౌనాన్ని పాటిస్తే వాక్ సుద్ధి, వాక్ శక్తి పెరుగుతాయి. ఇంకా ఆవేం, కోపం, రోగాలను నియంత్రిస్తుంది.

మౌన వ్రతం వల్ల పొందే ప్రయోజనాలేంటి?
అలాగే మనం ఇతరులపై కోపతాపాల్ని ప్రదర్శించకుండా కొంత సంయమనాన్ని పాటించినట్లైతే అనవసరమైన గొడవలు ఉండవు. కానీ మౌన వ్రతాన్ని పాటించడం ద్వారా మనస్సులో ప్రశాంతత ఏర్పడుతుంది.

మౌన వ్రతం వల్ల పొందే ప్రయోజనాలేంటి?
మనకి వచ్చే రోగాలు చాలామటుకు మన ఆవేశాలతో, కోపంతో వస్తాయి. వాటిని నియంత్రించుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. మనకి ఎదుటివారిమీద వచ్చిన కోపాన్ని చూపించకుండా కొంత సంయమనాన్ని పాటిస్తే గొడవలు పెరగటం, అనవసరమైన పోట్లాటలు, అశాంతి వుండవు. సమస్యలు తేలిగ్గా పరిష్కారమవుతాయి. దీనిమూలంగా సామాజికంగా ఉపయోగం వున్నట్లేకదా.

మౌన వ్రతం వల్ల పొందే ప్రయోజనాలేంటి?
ఈ ప్రశాంతత ద్వారా టెంక్షన్స్ , అశాంతి, కోపతాపాలకు దూరంగా ఉండవచ్చునని పండితులు చెబుతున్నారు. అలాగే ఆరోగ్య పరంగానూ మౌన వ్రతం మేలు చేస్తుందని వారు అంటున్నారు.

మౌన వ్రతం వల్ల పొందే ప్రయోజనాలేంటి?
ఈ కలికాలంలో మనకి అంత వాక్శుధ్ధి అక్కరలేకపోవచ్చు...మనం ఏమైనా అంటే వెంటనే అది జరిగేంత వాక్శక్తి మన వాక్కుకి వుండాల్సిన అవసరం కూడా వుండకపోవచ్చు. కానీ ఈ టెన్షన్ల ప్రపంచంలో మన ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం మనకి చాలావుంది. అంటే కోపం వచ్చినప్పుడు మాట తూలకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం చాలావుంది. దానికోసం మౌనవ్రతం పాటించటం చాలా అవసరం. కనీసం కోపం వచ్చినప్పుడు మాట్లాడకుండా వుండటం అలవాటు చేసుకున్నా చాలు. ఏమంటారు?



Click it and Unblock the Notifications
