Latest Updates
-
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.? -
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?. -
ఒకే రాశిలో సూర్య కేతువులు.. వీరికి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.. లేదంటే.!
రాహూ కాలం అంటే ఏమిటి? ఈ కాలంలోనూ కొన్ని పనులు చేయొచ్చని తెలుసా...
రాహూ కాలం అంటే ఏమిటి? రాహు కాలంలో చేయాల్సిన మరియు చేయకూడని పనులేంటో ఇప్పుడే చూసెయ్యండి.
హిందూ పురాణాల ప్రకారం, రాహూకాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని మన పెద్దలు, పండితులు చెబుతుంటారు. ఈ సమయాన్ని చెడు సమయంగా భావిస్తారు.

అందుకే ఈ కాలంలో ప్రయాణం చేయకూడదు. వ్యాపారం ప్రారంభం వంటివి చేయకూడదని.. కళ్యాణం వంటి కార్యక్రమాలను, కొత్త పనులను చేయకుండా ఉంటారు.

అయితే రాహూ కాలం గురించి మనలో చాలా మందికి స్పష్టంగా తెలియదు. ఈ సందర్భంగా రాహూ కాలం అంటే ఏమిటి? ఈ కాలంలో చేయాల్సిన పనులేంటి.. చేయకూడని పనులేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రాహూ కాలం అంటే..
శాస్త్రాల ప్రకారం, శుభ ముహుర్తంలోనే శుభకార్యాలు చేయాలని పండితులు చెబుతారు. ఒక ప్రాంతంలో సూర్యోదయం నుండి సూర్యస్తయం వరకు ఉండే సమయాన్ని ఎనిమిది భాగాలుగా చేస్తే ఒక విభాగం. ఇందులోని ఒక భాగాన్ని రాహూకాలంగా పరిగణిస్తారు. ఈ రాహూ కాలం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రతిరోజూ సుమారు 90 నిమిషాల పాటు అంటే గంటన్నర సమయం రాహు కాలం ఉంటుంది. ప్రతిరోజూ ఒకేలా కూడా ఉండదు. అది సమయాన్ని బట్టి.. ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
ప్రతి సోమవారం రెండో భాగంలో.. శనివారం రోజున మూడో భాగంలో.. శుక్రవారం రోజున నాలుగో భాగంలో.. బుధవారం ఐదో భాగం.. గురువారం ఆరో భాగం.. మంగళవారం ఏడో భాగం.. ఆదివారం రోజున ఎనిమిదో భాగంలో వస్తుందని పండితులు చెబుతున్నారు.

రాహూ కాలం ఎప్పుడొస్తుంది..
ఉదాహణకు ఒక ప్రాంతంలో సూర్యోదయం ఉదయం 6 గంటలకు.. సూర్యస్తమయం 6 గంటలకు అవుతుందనుకుంటే.. ఉదయం 6 నుండి 7:30 గంటల వరకు అంటే.. మొదటి గంటన్నర సమయాన్ని వదిలేయాలి. తర్వాత సోమవారం రోజున 7:30 నుండి 9 గంటల వరకు, శనివారం రోజున ఉదయం 9 నుండి 10:30 గంటల వరకు, శుక్రవారం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, బుధవారం మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు, గురువారం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, మంగళవారం రోజున 3 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు, ఆదివారం రోజున సాయంత్రం 4:30 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రాహు కాలం ఉంటుంది.
ఈ రాహూ కాలాన్ని ఎందుకని అశుభంగా భావిస్తారు..

అపవిత్ర కాలంగా..
భారతీయ శాస్త్రాల ప్రకారం, సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, అంగారకుడు, శని, రాహూ, కేతువులు నవ గ్రహాలు. వీటిలో రాహు, కేతువులకు భౌతిక శరీరాలు లేకపోయినప్పటికీ..వీటికి సూర్యుడిని అస్పష్టం చేసే శక్తి ఉందని భావించారు. దీంతోనే సూర్యగ్రహణం ఏర్పడుతుందని భావించారు. హిందూ పురాణాల ప్రకారం రాహువు సూర్యుడిని మింగే పాము. ఇది చెడు సంకేతానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ఈ రాహూ కాలాన్ని అపవిత్రంగా భావిస్తారు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలను చేయరు.

ప్రతికూల శక్తి..
రాహు కాలంలో రాహూవు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ కాలంలో ఈ గ్రహం ప్రతికూల శక్తితో ఎక్కువ ప్రభావితమవుతుందని భావిస్తారు. అందుకే ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలను చేయరు. ఎంత ముఖ్యమైన పని ఉన్నా వాయిదా వేసుకుంటారు.

ఇవి చేయకండి..
* రాహూ కాలంలో విలువైన వస్తువులను కొనకూడదు.
* ఈ కాలంలో ప్రయాణాలు అస్సలు చేయకూడదు.
* రాహూ కాలంలో ఇంటి కొనడం.. అమ్మడం.. ఇల్లు ఓపెనింగ్, జ్యువెలరీ కొనడం వంటివి చేయకూడదు.
* రాహూ కాలంలో కొత్త పనులు ప్రారంభించకూడదు.
* రాహూ కాలంలో ఎంగేజ్ మెంట్, మ్యారేజ్, ఇతర ముఖ్యమైన పనులేవీ చేయకూడదు.

ఏమి చేయాలంటే..
సాధారణంగా రాహు కాలంలో ఏ పనులు చేయకూడదని, అది అశుభమని అందరికీ తెలిసిందే. అయితే ఈ కాలంలో కూడా కొన్ని పనులు చేయొచ్చు. వీటి గురించి చాలా మందికి తెలియదు. ఎవరి జాతకంలో అయితే కాల సర్ప దోషం ఉంటుందో.. దాని నివారణకు రాహు కాలమే సానుకూలమని పండితులు చెబుతారు. ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయట. రాహు గ్రహం యొక్క శాంతి కోసం పశువులకు ఆహారం తినిపించాలి.
ఒక ప్రాంతంలో సూర్యోదయం నుండి సూర్యస్తయం వరకు ఉండే సమయాన్ని ఎనిమిది భాగాలుగా చేస్తే ఒక విభాగం. ఇందులోని ఒక భాగాన్ని రాహూకాలంగా పరిగణిస్తారు. ఈ రాహూ కాలం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రతిరోజూ సుమారు 90 నిమిషాల పాటు అంటే గంటన్నర సమయం రాహు కాలం ఉంటుంది. ప్రతిరోజూ ఒకేలా కూడా ఉండదు. అది సమయాన్ని బట్టి.. ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
ఉదాహణకు ఒక ప్రాంతంలో సూర్యోదయం ఉదయం 6 గంటలకు.. సూర్యస్తమయం 6 గంటలకు అవుతుందనుకుంటే.. ఉదయం 6 నుండి 7:30 గంటల వరకు అంటే.. మొదటి గంటన్నర సమయాన్ని వదిలేయాలి. తర్వాత సోమవారం రోజున 7:30 నుండి 9 గంటల వరకు, శనివారం రోజున ఉదయం 9 నుండి 10:30 గంటల వరకు, శుక్రవారం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, బుధవారం మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు, గురువారం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, మంగళవారం రోజున 3 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు, ఆదివారం రోజున సాయంత్రం 4:30 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రాహు కాలం ఉంటుంది.



Click it and Unblock the Notifications