hanuman jayanti 2021 : రామునికి, హనుమంతునికి మధ్య యుద్ధం ఎందుకు జరిగింది?

రాముని కోసం అంత సాహసం చేసిన హనుమంతుడికి అదే దేవుడితో యుద్ధం అంటే చాలా మంది నమ్మటం లేదు.

రాముడు, హనుమంతుడు గురించి మన హిందూ మతంలో అనేక గ్రంథాలు.. ఇతిహాసాలు, పౌరాణిక కథలు ఉన్నాయి. వాటిలో ఎందులో చూసినా శ్రీరాముని గుండెలో పెట్టుకుని పూజించే పరమ పవిత్ర భక్తుడు ఆంజనేయుడు. అంజని పుత్రుడు అయిన హనుమంతుడు శ్రీరాముని కోసం ఎంతలా సేవ చేశాడో చాలా మందికి తెలుసు.

What is story behind the war between Lord Ram and Hanuman?

సీతాదేవి కోసం లంక వెళ్లి చూసి రమ్మంటేనే అక్కడ అంతా కాల్చి కొంప కొల్లేరు చేసి వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. రాముని కోసం అంత సాహసం చేసిన హనుమంతుడికి అదే దేవుడితో యుద్ధం అంటే చాలా మంది నమ్మటం లేదు. అయితే ఎల్లప్పుడూ రామ నామం జపించే హనుమంతుడు తప్పనిసరి పరిస్థితుల్లో రామునితో యుద్ధానికి దిగుతాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

పురాణాల ప్రకారం..

పురాణాల ప్రకారం..

రామాయణం ప్రకారం రావణుడు సీతాదేవిని ఎత్తుకెళ్లినప్పుడు.. సీతాదేవి జాడ కనిపెట్టేందుకు రాముడు, లక్ష్మణుడితో కలిసి హనుమంతుడు చాలా సహాయం చేస్తాడు. అంతేకాదు సీతాదేవి జాడ కనిపెట్టడమే కాదు.. ఎన్నో వివరాలను కూడా సీతాదేవికి, రామునికి తెలియజేస్తాడు.

నారదుని వల్లే..

నారదుని వల్లే..

ఒక రోజు అయోధ్యలోని రాజ ప్రాంగణంలో నారద మహర్షి శ్రీరాముడికి మరియు హనుమంతుడికి గొడవ పెట్టాలని నిర్ణయించుకున్నాడట. ఇందుకోసం ఓ ప్లాన్ కూడా వేసుకున్నాడు.

కాశీకి చెందిన రాజుతో..

కాశీకి చెందిన రాజుతో..

ఒకరోజు కాశీకి చెందిన ఓ రాజు శ్రీరాముడిని కలిసేందుకు వెళ్తున్న విషయాన్ని తెలుసుకున్న నారద మహర్షి ఆ రాజుతో తనకు ఓ సహాయం చేయమని అడిగాడట. ఏమి సహాయం చేయాలని నారదునిని అడిగితే, మీరు ముందు మాట ఇవ్వండి చెప్తాను అంటాడు. ఆ కాశీ రాజు అప్పుడు సరే అంటాడు.

విశ్వామిత్రుడిని తప్ప..

విశ్వామిత్రుడిని తప్ప..

ఆ కాశీరాజుకి ఇలా చెప్పాడు. మీరు అయోధ్య రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాత ఒక్క విశ్వామిత్రుడిని తప్ప అందరినీ గౌరవించండి. నారదునికి ఇచ్చిన మాట ప్రకారం ఆ కాశీరాజు అక్కడికి వెళ్లాక.. అందరినీ గౌరవించి విశ్వామిత్రుడిని ఏ మాత్రం పట్టించుకోడు. దీంతో విశ్వామిత్రుడు అవమానాన్ని తట్టుకోలేక.. సూర్యస్తమయం ముగిసేలోపు ఆ కాశీరాజు తల నా కాళ్ల మీద ఉండాలని రాముడిని ఆదేశిస్తాడు.

భయంతో హనుమంతుని దగ్గరికి..

భయంతో హనుమంతుని దగ్గరికి..

తన గురువైన విశ్వామిత్రుని ఆదేశానికి శ్రీరాముడు ఒప్పుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న కాశీరాజు భయంతో హనుమంతుని దగ్గరకు వెళ్లి తనను కాపాడమని వేడుకొంటాడు. అప్పుడు హనుమంతు నేను నిన్ను కాపాడతానని హామీ ఇస్తాడు.

గురువుకు ఇచ్చిన మాట ప్రకారం..

గురువుకు ఇచ్చిన మాట ప్రకారం..

తన గురువుకు ఇచ్చిన మాట ప్రకారం కాశీరాజుని మట్టుబెట్టేందుకు శ్రీరాముడు బయలుదేరుతాడు. అయితే అదే సమయంలో రాముడిని హనుమంతుడు అడ్డుకుంటాడు. దీంతో రాముడు హనుమంతుడిపై కోపం తెచ్చుకుని, ఆంజనేయునిపై బాణాలను సంధిస్తాడు.

రామనామమే గొప్పదని..

రామనామమే గొప్పదని..

అప్పుడు ఆంజనేయుడు ఆ బాణాలను స్వీకరిస్తూ.. రామ బాణం కన్నా రామ నామమే గొప్పదని జపిస్తాడు. అప్పుడు ఆ బాణాలు హనుమంతుడిని ఏమీ చేయలేకపోతాయి. చివరికి రాముడు, హనుమంతుడు కలిసి కాశీరాజుని కలిసి తనను విశ్వామిత్రుడి కాళ్ల దగ్గర పడేస్తారు. దీంతో శాంతించిన విశ్వామిత్రుడు తనని వదిలేస్తాడు.

చివర్లో నారదుడు..

చివర్లో నారదుడు..

ఇదంతా తెలుసుకున్న నారదుడు వారి వద్దకు వెళ్లి.. ఇదంతా తానే చేశానని, రామ బాణం గొప్పదా.. రామ నామం గొప్పదా తెలుసుకునేందుకు ఈ ప్లాన్ వేసినట్టు చెప్పాడు. రామ బాణం కన్నా.. రామ నామమే గొప్పదని రుజువైందని చెప్పాడు.

Desktop Bottom Promotion