Latest Updates
-
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి
కార్తీక మాసంలో తప్పకుండా చేయాల్సిన పూజలు
సాధారణంగా ప్రతి నెలలో పండుగలు వస్తాయి. కానీ కార్తీక మాసం అంటే.. అన్ని రోజులు పర్వదినాలే. చాలా పవిత్రంగా భావించే నెల ఇది. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. కార్తీకమాసం శివారాధనకు చాలా ముఖ్యమైనది. శివునికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసమిది. ప్రతి ఏటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి ఈ పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ నెలలో భక్తులంతా నిత్యం భోళాశంకరున్ని స్మరిస్తూ ఉండటం మంచిది.
కార్తీక మాసమంతా ఆధ్యాత్మికత కనిపిస్తుంది. జన్మజన్మల పాపాలను హరించి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీకం. స్నాన, దాన, జపాలు, పూజలు, వనభోజనాలు, దీపాలు ఈ కార్తీక మాసంలో చేయాల్సిన నిత్య పూజలు. ఈ నియమాలు పాటించడం వల్ల ముక్కంటి అనుగ్రహం పొంది తరించవచ్చు. ఈ కార్తీక మాసంలో చేయాల్సిన ముఖ్య పూజావిధానాలేంటో చూద్దాం..

కార్తీక స్నానాలు
భక్తులంతా మహాశివుడి అనుగ్రహం పొందాలంటే తెల్లవారు జామునే తలస్నానం చేసి, శివాలయానికి వెళ్లి.. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాలి. అప్పుడే ఆ ముక్కంటి కరుణా కటాక్షాలు పొందవచ్చు.

పూజలు
ఈ కార్తీక మాసంలో దేశం నలుమూలలా శివాలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు, అభిషేకాలు విశేషంగా నిర్వహిస్తారు. మహాశివుడికి ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో శివారాధన చేయడం వల్ల కోరినకోర్కెలు నెరవేరుస్తాడు.

దీపం
కార్తీక దీపానికి చాలా విశిష్టత ఉంది. కార్తీక మాసంలో దీపం చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగినది. పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికి నిత్యం ముఖ ద్వారానికి ఇరువైపులా సాయంకాలం దీపాలు వెలిగిస్తే మంచిది. శివాలయం ప్రాంగణంలో కూడా దీపాలు వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.

కార్తీక సోమవారాలు
కార్తీక సోమవారాలు చాలా పవిత్రమైనవి. సోమవారం, కార్తీకమాసం రెండూ శివునికి ప్రీతికరమైనవే. కాబట్టి కార్తీక సోమవారాలలో సాయంకాల సమయంలో శివాలయంలో ఉసిరికాయపై వత్తులు పెట్టి దీపం వెలిగించడం ఎంతో శ్రేయశ్కరం. నువ్వుల నూనె, ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, నెయ్యి, అవిశనూనె, ఇప్పనూనె, ఆముదం ఏదైనా దీపం వెలిగించడానికి వాడవచ్చు.

కార్తీక పౌర్ణమి
కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనది. కార్తీక మాసంలో ముప్పై రోజులలో దీపం పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి, చతుర్ధశి, పౌర్ణమి రోజు తప్పక దీపం పెడితే మంచిది. అంతేకాదు కార్తీక మాసంలో దీపం దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది.

ఉపవాసం
కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాసం ఆచరించి, రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేసినవాళ్లు ఆ పరమేశ్వరుని కరుణా కటాక్షాలు పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది.

వన భోజనం
కార్తీక సోమవారం లేదా కార్తీక మాసంలో ఏ రోజైనా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం మంచిది. ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షతలు, పుష్పాలతో పూజించాలి. అనంతరం పండితులను సత్కరించి అందరూ భోజనం చేయాలి. ఈ నియమాలను పాటించడం వల్ల శివానుగ్రహం కలిగి సర్వపాపములు నశిస్తాయని నమ్మకం. వనభోజన కార్యక్రమాలను నిర్వహించే వారికి పాపాల నుంచి విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

తులసి పూజ
పౌర్ణమిరోజు ఆవు నెయ్యితో తడిపిన దారపు వత్తులతో దీపాలు వెలిగించి తులసికోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. తర్వాత 365 వత్తులతో హారతివ్వాలి. నక్షత్రాలు కనుమరుగు కాకముందే ఈ పూజ చేస్తే చాలా మంచిది.



Click it and Unblock the Notifications