Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
గురుపౌర్ణమి రోజున ఇలా చేస్తే చంద్ర దోశం పోతుంది..!
ఆషాఢ పౌర్ణమి గురుపౌర్ణమి ఆషాఢ మాసంలో శుక్లపక్ష పున్నమి రోజు జరుపుకుంటాం. ఈ ఏడాది జూలై 20వ తేదీ శనివారం గురుపౌర్ణమి మర్నాడు అంటే జూలై 21 తేదీ పౌర్ణమి స్నానం, దానాలు చేయాలి. ఈ సమయంలో ప్రజలు తమ పూర్వీకులకు నివాళులర్పిస్తారు.

పితృ తర్పణాలు విడిచి దానాలు చేస్తారు. సనాతన ధర్మం విశ్వాసం ప్రకారం ఆషాడ పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల పుణ్యం లభిస్తుంది. ఆ రోజున మహాభారతాన్ని మానవాళికి అందించిన వేదవ్యాసుడు జన్మదినోత్సవం. గురువు పట్ల కృతజ్ఞతలు తెలియజేయాలి. గురువు కోసం గౌరవించే సందర్భమే గురుపౌర్ణమి.
ఆషాఢ పౌర్ణమి రోజున కొన్ని ప్రత్యేక పనులు చేయడం వల్ల పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది. ఆ రోజున పితృ తర్పణం రోజుగా కూడా పరిగణిస్తారు ఆ రోజు ఉపవాసముండి లక్ష్మీ స్తోత్రం లేదా కనకధారా స్తోత్రం పఠించండి. ఆ రోజు తామర పువ్వులు ఎర్ర గులాబీలు సమర్పించండి.
ఆ రోజున బ్రహ్మ ముహూర్తంలో కుదిరితే పవిత్ర నదిలో స్నానం చేయండి వారికి ఇష్టమైన ఆహారాన్ని తయారుచేసి ఆవు కాకి కుక్క మొదలైనవాటికి తినిపించండి. పౌర్ణమి రోజున చంద్రుడు పదహారు దశల్లో ఉదయిస్తాడు. చంద్రుణ్ని పూజించండి. పచ్చిపాలు, నువ్వులు నైవేద్యంగా ఇవ్వండి. దీని వల్ల చంద్రదోశం పోతుంది, తెల్లని వస్తువులు దానం చేయాలి. తెల్లని పువ్వులు, బియ్యం, పెరుగు, పాలు లాంటివి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం, తేజస్సు, కీర్తీ లభిస్తాయ్.
గురుపౌర్ణమి ఎలా వచ్చిందంటే ?
మహాభారత కావ్యాన్ని రాసిన మహర్షి జన్మదినాన్నే గురుపౌర్ణమిగా పరిగణిస్తాము. ఈ రోజుని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఎవరికైనా సరే మొదటి గురువు తల్లి, తరువాత మనకు ఘ్నానాన్ని ప్రసాదించే వ్యక్తి గురువు అవుతారు. అలాంటి అనంత గురువులను గౌరవించడానికే గురు పౌర్ణమి వుంది. గు అంటే అంధకారం లేదా అఘ్నానం, రువు అంటే నిరోధించడం, లేదా నశింపజేయడం, లేక పారద్రోలుట అని అర్థం. అంటే గురువు అన్న పదానికి అఘ్నాానాన్ని నశింపజేయు అని అర్థం. కొత్త విషయాలను చెబుతూ ప్రోత్సహించి మంచి దారిలో పయనించేలా చేసే అందరు గురువులకు గురుపౌర్ణమి రోజున కృతఘ్నతలు తెలిపి వారిని గౌరవించాలి.
గమనిక :పైన ఇవ్వబడిన వివరాలన్నీ ప్రముఖ జ్యోతిష్యులు పండితుల నుంచి సేకరించినవి, వీటిని మేము ఎట్టి పరిస్థితిలో దృవీకరించము.



Click it and Unblock the Notifications
